Singer Mangli: తెలుగు రాష్ట్రాల్లో తన గాత్రంతో గుర్తింపు తెచ్చుకున్న సింగర్ మంగ్లీ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక నేరారోపణలను ఎదుర్కొంటున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు మంగ్లీ, ఆమె సోదరుడు శివ, మరికొందరు కలిసి సుమారు 100 మంది నుంచి భారీగా నిధులు వసూలు చేసినట్టు పంజాగుట్ట పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 

అసలేం జరిగింది?

బాధితులు, అడ్వకేట్‌ సుబ్బారావు కథనం ప్రకారం, రమావత్ మదు అనే వ్యక్తి ఈ కుంభకోణంలో కీలక పాత్రధారి అని తెలుస్తోంది. పదో తరగతి ఫెయిల్ అయిన మధు మంగ్లీకి ఉన్న క్రేజ్ అడ్డం పెట్టుకొని ప్రజలను నమ్మించినట్టు ఆరోపణలు ఉన్నాయి. వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే నెలకు 5 నుంచి 12 శాతం వరకు వడ్డీ ఇస్తామని బాధితులకు ఆశ చూపారు. మంగ్లీ ఈ వ్యాపారాల్లో భాగస్వామ్యం ఉందని ఆమె తమ్ముడు శివ స్వయంగా ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారని బాధితులకు నమ్మబలికారు. బాధితులను కోకాపేటలోని మంగ్లీ అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లడం, అక్కడ నోట్ల కట్టలకు చూపించం ద్వారా  ఇది వందల కోట్ల బిజినెస్‌ అని నమ్మించారు. 

కర్నూలు, డోన్, గద్వాల్, కర్ణాటకలోని వివిధ ప్రాంతాలకు చెందిన సామాన్య ప్రజలు ఈ స్కామ్‌లో లక్షాలాది రూపాయలు పోగొట్టుకున్నారు. డోన్ ప్రాంతానికి చెందిన ఒక బాధితుడు మాట్లాడుతూ, మంగ్లీ తమ్ముడు శివ స‌్వయంగా తమ ప్రాంతానికి వచ్చి సిమెంట్ ఫ్యాక్టరీ పెడుతున్నామని, పెట్టుబడులు పెట్టాలని కోరినట్టు తెలిపారు. కర్ణాటకకు చెందిన భీమమ్మ అనే మహిళ తనకు కొద్దిపాటి భూమిని అమ్మి ఐదు లక్షల పెట్టుబడిగా పెట్టి, ప్రస్తుతం రోడ్డున పడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. 

న్యాయవాదికి బెదిరింపులు

ఈ కేసులో మరో కీలక మలుపు ఏంటంటే బాధితుల తరఫున కేసును టేకప్ చేసిన అడ్వకేట్ సుబ్బారావుపై బెదిరింపులు రావడం. న్యాయవాది సుబ్బారావు పంజాగుట్ట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో, మంగ్లీ ఆమె సోదరుడు శివ, దర్శకుడు వేణు ఊడుగుల తనను ఫోన్‌లో బెదిరించారని పేర్కొన్నారు. కేసు వెనక్కి తీసుకోకపోతే యాక్సిడెంట్‌ చేయించి చంపేస్తామని వారు హెచ్చరించినట్టు ఆయన ఆరోపించారు. దీనిపై స్పందించిన పోలీసులు బీఎస్‌ఎస్‌ సెక్షన్ 351(2), 352 కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

ప్రస్తుతం పంజాగుట్ట‌ పోలీసులు ఈ పది కోట్ల ఫ్రాడ్ కేసులో లోతైన దర్యాప్తు చేస్తున్నారు. బాధితులు సమర్పించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్లు, ప్రామిసరీ నోట్లు, ఫొటోలను ఆధారాలుగా సేకరిస్తున్నారు. రావత్‌ మధును ఏ1గా, పాల్దీయ భరత్ చౌహాన్‌ ఏ2, పాల్దీయ శైలజ ఏ3, మంగ్లీ ఏ 5గా చేర్చినట్టు సమాచారం. బాధితులు తమకు న్యాయం చేయాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉన్నత పోలీసు అధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.  

సింగర్ మంగ్లీ, ఆమె సోదరుడిపై కేసు నమోదు 

సింగర్ మంగ్లీ(సత్యవతి)తో పాటు అతని సోదరు డు, మరో ముగ్గురిపై పంజాగుట్ట ఠాణాలో కేసు నమోదైంది. బెదిరించినట్లు తెలిపారు. తనకు ప్రాణహాని ఉందని సుబ్బారావు పోలీసులను ఆశ్రయించగా బీఎన్ఎస్ సెక్షన్ 351(2), 352 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వరుస వివాదాల్లో గాయని మంగ్లీ 

మంగ్లీపై కేవలం ఆర్థిక నేరారోపణలే కాకుండా, ఇటీవల ఆమె పుట్టిన రోజు వేడుకలు కూడా వివాదానికి దారి తీశాయ. చేవెళ్ల సమీపంలోని త్రిపుర రిసార్ట్‌లో అనుమతి లేకుండా అర్ధరాత్రి పూట డీజే మద్యం పార్టీ నిర్వహించినందుకు మంగ్లీపై పోలీసులు కేసు నమోదు చేశారు. పార్టీలో పాల్గొన్న వారిలో ఒకరికి గంజాయి పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. అయితే తనకు డ్రగ్స్‌తో ఎటువంటి సంబంధం లేదని, కేవలం కుటుంబం సభ్యులు, మిత్రులతో జరుపుకున్న వేడుక అని మంగ్లీ క్లారిటీ ఇచ్చారు.