Telangana Municipal Elections 2026 LIVE: మేడ్చల్ మున్సిపాలిటీలో మధ్యాహ్నం 1 గంట వరకు 60 శాతం పైగా పోలింగ్
Telangana Municipal Elections 2026 LIVE Updates: తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు మొదలయ్యాయి. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు.
LIVE

Background
Telangana Municipal Elections 2026 LIVE Updates TS Local Body Election Voting Updates Turnout Latest News
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కోలాహలం మొదలైంది. మొత్తం 116 పురపాలక సంఘాల్లోని 2,569 వార్డులకు, అలాగే 7 నగరపాలక సంస్థల్లోని 412 డివిజన్లకు పోలింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. బుధవారం ఉదయం 7 గంటలకే ప్రారంభమైన ఈ పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఒకవేళ ఎక్కడైనా అనివార్య కారణాల వల్ల పోలింగ్ ఆగిపోతే, అక్కడ ఈ 12న రీపోలింగ్ నిర్వహిస్తారు. పారదర్శకత కోసం ప్రతి పోలింగ్ కేంద్రం లోపల, బయట వెబ్‌కాస్టింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా, శాంతిభద్రతల దృష్ట్యా బీఎన్‌ఎస్‌ఎస్ 163 సెక్షన్‌ను పోలీసులు అమలు చేస్తున్నారు.
ఈ నెల 13న ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నారు. అనంతరం ఎన్నికైన అభ్యర్థుల ద్వారా మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ ఛైర్‌పర్సన్లు, వైస్ ఛైర్‌పర్సన్ల పదవులకు ఫిబ్రవరి 16న పరోక్ష పద్ధతిలో ఓటింగ్ నిర్వహిస్తారు. మొత్తం 414 డివిజన్లు, 2,582 వార్డులకు ఎన్నికల నోటిఫికేషన్ రాగా.. ఇందులో 2 డివిజన్లు, 12 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మక్తల్‌లో 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మరణంతో అక్కడ ఎన్నిక వాయిదా పడింది. ప్రస్తుతం బరిలో ఉన్న 12,944 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు నేడు తేల్చనున్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు
కానగరపాలక (Corporations) విషయానికొస్తే, 412 డివిజన్లలో మొత్తం 2,225 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ఇందులో ప్రధానంగా కాంగ్రెస్ (410), బీఆర్ఎస్ (401), బీజేపీ (382) మధ్య పోటీ నెలకొంది. కరీంనగర్‌లో అత్యధికంగా 66 డివిజన్లకు 398 మంది పోటీ పడుతున్నారు. మరోవైపు, 116 పురపాలక సంఘాల్లోని 2,569 వార్డుల్లో 10,719 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మున్సిపాలిటీల్లో సైతం ప్రధాన పార్టీల మధ్యే గట్టి పోటీ నెలకొంది. ఆదిలాబాద్‌లో అత్యధికంగా 49 వార్డులకు 314 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
ఓటర్ల సౌకర్యార్థం ఇప్పటికే ఫొటోతో కూడిన ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తి చేశారు. ఓటర్లు టీపోల్ (T-Poll) యాప్ ద్వారా కూడా తమ ఎపిక్ నంబరుతో ఓటర్ స్లిప్పులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏదైనా సహాయం కావాలన్నా లేదా సందేహాల కోసం 92400 21456 నంబరుతో ప్రత్యేక కాల్ సెంటర్ అందుబాటులో ఉంచారు. అర్హులైన ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని పిలుపునిచ్చారు. అధికారులు పంపిణీ చేసిన ఓటరు స్లిప్పులతో పాటు ప్రభుత్వం గుర్తించిన ఏదైనా గుర్తింపు కార్డును చూపి ఓటు వేయవచ్చని ఆమె స్పష్టం చేశారు.
మెదక్ జిల్లాలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 57.88 శాతం పోలింగ్ నమోదు
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మెదక్ జిల్లాలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 57.88 శాతం పోలింగ్ నమోదు అయింది.
1. మెదక్ మున్సిపాలిటీ- 57.84 శాతం
2. రామాయంపేట మున్సిపాలిటీ- 60.79 శాతం
3. తుప్రాన్ మున్సిపాలిటీ- 57.07 శాతం
4. నర్సాపూర్ మున్సిపాలిటీ- 55.93 శాతం
సంగారెడ్డి జిల్లాలో ఒంటి గంట వరకు 52.35 శాతం పోలింగ్ నమోదు
సంగారెడ్డి జిల్లాలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 52.35 శాతం పోలింగ్ నమోదు
1. సంగారెడ్డి మున్సిపాలిటీ- 44.47 శాతం
2. సదాశివపేట మున్సిపాలిటీ- 56.62 శాతం
3. ఆందోల్ జోగిపేట మున్సిపాలిటీ- 54.97 శాతం
4. నారాయణఖేడ్ మున్సిపాలిటీ- 51.72 శాతం
5. జహీరాబాద్ మున్సిపాలిటీ- 51.32 శాతం
6. కోహిర్ మున్సిపాలిటీ- 54.51 శాతం
7. ఇస్నాపూర్ మున్సిపాలిటీ- 56.88 శాతం
8. గడ్డపోతారం - 61.02 శాతం
9. గుమ్మడిదల - 54.84 శాతం
10. ఇంద్రేశం - 58.21 శాతం
11. జిన్నారం- 62.33 శాతం























