అన్వేషించండి

Telangana News: తెలంగాణలో మూడు రోజులు జాగ్రత్త! 'సన్‌'చలన అలర్ట్ జారీ చేసిన అధికారులు!

Telangana News:తెలంగాణలో బయటకు రావాలంటే భయమేస్తోంది. సూరీడు నిప్పులు వాన కురిపిస్తున్నాడు. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల మార్కును దాటడంతో వాతావరణ శాఖ 20 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తెలంగాణలో 41-44 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు.
  • 20 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
  • వడదెబ్బ బాధితుల కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక బృందాలు.
  • ఏప్రిల్ 19 తర్వాత రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Telangana News: గత మూడు నాలుగు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉష్ణోగ్రతలను అసాధారణ స్థాయికి తీసుకెళ్తున్నాడు. రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్ వంటి ప్రాంతాల్లో సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు అదనంగా నమోదు అవుతున్నాయి. పరిస్థితి తీవ్రతను గమనించిన వాతావరణ శాఖ రాష్ట్రంలోని దాదాపు 20 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 

పాత రికార్డులను తిరగరాస్తున్న ఉష్ణోగ్రతలు

సాధారణం కంటే 1.5 నుంచి 4.5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరగడమే ఈ హెచ్చరికకు ప్రధాన కారణం. కేవలం పగలు మాత్రమే కాదు, రాత్రి సమయాల్లో కూడా ఉష్ణోగ్రతలు తగ్గకపోవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్‌నగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల వంటి జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి. 

అల్లాడిపోతున్న  ప్రజలు 

ఈ ఎండలు తీవ్ర ఎంతలా ఉంటుందంటే ఇప్పటికే పలు జిల్లాల్లో వడ దెబ్బకు ఒకరిద్దరు చనిపోయారు. మరికొందరు అపస్మారక స్థితికి వెళ్లాడు. అందుకే ఈ విషయాన్ని ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకుంది. 

ముందస్తు చర్యలకు కలెక్టర్లను ఆదేశించిన మంత్రి

ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం, విపత్తు నిర్వహణ శాక రంగంలోకి దిగాయి. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం దానకిశోర్ అన్ని జిల్లాల కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మాల్స్, బస్టాండ్‌, ప్రార్థనా స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో చలివేంద్రాలు ఏర్పాటుకు ఆదేశించారు. మంచినీటితోపాటు మజ్జిగ అందుబాటులో ఉంచాలని సూచించారు. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో వడదెబ్బ బాధితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆసుపత్రుల్లో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు , తాగునీరు సిద్దంగా ఉంచాలని స్పష్టం చేశారు. జిల్లా స్థాయి నోడల్ అధికారులను నియమించి, రోజువారీ పరిస్థితులపై నివేదికలు పంపాలని ప్రభుత్వం కోరింది. 

అసలు బయటకు రాకపోవడమే మంచిదని అధికారులు సూచన 

మధ్యాహ్నం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. దాహం వేయకపోయినా తరచుగా నీరు తాగాలని, ఓఆర్‌ఎస్, మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు తీసుకోవాలని చెబుతున్నారు. లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలి. బయటకు వెళ్లాల్సి వస్తే తలకు టోపీ లేదా గొడుగు వాడాలి. వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, బయట పని చేసే కార్మికులు మరింత అప్రమత్తంగా ఉండాలి. 

19 తర్వాత వానలు 

నిప్పులు కురిసే ఎండల నుంచి త్వలోనే ఊరట లభించనుంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఏప్రిల్ 19 నుంచి 22వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. క్యుమిలో నింబస్ మేఘాలు ఏర్పడటం వల్ల ఈదురుగాలులతో కూడిన వడగళ్లు వానలు పడొచ్చు.                       

Frequently Asked Questions

తెలంగాణలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి?

గత మూడు నాలుగు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉష్ణోగ్రతలను అసాధారణ స్థాయికి తీసుకెళ్తున్నాడు. రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నాయి.

వాతావరణ శాఖ ఎన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది?

వాతావరణ శాఖ రాష్ట్రంలోని దాదాపు 20 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సాధారణం కంటే 1.5 నుంచి 4.5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరగడమే దీనికి కారణం.

ప్రభుత్వం వడదెబ్బ బాధితుల కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది?

ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో వడదెబ్బ బాధితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆసుపత్రుల్లో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, తాగునీరు సిద్ధంగా ఉంచాలని స్పష్టం చేశారు. మాల్స్, బస్టాండ్‌, ప్రార్థనా స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

మధ్యాహ్నం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. దాహం వేయకపోయినా తరచుగా నీరు తాగాలి, లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలి.

తెలంగాణలో వానలు ఎప్పుడు కురిసే అవకాశం ఉంది?

ఏప్రిల్ 19 నుంచి 22 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. క్యుమిలో నింబస్ మేఘాలు ఏర్పడటం వల్ల ఈదురుగాలులతో కూడిన వడగళ్లు వానలు పడొచ్చు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi Hyderabad Tour: ప్రధానమంత్రి తెలంగాణ పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే!
ప్రధానమంత్రి తెలంగాణ పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే!
Online Betting: ఆన్‌లైన్ బెట్టింగ్‌లో భారీ నష్టాలు.. చోరీలు, హత్యలు చేస్తున్న కానిస్టేబుల్ దంపతులు అరెస్ట్
ఆన్‌లైన్ బెట్టింగ్‌లో భారీ నష్టాలు.. చోరీలు, హత్యలు చేస్తున్న కానిస్టేబుల్ దంపతులు అరెస్ట్
Hyderabad Crime News: సికింద్రాబాద్‌లో ఘోరం.. ప్రేమ వ్యవహారంలో బీటెక్ విద్యార్థి దారుణ హత్య! కత్తులతో పొడిచి చంపిన యువతి బంధువులు
సికింద్రాబాద్‌లో ఘోరం.. ప్రేమ వ్యవహారంలో బీటెక్ విద్యార్థి దారుణ హత్య!
KTR Cases: కేటీఆర్‌పై క్రిమినల్ కేసులు నమోదు! రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ శ్రేణుల కౌంటర్ అటాక్! 
కేటీఆర్‌పై క్రిమినల్ కేసులు నమోదు! రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ శ్రేణుల కౌంటర్ అటాక్! 
Advertisement

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Hyderabad Tour: ప్రధానమంత్రి తెలంగాణ పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే!
ప్రధానమంత్రి తెలంగాణ పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే!
Peddi Trailer : పెద్ది గాడి కోసం ఎంఎస్ ధోనీ! - ట్రైలర్ ఎప్పుడో తెలుసా?
పెద్ది గాడి కోసం ఎంఎస్ ధోనీ! - ట్రైలర్ ఎప్పుడో తెలుసా?
Women Smoking Effects : అమ్మాయిలు స్మోకింగ్ చేస్తే వచ్చే ఆరోగ్య సమస్యలు ఇవే.. జాగ్రత్త గర్ల్స్
అమ్మాయిలు స్మోకింగ్ చేస్తే వచ్చే ఆరోగ్య సమస్యలు ఇవే.. జాగ్రత్త గర్ల్స్
Vagina Health : యోని నుంచి దుర్వాసన వస్తోందా? ఇన్‌ఫెక్షన్లను దూరం చేసి వాసన రాకుండా చేసే ఫుడ్స్ ఇవే
యోని నుంచి దుర్వాసన వస్తోందా? ఇన్‌ఫెక్షన్లను దూరం చేసి వాసన రాకుండా చేసే ఫుడ్స్ ఇవే
Bhagyashri Borse : అందాల 'భాగ్య'మ్... చూపు తిప్పుకోలేం - మిస్టర్ బచ్చన్ బ్యూటీ క్యూట్ లుక్స్
అందాల 'భాగ్య'మ్... చూపు తిప్పుకోలేం - మిస్టర్ బచ్చన్ బ్యూటీ క్యూట్ లుక్స్
Barabar Premistha OTT : ఓటీటీలోకి సడన్‌గా యాటిట్యూడ్ స్టార్ మూవీ - 3 నెలల తర్వాత ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి సడన్‌గా యాటిట్యూడ్ స్టార్ మూవీ - 3 నెలల తర్వాత ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Dharani vs Bhubharati: ధరణి పోయి భూభారతి వచ్చినా అవే సమస్యలు - ప్రజాగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించదా?
ధరణి పోయి భూభారతి వచ్చినా అవే సమస్యలు - ప్రజాగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించదా?
YSRCP: డిజిటల్ వార్‌కు వైఎస్ఆర్‌సీపీ భారీ ఏర్పాట్లు - జగనన్న టెక్ ఫోర్స్ రెడీ - ఏపీలో పొలిటికల్ వార్ అంతా ఆన్‌లైన్లోనే!
డిజిటల్ వార్‌కు వైఎస్ఆర్‌సీపీ భారీ ఏర్పాట్లు - జగనన్న టెక్ ఫోర్స్ రెడీ - ఏపీలో పొలిటికల్ వార్ అంతా ఆన్‌లైన్లోనే!
Embed widget