Telangana Rain Alert: తెలంగాణలో వర్షాలు దండికొట్టనున్నాయి. హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారతీయ వాతవరణ కేంద్రం (ఐఎండీ) తెలిపింది. నేటి నుంచి రానున్న మూడు, నాలుగు రోజుల పాటు జోరు  వానలు కురుస్తాయని అంచనా వేస్తోంది. 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ కూడా జారీ చేసింది. ఐఎండీ (IMD) హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. 


నేడు వర్షాలు పడే జిల్లాలు..
తెలంగాణలోని ఆదిలాబాద్‌, జగిత్యాల, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, కరీంనగర్‌తోపాటు మెదక్‌లో ఇవాళ ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే... నిర్మల్‌, సంగారెడ్డి, మెదక్‌, నిజామాబాద్‌,  కామారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరించింది హైదరాబాద్‌ వాతావరణ శాఖ. ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది.. పలు చోట్ల పిడుగులు పడే  అవకాశం కూడా ఉందని తెలిపింది. ఈ ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించింది. 


రేపు వర్షాలు పడే జిల్లాలు...
రేపు (ఆగస్టు 25) కూడా తెలంగాణలో దాదాలు అన్నీ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. నిజామాబాద్‌, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, భూపలపల్లి, పెద్దపల్లి, జనగామ, జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం  ఉంది. అలాగే.. హైదరాబాద్‌తోపా సమీప జిల్లాలు అయిన మేడ్చల్‌, వికారాబాద్‌, మెదక్‌, భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు సమాచారం. కనుక.. ఆ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు  వాతవరణ శాఖ అధికారులు.


హైదరాబాద్‌లో వాతావరణం...(Hyderabad Weather)
మొన్నటి వర్షాలకు హైదరాబాద్‌ ప్రజలు వణికిపోయారు. రోడ్డెక్కాలంటేనే భయపడిపోయారు. ప్రధాన మార్గాల్లో కూడా వర్షపు నీరు నిలిచిపోవడం... షేక్‌పేట్‌, యూసుఫ్‌గూడలో వర్షపు నీటిలో వాహనాలు కొట్టుకుపోవడం చూశాం. షేక్‌పేట్‌ ఫ్లైఓవర్‌పై  గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి అవస్థలు పడ్డారు. దీంతో.. మళ్లీ హైదరాబాద్‌లో వర్షం పడుతుందన్న వార్త... నగర ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే.. హైదరాబాద్‌లో రానున్న మూడు నాలుగు రోజుల పాటు... ఉదయం  వాతావరణం చల్లగా ఉంటుందని.. సాయంత్రానికి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అప్పుడప్పుడు భారీ వర్షాలు కూడా కురవొచ్చని తెలిపారు. దీంతో... GHMC అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు  ప్రాంతాలపై దృష్టిపెడుతున్నారు. ఇక... భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న ప్రాంతాల్లో.. స్కూళ్లకు సెలవులు ఇచ్చే అంశంపై కూడా ఆలోచన చేస్తున్నారు.



ఎల్లుండి (ఆగస్టు 26) వరకు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు మాత్రమే పడతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లుండి వరకు భారీ వర్సాలు కురిసే అవకాశం  ఉన్నందున... అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. హైదరాబాద్‌ ప్రజలు... సాయంత్రం వేళల్లో అవసరం అయితే తప్ప.. బయటకు రావాలని సూచిస్తున్నారు. బయటకు వెళ్లే వారు... తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నీరు నిలిచిన రోడ్లపై వెళ్లే  సమయంలో వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు. 


Also Read; మరో సంచలనం దిశగా హైడ్రా- నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ కూల్చివేత