అన్వేషించండి

Uppal Real Estate: ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?

ఉప్పల్ సర్కిల్ నుంచి 3కిలోమీటర్ల మేర, ఎటు చూసినా భూముల ధరలు కోట్లకు పడగలెత్తాయి.గజం స్దలం 20వేలం నుంచి లక్షన్నరకు చేరుకుంది. కనెక్టివిటీ పెరగడంతో ఇళ్ల అద్దెలపై సైతం ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఉప్పల్ రియల్ రంగం మెట్రో, రింగ్ రోడ్ తో అభివృద్ధి చెందింది.
  • పెరిగిన భూముల ధరలు, కొనుగోలుదారులు లేక మార్కెట్ మందగించింది.
  • అపార్ట్మెంట్ నిర్మాణాలు వేగంగా జరుగుతూ, కొత్త జోష్ నెలకొంది.
  • హైదరాబాద్ అభివృద్ధి, జనాభా పెరుగుదలతో భవిష్యత్తులో ధరలు పెరగవచ్చు.

Uppal Real Estate:హైదరాబాద్ మహానగరంలో కళ్లంలేని గుర్రంలా ఎక్కడెక్కడికో దూసుకుపోయి, ఒక్కసారిగా రియల్ భూమ్ రిలాక్సైన ప్రాంతం ఉప్పల్. ఒకప్పుడు ఉప్పల్ అంటే అమ్మో హైదరబాద్ శివారు ప్రాంతం అనేవాళ్లు. ఇప్పుడు ఉప్పల్ వెళ్లాలంటే మెట్రో ఉందిగా బే ఫికర్ అంటూ,నగరం వ్యాప్తంగా ఎక్కడి నుంచి మరెక్కడికైనా వేగంగా ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. ఉప్పల్ రింగ్ రోడ్ ప్రభావంతో ఉప్పల్ రియల్ ధరలకు కొత్త రెక్కలు తొడిగినట్లైయ్యింది. మెట్రోకు ఆనుకుని నిర్మించిన అతి పెద్ద స్కైవాక్ బ్రిడ్జ్ సైతం ఉప్పల్ కు సరికొత్త మణిహారంలా మారింది. మెట్రో ద్వారా 35 నుంచి 40నిమిషాల్లో హైటెక్ సిటీ, మరో వైపు వరంగల్ కు చేరువలో ఉన్న ప్రాంతం కావడంతో గత రెండేళ్ల క్రితం వరకూ మాంచి దూకుడు మీదున్న ఉప్పల్ రియల్ రంగం ఇప్పుడు కాస్త రివర్స్ వాకింగ్ చేస్తోంది. ఇప్పటికే కొన్ని కాలనీలలో ఊహించని స్దాయిలో భూములు, ప్లాట్లు ధరలు పెరిగిపోయాయి. కొనేవాళ్లు ఎక్కువ ధరలు చెల్లించేందుకు ఆసక్తి చూపడంలేదు, పెరిగిన ధరలను తగ్గించి అమ్మేందుకు రియల్టర్లు ముందుకు రావడంలేదు. దీంతో తాత్కాలికంగా ఉప్పల్ రియల్ మార్కెట్ డౌన్‌లో ఉందంటున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు.Uppal Real Estate: ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?

గజం భూమి ఇప్పుడు 60వేల నుంచి 80వేలు పలుకుతోంది. ఓ వందగజాలు కొనాలంటే ఉప్పల్‌లో తక్కువలో తక్కువగా 60లక్షలు చెల్లించాల్సిందే. ఉప్పల్ పై రియల్టర్లు పెట్టుకున్న భారీ అంచనాలు చేరుకోలేక, భూములు కొనగోళ్లు తగ్గడంతో ఓపెన్ ప్లాట్ ల విషయంలో రియల్ వ్యాపారులు తీవ్ర నిరూత్సాహంలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఇక్కడ వేగంగా అపార్ట్మెంట్ నిర్మాణాలుతో అనేక కాలనీలలో కొత్త జోష్ నెలకొంది. నిర్మాణుష్య ప్రాంతాల్లో ముళ్ల పొదలను తవ్వి ,డబుల్ లైన్ రోడ్లుగా మార్చేశారు. ఉప్పల్ నలువైపులా ఎటు చూసినా, ఆశాకాన్ని తాకే నిర్మాణాలతో నిర్మాణ రంగం ఊహించని స్దాయిలో వేగం పుంజుకుంది. రెండేళ్ల క్రితం ఉప్పల్ సమీప ప్రాంతాల్లో ఖాళీ స్దలాలు ఎక్కువగా కనిపించేవి. ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. సొంత ఇళ్లు కొనాలంటే కోటిన్నర, అదే ఫ్లాట్ అయితే 80లక్షల పైమాటే అంటున్నారు స్దానికులు.Uppal Real Estate: ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?

ఉప్పల్ సర్కిల్ నుంచి మూడు కిలోమీటర్ల మేర , ఎటు చూసినా భూముల ధరలు కోట్లకు పడగలెత్తాయి. గజం స్దలం 20వేలం నుంచి ఇప్పుడు లక్షన్నరకుపైగా చేరుకుంది. కనెక్టివిటీ పెరగడంతో ఇళ్ల అద్దెలపై సైతం ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పడు పదివేల లోపు ఉండే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు 12 నుంచి 15వేల వరకూ పలుకుతోంది. మనకూ ఓ ఇళ్లు కావాలి, సొంత జాగా ఉండాలని కొనుగోలు చేయడం తప్ప, ఇన్వస్ట్మెంట్ కోసం అయితే ఉప్పల్ వైపు చూడొద్దంటున్నారు స్దానికులు. ఉప్పల్ ను ఆనుకుని మూసీనది ఒడ్డున ఉన్న భగాయత్ నగర్ ఇటీవల కాలంలో వేగంగా విస్తరించింది. రియల్ రంగం ఈ ప్రాంతంలో కనివినీ ఎరుగని రీతిలో అభివృద్ది చెందింది. hmda అనుమతితో విశాలమైన రోడ్లు, ప్రశాంతమైన కాలనీలతో అద్బుతంగా అభివృద్ది చెందుతోంది. ఉప్పల్ సర్కిల్ కు 4కిలోమీటర్ల దూరంలో ఉన్న రామాంతపూర్ ఇప్పటికే నివాస ప్రాంతంగా మంచి గుర్తింపు పొందింది. నాగోల్, బోడుప్పల్ , ఫీర్జాదిగూడాతోపాటు నాచారం వంటి ప్రారిశ్రామిక ప్రాంతాలు సైతం రియల్ ఎస్టేట్ అభివృద్దిలో ఉప్పల్ తో పోటీ పడుతూ నువ్వా,నేనా అంటున్నాయి.Uppal Real Estate: ఉప్పల్‌లో రివర్స్ గేర్ వేసిన రియల్ భూమ్.. ప్లాట్లు కొనేందుకు వెనకాడుతున్న జనం, కారణం అదేనా?

హైదరాబాద్ లో అనేక ప్రాంతాల్లో రియల్ రంగాన్ని ఊహించని దెబ్బకొట్టిన హైడ్రా, ఉప్పల్ రియల్ భూమ్ ను సైతం వదల్లేదు. ఇక్కడ ఎంతలా రియల్ రంగం అభివృద్ది చెందినా, హైడ్రా కూల్చివేతల ప్రభావం, భయం స్దానికుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో దశాబ్దాలుగా ఓపెన్ ల్యాండ్స్ ఎక్కువగా ఉండటం, అప్పట్లో ఆక్రమణలు సైతం అంతే స్దాయిలో జరిగాయి. ఇప్పుడు ఉప్పల్ లో స్దలం కొని, ఇళ్లు కట్టుకుంటే, హైడ్రా బుల్డోజర్ వస్తుందేమో, పాత లెక్కలు బయటకు తీసి కూల్చేస్దారనే ఆందోళన వెంటాడుతోంది. ఇలా హైడ్రా బుల్డోజర్ రియల్ వ్యాపారులను సైతం కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ప్రస్తుతానికి సైలెంట్ గా ఉందికదా అని ఉప్పల్ రియల్ మార్కెట్ ను తక్కువ అంచనా వేయలేం. విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరం, పెరుగుతున్న జనాభా, అందుబాటులో రవాణా సౌకర్యాలతో భవిష్యత్ లో ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో రియల్ భూమ్ సామాన్యుడికి నెరవేరని కలగా, అమాంతం పెరిగినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు.

Frequently Asked Questions

ఉప్పల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రస్తుతం ఎలా ఉంది?

ఉప్పల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రస్తుతం కొద్దిగా రివర్స్ వాకింగ్ చేస్తోంది. గతంలో ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపడం లేదు.

ఉప్పల్ లో భూమి ధరలు ఎంత వరకు ఉన్నాయి?

ప్రస్తుతం ఉప్పల్ లో గజం భూమి ధర 60 వేల నుండి 80 వేల వరకు పలుకుతోంది. వంద గజాల స్థలం కొనాలంటే కనీసం 60 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.

ఉప్పల్ లో అపార్ట్మెంట్ నిర్మాణాలు ఎలా ఉన్నాయి?

ఉప్పల్ లో అపార్ట్మెంట్ నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. అనేక కాలనీలలో కొత్త జోష్ తో నిర్మాణాలు పుంజుకున్నాయి.

ఉప్పల్ లో ఇళ్ల అద్దెలు ఎలా ఉన్నాయి?

కనెక్టివిటీ పెరగడంతో ఉప్పల్ లో ఇళ్ల అద్దెలు కూడా పెరిగాయి. గతంలో పది వేల లోపు ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పుడు 12 నుండి 15 వేల వరకు అద్దె పలుకుతున్నాయి.

ఉప్పల్ లో పెట్టుబడి పెట్టడం మంచిదేనా?

పెట్టుబడి కోసం కాకుండా సొంత ఇంటి కోసం ఉప్పల్ వైపు చూడాలని స్థానికులు సూచిస్తున్నారు. ప్రస్తుత ధరల పెరుగుదల, కొనుగోలుదారుల ఆసక్తిని బట్టి దీర్ఘకాలిక పెట్టుబడి గురించి ఆలోచించాల్సి ఉంటుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad మెట్రో విస్తరణను కేంద్ర మంత్రి అడ్డుకుంటున్నారు.. కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి: Revanth Reddy
Hyderabad మెట్రో విస్తరణను కేంద్ర మంత్రి అడ్డుకుంటున్నారు.. కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి: Revanth Reddy
Hyderabad Traffic Diversions: నాంపల్లిలో చేప ప్రసాదం పంపిణీ.. హైదరాబాద్‌లో 2 రోజుల పాటు ట్రాఫిక్ మళ్లింపులు!
నాంపల్లిలో చేప ప్రసాదం పంపిణీ.. హైదరాబాద్‌లో 2 రోజుల పాటు ట్రాఫిక్ మళ్లింపులు!
School Holidays: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
B.Tech Student Missing: హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
Advertisement

వీడియోలు

Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్
IND vs AFG 1st Test Day 1 Update | తోలి టెస్ట్ లో సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shreyas Iyer News: గెలుపే నా టార్గెట్.. ముంబై స్ట్రీట్ క్రికెట్ నుంచి చాలా నేర్చుకున్నా... టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్
గెలుపే నా టార్గెట్.. ముంబై స్ట్రీట్ క్రికెట్ నుంచి చాలా నేర్చుకున్నా... టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్
School Holidays: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
Tiger Hunt in Polavaram: ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
Ramani Kalyanam OTT : ఓటీటీలోకి రీసెంట్ రొమాంటిక్ డ్రామా - 3 వారాల్లోపే స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి రీసెంట్ రొమాంటిక్ డ్రామా - 3 వారాల్లోపే స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
B.Tech Student Missing: హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
Kamal Haasan : పుష్పక విమానం సీక్వెల్... 45 ఏళ్ల క్రితం స్టోరీ - కట్ చేస్తే సింగ్ గీతం... కమల్ హాసన్ చెప్పిన సీక్రెట్
పుష్పక విమానం సీక్వెల్... 45 ఏళ్ల క్రితం స్టోరీ - కట్ చేస్తే సింగ్ గీతం... కమల్ హాసన్ చెప్పిన సీక్రెట్
Manav Suthar Dream Debut: 25 ఏళ్ల రికార్డు బద్దలు.. టెస్ట్ డెబ్యూ లోనే మానవ్ సుతార్ హిస్టారికల్ రికార్డ్.. మొదటి ఓవర్లోనే ఊహించని ట్విస్ట్
25 ఏళ్ల రికార్డు బద్దలు.. టెస్ట్ డెబ్యూ లోనే మానవ్ సుతార్ హిస్టారికల్ రికార్డ్.. మొదటి ఓవర్లోనే ఊహించని ట్విస్ట్
UGC Net Exam schedule: యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
Embed widget