Viveka murder case: వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ఇంకా సస్పెన్స కొనసాగుతోంది. ఈ పిటిషన్  త్వరగా విచారించాలన్న అవినాష్ రెడ్డి తరఫు లాయర్ విజ్ఞప్తిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి తిరస్కరించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు అందకుండా విచారణ ఎలా చేస్తాంటూ ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు చూసిన తర్వాత వాటి ఆధారంగా కేసును విచారిస్తామన్నారు. దీంతో మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఈ పిటిషన్ విచారణకు రానుంది. 


మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ ఇస్తూ గతంలోనే తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. దీనిపై వివేక కుమార్తె నర్రెడ్డి సునీత సుప్రీం కోర్టులో పైట్ చేసి విజయం సాధించారు. సునీత పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ గడువు జూన్ 30 వరకు పొడిగించింది ధర్మాసనం. 


తెలంగాణ హైకోర్టు ఈనెల 25 వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వగా.. దీనిపై సునీత  సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అవినాష్ కు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంపై సునీత సుప్రీంలో పిటిషన్ వేశారు. సునీత పిటిషన్ పై వాదనలు ముగిశాయి. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పూర్తిగా పక్కనపెట్టిన సుప్రీంకోర్టు.. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ సస్పెండ్ చేసింది. హైకోర్టు అలాంటి ఆదేశాలు జారీ చేయరాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. హైకోర్టులు ఇలాంటి ఉత్తర్వులు ఇస్తే కేసులో సీబీఐ దర్యాప్తుపై ప్రభావం చూపుతాయని అభిప్రాయపడింది.  మరోవైపు సీబీఐ దర్యాప్తు గడువును సుప్రీంకోర్టు జూన్ నెలాఖరు వరకు పొడిగించింది.


ఏప్రిల్ 25 వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ఎంపీ తరపు లాయర్లు సీజేఐ ధర్మాసనానికి రిక్వెస్ట్ చేశారు. మంగళవారం హైకోర్టులో విచారణ ఉన్నందున, అప్పటి వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని ఉత్తర్వులు ఇవ్వాలని కోరినా ప్రయోజనం లేకపోయింది. అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని, మీ రిక్వెస్ట్ మన్నిస్తే ఉత్తర్వులు పరస్పరం విరుద్ధంగా ఉంటాయని సీజేఐ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి కేసులను ప్రభావితం చేసేలా అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఉత్వర్వులు ఇవ్వకూడదని ధర్మాసనం పేర్కొంది.