Telangana DGP Office Constable Suicide:తెలంగాణ పోలీసు శాఖలో మరోసారి కలకలం రేగింది. డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ స్వామి తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న స్వామి ఆత్మహత్య పోలీసు వర్గాల్లో సంచలనంగా మారింది.
ఉదయం 5.30 సమయంలో వాష్ రూమ్‌లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు స్వామి. డెత్ స్పాట్‌లో ఒక సూసైడ్ నోట్ కూడా పెట్టినట్టు తెలుస్తోంది. తన భార్య పిల్లలను ఏమి అనవద్దని.. చనిపోయి దెయ్యం అయినా కూడా వాళ్ళను చూసుకుంటానని.. వాళ్ళు మంచివాళ్ళని ఓ నోట్ బుక్‌లో స్వామి సూసైడ్ నోట్ రాసి ఉంచాడు.
