GHMC News :  అసెంబ్లీ అయినా .. స్థానిక సంస్థల పాలక మండలి సమావేశం అయినా విపక్షాలు నిరసన వ్యక్తం చేయడం సహజం. ఆ నిరనస ఒక్కో సారి శృతి మించి ఉంటుంది. అంత మాత్రానికే అధికారులు ఫీల్ కారు. ఏదైనా అధికార, ప్రతిపక్షాలు చూసుకుంటాయి.అయితే హైదరాబాద్ అధికారులు మాత్రం ప్రతిపక్ష బీజేపీ నేతల తీరుకు ఫీలయ్యారు. సమావేశానికి సహకరించకుండా బీజేపీ తీరుకు నిరసనగా బాయ్ కాట్ చేశారు. దీంతో వివాదం ప్రారంభమయింది. 


జీహెచ్‌ఎంసీ పాలక మండలి సమావేశంలో రచ్చ 


గ్రేటర్ హైదరాబాద్ పాలకమండలి సమావేశం రచ్చ రచ్చ అయింది.  వాటర్‌బోర్డు కార్యాలయం మంగళవారం ఉదయం రణరంగంగా మారిన సంగతి విదితమే. సివరేజ్‌ నిర్వహణ చేపట్టడం లేదని, పూడిక తీయట్లేదని బీజేపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు మెరుపు ధర్నాకు దిగారు. డ్రైనేజీల నుంచి తొలగించిన వ్యర్థాలను తీసుకొచ్చి వాటర్‌ బోర్డు కార్యాలయంలో పారబోశారు. ఎండీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. ఆఫీస్ ​ముందు బైఠాయించిన కార్పొరేటర్లు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కారణంగా జీహెచ్‌ఎంసీ కౌన్సిల్‌ సమావేశాన్ని అధికారులు బహిష్కరించారు. జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్లు, వాటర్‌ బోర్డు అధికారులు బయటకు వెళ్లిపోయారు. జీహెచ్‌ఎంసీ చరిత్రలోనే మొదటిసారిగా అధికారులు బాయ్‌కాట్‌ చేశారు. బీజేపీ కార్పొరేటర్ల తీరుపై అధికారులు నిరసన తెలిపారు.                             


అధికారులు బాయ్ కాట్ చేయడంతో సమావేశం వాయిదా                                                  


 గతంలో విపక్ష కార్పొరేటర్లు మాత్రమే సమావేశాలను బహిష్కరించేవారు. తాజాగా అధికారులే సమావేశాలను బాయ్‌కాట్‌ చేశారు. కాగా, జీహెచ్‌ఎంసీ చరిత్రలోనే అధికారులు బాయ్‌కాట్‌ చేయడం ఇదే మొదటిసారి.  విపక్ష కౌన్సిలర్లు లైఫ్​ జాకెట్​ ధరించి నిరసన తెలిపారు. చుక్క చినుకు పడితే నగరమంతా అల్లకల్లోలమవుతుందని తెలిపారు. ప్రజల సమస్యలపై పరిష్కరిస్తామని మేయర్​ విజయలక్ష్మి  తెలిపారు. గత సమావేశాలను విపక్ష కార్పొరేటర్లు బహిష్కరించారని తెలిపారు. వారు ఇలా చేయడం చాలా బాధాకరమని విజయలక్ష్మి పేర్కొన్నారు.  సమావేశం సక్రమంగా జరగకుండా బీజేపీ ఎమ్మెల్సీలు ఆటంకం కలిగిస్తున్నారన్నారు.  దీంతో మేయర్​ విజయలక్ష్మి సమావేశాన్ని వాయిదా వేశారు. సభ్యుల విఙ్ఞప్తి మేరకే సభను ఆలస్యంగా ప్రారంభించామన్నారు. 


దురదృష్టకరమన్న మేయర్ గద్వాల్ విజయలక్ష్మి                                           
 
ఐదు నెలల తరువాత ప్రజల సమస్యలు పరిష్కారం కోసం..అన్నీ పార్టీల నేతలతో చర్చించిన తరువాతే సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు  మేయర్ గద్వాల్ విజయలక్షఅమి తెలిపారు. అయితే బీజేపీ కార్పొరేటర్లు  సంస్కారం లేకుండా మాట్లాడారని మేయర్​ వాపోయారు.  సభ సజావుగా జరగకుండా ఉండాలని బ్లాక్​ షర్ట్స్​ ధరించి నిరసనకు దిగారన్నారు.