ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి నుండి దర్బంగా వరకు ప్రత్యేక రైలును సింగిల్ ట్రిప్ గా నడపనునున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక రైలు సౌకర్యం నవంబర్ 19వ తేదీన ( బుధవారం ఒక్క రోజు ) మాత్రమే అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే తన ప్రకటనలో పేర్కొంది. 07999 నెంబర్ గల ఈ రైలులో ప్రయాణికుల సౌకర్యార్థం స్లీపర్, జనరల్,సెకండ్ క్లాస్ కోచ్ లు అందుబాటులో ఉండనున్నట్లు తన ప్రకటనలో పేర్కొంది.
ఈ ప్రత్యేక రైలు ఆగే స్టేషన్లు విషయానికి వస్తే కాజీపేట, రామగుండం, మంచిర్యాల్, సిర్పూర్ కాగజ్‌నగర్, బాల్హార్‌షా, వడ్సా, గోండియా, దుర్గ్, రాయ్‌పూర్, బిలాస్‌పూర్, ఝార్సుగూడా, రూర్కేలా, రాంచి, మూరి, బోకారో స్టీల్ సిటీ, ధన్‌బాద్, ఛిత్తరంజన్, మధుపూర్, జసీదిహ్, ఝాజ్ఝా, కియూల్, బరౌనీ, సమస్తిపూర్ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. రైలు టైమింగ్‌లు మరియు టికెట్ బుకింగ్ వివరాల కోసం ప్రయాణికులు రైల్వే ఎంక్వైరీలను సంప్రదించాలని SCR సూచించింది.ఈ సింగిల్ ట్రిప్ రైలు సౌకర్యాన్ని అవసరం అయిన ప్రయాణికులు వినియోగించుకోవాలని సూచించారు.