FCDA భవనం పర్యావరణానికి హాని కలిగించకుండా నిర్మించినందుకు 'గ్రీన్ బిల్డింగ్' ట్యాగ్‌ను పొందింది. దేశంలోనే ఈ గుర్తింపు పొందిన అరుదైన భవనంగా నిలిచింది.
Bharat Future City Hyderabad:ఫ్యూచర్ సిటికి తరలిపోనున్న తెలంగాణ సచివాలయం! సీఎం, డిప్యూటీ సీఎంలకు ఛాంబర్లు సిద్దం!
ఫ్యూచర్ సిటీ అంటే ఇప్పట్లో కాని పనిలే అంటూ లైట్ తీసుకున్న ప్రతిపక్షాలకు, తాజాగా ఎఫ్‌సీడీఎ నిర్మాణం , అధునాత సౌకర్యాలు, భవిష్యత్ వ్యూహాలు చూస్తుంటే లైట్ తీసుకోవద్దు మిత్రమా అంటున్నారట.

- FCDA భవనం పర్యావరణహిత నిర్మాణానికి గ్రీన్ బిల్డింగ్ గుర్తింపు పొందింది.
- 30వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ, 1 ట్రిలియన్ ఆర్థిక లక్ష్యం.
- సచివాలయం తరలింపు ప్రచారం; సీఎం వారంరోజు ఇక్కడినుండి పాలన.
Bharat Future City Hyderabad:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టు ఫ్యూచర్ సిటీలో నిర్మాణం, అభివృద్ది ప్రణాళికలు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా దేశంలోనే అరుదైన గుర్తింపును సొంత చేసుకుంది ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారటీ బిల్డింగ్ (FCDA). పర్యావరణానికి ఏ మాత్రం హని కలిగించకుండా నిర్మించిన, అత్యాధునిక సదుపాయాలను ఏర్పాటు చేసినందుకు గ్రీన్ బిల్డిండ్ ట్యాంగ్‌ను దక్కించుకుంది. ఇప్పుడు ఈ సిటీకి సచివాలయాన్ని కూడా తరలించే ప్రక్రియ జరుగుతోందని ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రితోపాటు మంత్రుల ఛాంబర్స్ రెడీ అయ్యాయని అంటున్నారు.
భారత్ ఫ్యూచర్ సిటీలో ఏం జరుగుతోంది..?
హైదరాబాద్ మహానగరం తన పరిధి విస్తరించడంతోపాటు, జీహెచ్‌ఎంసీని విభజించడంతో పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ప్రయత్నంలో భాగంగా చేసిన ప్రయత్నాలు ఫలితాలు ఎలా ఉన్నా, ఫ్యూచర్ సిటీ అభివృద్దిపైనే కోటి ఆశలు పెట్టుకుంది రేవంత్ సర్కార్. ఏకంగా 30వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం వేగంగా జరుగుతోంది. భవిష్యత్‌లో 25 లక్షల నుంచి 30లక్షల జనాభా భారత్ ఫ్యూచర్ సిటీలో నివసించేలా మౌలిక సదుపాయాలు, అధునాతన వసతులు, విద్యా, ఉపాధి అవకాశాలు.. ఇలా ఒకటేమిటి తెలంగాణ అంటే ఫ్యూచర్ సిటీ, ఫ్యూచర్ సిటీ అంటే తెలంగాణ అనేంతలా కనీవినీ ఎరుగని రీతిలో వేగంగా అడుగులు ముందుకేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
దేశంలో నెంబర్ వన్‌గా నిలిచిన FCDA బిల్డింగ్ ప్రత్యేకతలివే..
ఫ్యూచర్ సిటి అభివృద్దిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం వేసిన తొలి అడుగే రికార్డ్ బద్దలు కొట్టింది. ఫ్యూచర్ సిటీ అభివృద్ది, నిర్మాణ పనులు పర్యావేక్షణ, పెట్టుబడులు, అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులను ఎప్పటికప్పుడు పరిశీలించి, పర్యవేక్షించేందుకు ఫ్యూచర్ సిటిలో నిర్మించిన తొలి భారీ నిర్మాణం ఫ్యూచర్ సిటి డెవలప్‌మెంట్ అథారిటీ బిల్డింగ్. ఈ నిర్మాణంలో ఎక్కడా పర్యావరణానికి హాని కలిగించే పదార్దాలు వినియోగించలేదు. పర్యావరణహిత నిర్మాణ ప్రమాణాలు పాటించినందుకు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ చేత తాజాగా గ్రీన్ బిల్డింగ్ గుర్తింపు పొందింది దేశం దృష్టిని ఆకర్షించింది. వర్షపు నీటి సంరక్షణకు ఇక్కడ చేసిన ప్రత్యేక ఏర్పాట్లు, 15కిలోవాట్ల సౌరశక్తి సామర్ద్యంతో విత్ ప్లాంట్‌ను నిర్మాణం, ఫ్యూచర్ సిటీ విద్యుత్ అవసరాలకు కొంత భాగం సౌరశక్తిని వినియోగించేలా ప్రణాళికలు రూపొందించడం ఇలా ఒకటేమిటి ఫ్యూచర్ సిటీలో అన్నీ వినూత్న ప్రయోగాలే. ఫ్యూచర్ సిటీలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.
విదేశీ ప్రతినిధులు, అధికారులు, పెట్టుబడిదారులు, బహుళజాతి సంస్థల ప్రతినిధులు ఎలక్ట్రికల్ వాహనాలు వినియోగించినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. FCDA పరిసరాల్లో ఉత్పత్తి అయ్యే సేంద్రియ వ్యర్థాలను వినియోగించేందుకు బయోడైజర్టర్ ప్లాంట్ ఏర్పాటు ఇక్కడ మరో ప్రత్యేకతగా చెప్పవచ్చు. బయోగ్యాస్‌తో పాటు సేంద్రియ ఎరువులను తయారు చేయడంతో, ఫ్యూచర్ సిటీ నూతన భవనం వ్యర్థాల నిర్వహణలో పర్యావరణహిత భవనంగా నిలిచింది. అందుకే ఫ్యూచర్ సిటికీ కేరాఫ్‌గా నిలిచే FCDA బిల్డింగ్ కాలుష్యరహిత నిర్మాణంగా నెట్ జీరో బిల్డింగ్ గా పేరు తెచ్చుకుంది.

వారంలో ఓ రోజు ఫ్యూచర్ సిటీ సచివాలయంలోనే సీఎం, మంత్రులు..
ఫ్యూచర్ సిటి ప్రాజెక్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. ఇక్కడ అభివృద్ది రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మాంచి బూస్ట్ ఇచ్చే అంశం. ఈ నేపథ్యంలో పెట్టుబడులు ఆకర్షించేందుకు, అభివృద్ది భరోసా కల్పించేందుకు నేరుగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. వారంలో ఓ రోజు ఫ్యూచర్ సిటీ నుంచే పరిపాలన నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సీఎం తోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సైతం FCDA అధునాతన భవనంలో ప్రత్యేక చాంబర్లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్‌కు సమీపంలో మరో అద్భుత నాల్గో నగరం భారత్ ఫ్యూచర్ సిటీ. ఇక్కడ యంగ్ ఇండియా యూనివర్సిటీ పనులు సైతం అత్యంతగా వేగంగా జరుగుతున్నాయి. AI టూ గ్రీన్ ఎనర్జీ వరకూ ఫ్యూచర్ సిటీలో ప్రతీ ప్రణాళికా ఓ అద్బుతమే. 3వేల ఎకరాల్లో ఫార్మా, బయో టెక్నాలజీలతోపాటు అంతర్జాతీయ విద్యాసంస్దలు, యూనివర్సిటీలు, స్కిల్ డెవల్ప్మెంట్ , ఇలా అంతర్జాతీయంగా టాప్ 50 కంపెనీలతోపాటు , 1ట్రిలియన్ ఎకానమి టార్గెట్ గా ముందు అనుకున్నది అనుకున్నట్లుగా నిర్మాణాలు పూర్తై, పెట్టుబడులు వెల్లువెత్తితే ఫ్యూచర్ సిటీతోపాటు సీఎంగా రేవంత్ కు సైతం తిరుగులేదనే టాక్ పొలిటికల్ సర్కిల్ గట్టిగా వినిపిస్తోంది.
Frequently Asked Questions
FCDA భవనం ఎలాంటి ప్రత్యేక గుర్తింపును పొందింది?
ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు ఎంత విస్తీర్ణంలో నిర్మించబడుతోంది?
ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు 30,000 ఎకరాల్లో శరవేగంగా నిర్మించబడుతోంది. ఇది 25 నుండి 30 లక్షల మంది ప్రజలకు మౌలిక సదుపాయాలు, విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
FCDA భవనం యొక్క పర్యావరణహిత లక్షణాలు ఏమిటి?
ఈ భవనంలో వర్షపు నీటి సంరక్షణ, 15 కిలోవాట్ల సౌరశక్తి ప్లాంట్, విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు మరియు సేంద్రియ వ్యర్థాల కోసం బయోడైజర్టర్ ప్లాంట్ వంటివి ఉన్నాయి. ఇది నెట్ జీరో బిల్డింగ్‌గా పేరు పొందింది.
ఫ్యూచర్ సిటీ నుండి ముఖ్యమంత్రి పాలన గురించిన ప్రణాళికలు ఏమిటి?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారంలో ఒక రోజు ఫ్యూచర్ సిటీ నుంచే పాలన నిర్వహించాలని ప్రణాళికలు చేస్తున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం ఛాంబర్లు కూడా అక్కడ సిద్ధంగా ఉన్నాయని సమాచారం.
ట్రెండింగ్ వార్తలు






















