హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది. సీనియర్ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ తన ఇంటి వద్ద కారు ఎక్కుతుండగా ఈ దాడి జరిగింది.
Hit And Run In Hyderabad: హైదరాబాద్‌లో ఘోరం.. కారుతో ఢీకొట్టి లాయర్ దారుణ హత్య! అదే కారణమా !
Hyderabad Crime News | హైదరాబాద్‌లో పట్టపగలే కారుతో ఢీకొట్టి లాయర్ ఖాజా మొయినుద్దీన్‌ను హత్య చేశారు. ఈ ఘటన నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం చోటుచేసుకుంది.

- మాసబ్ ట్యాంక్ లో సీనియర్ న్యాయవాది కాజా మొయినుద్దీన్‌ను కారుతో ఢీకొట్టి హత్య చేశారు.
- లాయర్‌ను కారు డోర్ తీస్తున్న సమయంలో వేగంగా వచ్చి ఢీకొని దుండగులు పరారయ్యారు.
- తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లాయర్ మృతి చెందారు.
- వక్ఫ్ భూముల రక్షణ లేదా వ్యక్తిగత కక్షల కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad Advocate Khaja Mohinuddin Murder | హైదరాబాద్: నగరంలోని మాసబ్‌ట్యాంక్ పరిధిలో శనివారం ఉదయం ఒక దారుణం చోటుచేసుకుంది. ఒక సీనియర్ న్యాయవాదిని దుండగులు కారుతో ఢీకొట్టి హతమార్చడం తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అడ్వకేట్ కాజా మొయినుద్దీన్ శనివారం ఉదయం తన ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఆయన తన కారులో బయలుదేరడాని సిద్ధంగా ఉన్నారు. కారు డోర్ తీస్తున్న సమయంలో ఓ కారు ఆయనను వెనుక నుండి వచ్చి అత్యంత వేగంగా ఢీకొట్టి వెళ్లిపోయింది.
ఈ ప్రమాదంలో అడ్వకేట్ మొయినుద్దీన్‌కు తీవ్రమైన గాయాలయ్యాయి. ఆయనను గమనించిన స్థానికులు, వెంటనే స్పందించి చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతూ లాయర్ మొయినుద్దీన్ మృతి చెందినట్లు డాక్టర్లు, పోలీసులు తెలిపారు.

లాయర్‌ను కారుతో ఢీకొట్టిన అనంతరం నిందితులు అక్కడి నుండి వేగంగా పరారయ్యారు. దుండగులు కారుతో ఢీకొట్టిన దృశ్యాలు ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ (CCTV) కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగిందా అనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలతో దర్యాప్తును వేగవంతం చేశారు.
Also Read: హైదరాబాద్ పోలీసుల వినూత్న ప్రయత్నం! దేశంలోనే తొలి ఏఐ కాప్‌రైటర్ యాప్ ప్రారంభం!
ఎవరీ ఖాజా మొయినుద్దీన్..
వక్ఫ్ బోర్డు భూముల రక్షణ కోసం నిరంతరం పోరాడుతున్నారు లాయర్ ఖాజా మొయినుద్దీన్. హైకోర్టు , సిటీ సివిల్ కోర్టులో ఆయన లాయర్‌గా సేవలు అందిస్తున్నారు. అయితే హిట్ అండ్ రన్ ఘటనలో కొందరు దుండగులు కారుతో ఢీకొట్టడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆయన తన ఇంటి వద్ద కారు ఎక్కుతున్న సమయంలో పక్కా ప్లాన్‌తో వెనుక నుంచి వాహనంతో బలంగా ఢీకొట్టి పరారైనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తీవ్రంగా గాయపడిన ఆయననను హాస్పిటల్‌కు తరలించినా ప్రయోజనం లేకపోయింది. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మొయినుద్దీన్ మృతి చెందారు.

కబ్జాకు గురవుతున్న కోట్ల రూపాయల విలువైన వక్ఫ్ బోర్డు భూములను కాపాడేందుకు ఆయన చట్టపరమైన పోరాటాలు చేస్తుండటమే ఈ హత్యకు ప్రధాన కారణమని వినిపిస్తోంది. లేక వ్యక్తిగత కక్షలతో హత్య చేశారా అనే కోణాల్లోనూ పోలీసులు విచారణ చేపట్టారు. నెంబర్ ప్లేట్ లేని కారుతో ఉద్దేశపూర్వకంగానే ఢీకొట్టి హత్య చేశారని సైతం వినిపిస్తోంది.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Frequently Asked Questions
హైదరాబాద్‌లో సీనియర్ న్యాయవాది హత్యకు గురైన సంఘటన ఎక్కడ జరిగింది?
న్యాయవాది ఖాజా మొయినుద్దీన్‌ను ఎలా హత్య చేశారు?
దుండగులు కారుతో ఆయనను వెనుక నుంచి వేగంగా ఢీకొట్టి, ఆపై పరారయ్యారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
ఈ హత్యకు కారణాలు ఏమిటని పోలీసులు అనుమానిస్తున్నారు?
వక్ఫ్ బోర్డు భూముల రక్షణ కోసం ఖాజా మొయినుద్దీన్ చేస్తున్న పోరాటమే ఈ హత్యకు కారణమని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే, వ్యక్తిగత కక్షలు కూడా కారణమై ఉండవచ్చని పోలీసులు విచారిస్తున్నారు.
కేసు విచారణలో పోలీసులు ఏ ఆధారాలను ఉపయోగిస్తున్నారు?
ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రత్యేక బృందాలతో దర్యాప్తును వేగవంతం చేశారు.
ట్రెండింగ్ వార్తలు























