By: ABP Desam | Updated at : 27 Sep 2022 04:15 PM (IST)
Edited By: jyothi
హైదరాబాద్ వాసులకు హెచ్చరిక- 6 గంటల వరకు బయటకు వెళ్లొద్దు
Rains in Hyderabad: హైదారాబాద్ నగరంలో వరుసగా రెండో రోజు కూడా ఉరుములతో భారీ వర్షాలు కురవనున్నట్లు హైదారాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో మరో రెండు గంటల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పిడుగల నుండి సురక్షితంగా ఉండమని సూచిస్తున్నారు. సాయంత్రం 6 గంటల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. వీలయినంత వరకు భాగ్య నగర వాసులు బయటకు రాకూడదన్నారు.
#HyderabadRains Update 🚨
— HYDERABAD Weatherman (@HYDmeterologist) September 27, 2021
06:15AM
As Outer bands of #CycloneGulab are moving WSW, i.e towards City,
Hence Light-Moderate 🌧 #Showers possible at most parts of the City.
Few places may get heavy spell.🌧
Will continue for 2 hours@HiHyderabad #HyderabadRains pic.twitter.com/q6ssEd7psj
#HyderabadRains
— Weather@Hyderabad 🇮🇳 (@Rajani_Weather) September 27, 2022
For the second consecutive day heavy showers at isolated places
Rain now spreading to LB Nagar - Nagole - Vanasthalipuram - Hayathnagar - Saroornagar - Abids - Charminar adjoining areas pic.twitter.com/Ntyttz1UuM
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు రాష్ట్రమంతటా విస్తరించాయి. తెలంగాణ నుంచి భారీ మేఘాలు వచ్చేస్తున్నాయి. ప్రస్తుతం నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలు నేరుగా ఏపీలోని ఎన్.టీ.ఆర్, పల్నాడు జిల్లాల్లోకి రాత్రి ప్రవేశించాయి. సెప్టెంబర్ 27 నుంచి ఆగస్టు 1 వరకు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురవనున్నాయి. వర్ష సూచనతో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.
మరికొన్ని గంటల్లో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సూర్యాపేట, కొమురం భీమ్, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు సైతం హైదరాబాద్ ను మేఘాలు కమ్మేశాయి. హైదరాబాద్ లో నేడు సైతం కొన్ని ప్రాంతాల్లో వర్ష సూచన ఉంది. అయితే 28, 29, 30 తేదీలు చాలా ముఖ్యమైనవి. ఈ మూడు రోజులు భారీ వర్షాలు పడేందుకు చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వర్షం పడకపోతే మధ్యాహ్నానికి ఉక్కపోత సైతం అధికం కావడంతో నగరవాసులు ఇబ్బంది పడతారు.
ఏపీలోనూ భారీ వర్షాలు...
ఏపీలో మరో 5 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదు కానుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దిగువ ట్రోపో వాతావరణంలో వాయువ్య దిశ నుంచి ఏపీ, యానాంలో గాలులు వీస్తున్నాయి. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం మణ్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, కాకినాడ, ఉభయ గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో, యానాంలోనూ ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయి. ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచనున్నాయి. గాలులు వేగంగా వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లడం అంత క్షేమదాయకం కాదని హెచ్చరించారు.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
ఈ ప్రాంతాల్లో మరో నాలుగైదు రోజులపాటు మోస్తరు వర్షపాతం నమోదు కానుంది. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు ఉమ్మడి గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ వెదర్ మ్యాన్, అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేశాయి. రాయలసీమలోనూ భారీ వర్షాలున్నాయి. కర్నూలు, నంద్యాల, కడప, అనంతపురం, తిరుపతి జిల్లాలతో పాటు అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలున్నాయి. నీళ్లు నిలిచి ఉంటే చోట జాగ్రత్తగా ఉండాలని, నీటి ప్రవాహాన్ని దాటి వెళ్లే ప్రయత్నాలు చేయకూడదని ప్రజలను అధికారులు హెచ్చరించారు.
TS SET: టీఎస్ సెట్ - 2023 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డుల డౌన్‌లోడ్ లింక్ ఇదే
బేగంపేట ఎయిర్ పోర్టులో రేవంత్ కు ఘన స్వాగతం, రాత్రి గచ్చిబౌలిలో బస
Traffic Restrictions in Hyderabad: సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, గురువారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
Pushpa Actor Arrest: ‘పుష్ప’ నటుడు కేశవ అరెస్టు, యువతి సూసైడ్‌తో కేసు నమోదు
Telangana New CM: ఎల్బీ స్టేడియానికి సీఎస్ శాంతి కుమారి, రేవంత్ ప్రమాణ స్వీకార ఏర్పాట్ల పరిశీలన
SI Exam Results: ఎస్‌ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల, ఫైనల్ ఆన్సర్ 'కీ' అందుబాటులో
Revanth Reddy News: ముగిసిన రేవంత్ ఢిల్లీ పర్యటన, మళ్లీ వెనక్కి రమ్మని అధిష్ఠానం పిలుపు - మరో భేటీ
Ravi Bishnoi: టీ20 నెంబర్ వన్ బౌలర్ రవి బిష్ణోయ్, చరిత్ర సృష్టించిన యువ స్పిన్నర్
Telanagna Politics: కాంగ్రెస్ కేసీఆర్‌నే ఫాలో కానుందా? కేసీఆర్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందా? లేక కేసీఆరే షాక్ ఇస్తారా?
/body>