ఈ దోపిడీలో మొత్తం 8 మంది నేపాలీ గ్యాంగ్ సభ్యులు పాల్గొన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
Hyderabad Crime News: హైదరాబాద్‌లో మరో నేపాలీ గ్యాంగ్ అరాచకం.. ఓ ఇంట్లో 75 తులాల బంగారం, 20 కిలోల వెండి చోరీ
Nepal Gang Crime News | జవహర్‌నగర్‌లో నమ్మకంగా పనిచేస్తున్న నేపాలీ జంట మరో ఆరుగురితో కలిసి రిటైర్డ్ ప్రొఫెసర్ దంపతులపై దాడి చేసి, మత్తుమందు ఇచ్చి 75 తులాల బంగారం, 20 కిలోల వెండి దోచుకెళ్లారు.

- నేపాలీ ముఠా దంపతులను కట్టేసి బంగారం, వెండి దోచుకెళ్లింది.
- బర్త్‌డే వేడుకల పేరుతో ఇంట్లోకి చొరబడి దాడి చేశారు.
- దంపతులకు మత్తుమందు ఇచ్చి, తాళం వేసి పరారయ్యారు.
- పని మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
Hyderabad Crime News | హైదరాబాద్: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు మరువక ముందే హైదరాబాద్‌లో మరోచోట నేపాల్ గ్యాంగ్ రెచ్చిపోయింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేపాలీ గ్యాంగ్ ఓ ఇంట్లో దంపతుల కాళ్లు, చేతులు కట్టేసి మత్తు మందు ఇచ్చి 75 తులాల బంగారం, 20 కిలోల వెండి ఎత్తుకెళ్లింది. మొత్తం 8 మంది నేపాల్ గ్యాంగ్ ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. జవహర్‌నగర్ పోలీసులు ఆ ఇంట్లో హార్డ్ డిస్కులు, సీసీ కెమెరా ఫుటేజీని సేకరించారు.
బర్త్‌డే సెలబ్రేషన్ అని నమ్మించి మోసం..
మల్కాజిగిరి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కౌకూరు గోల్ఫ్ ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్న రిటైర్డ్ ప్రొఫెసర్ మురళీధర్ మోహన్ (68), ఆయన భార్య డాక్టర్ విజయలక్ష్మి (58) వద్ద కొంతకాలంగా ఓ నేపాలీ జంట నమ్మకంగా పనిచేస్తోంది. సోమవారం రాత్రి తమ బంధువుల బర్త్ డే వేడుకలు చేసుకుంటామని అడిగితే అందుకు వారు ఒప్పుకున్నారు. కొందరిని ఇంటికి పిలిపించారు. ఆ తరువాత రిటైర్డ్ ప్రొఫెసర్ దంపతులు ఆ సిబ్బందితో బర్త్ డే కేక్ కట్ చేపించారు. తరువాత భోజనం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా దాడి చేసి, వారిని బెదిరించి కాళ్లు, చేతులు కట్టేశారు. తమను ప్రాణాలతో వదిలేయమని దంపతులు వేడుకోవడంతో, ఇంట్లోని నగలు, విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు.
మత్తు పదార్థాలు తినిపించి పరారీ..
దోపిడీ అనంతరం నిందితులు దంపతులకు మత్తుమందు కలిపిన పదార్థాలను తినిపించి, గదిలో బంధించి బయట తాళాలు వేసి పరారయ్యారు. మత్తు ప్రభావం వల్ల మంగళవారం మధ్యాహ్నం వరకు వారు స్పృహలోకి రాలేదుని తెలుస్తోంది. ఆ తరువాత ప్రొఫెసర్ కిటికీలో నుంచి కేకలు వేయడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సుమారు ఎనిమిది మంది ఈ దోపిడీలో పాల్గొన్నట్లు ప్రాథమిక సమాచారం అందగా, మల్కాజిగిరి సీపీ సుమతి ఘటనాస్థలిని సందర్శించి దర్యాప్తును వేగవంతం చేశారు. నేపాలీ ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న పోలీసులు
హైదరాబాద్‌లో నేపాల్ గ్యాంగ్ లతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పనిచేస్తున్న వారిపై ఇంటి యజమానులు నిఘా ఉంచాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ సీపీ నగర వాసులకు సూచించారు. పని మనుషుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని, ఏమైనా అనుమానం ఉంటే తమకు సమాచారం అందించాలని కోరారు. అనుమానిత వ్యక్తులను ఇళ్లోకి రానివ్వకూడదని, బంగారం, నగదు లాంటివి జాగ్రత్తగా ఉంచుకోవాలని.. వాటి గురించి పనిమనుషులు, సిబ్బందికి అంతగా తెలియకుండా జాగ్రత్తలు సూచించారు. అంతలోనే మల్కాజిగిరి పరిధిలో నేపాలీ గ్యాంగ్ బర్త్ డే వేడుకలు చేసుకుంటామని యజమానులను నమ్మించి మోసం చేశారు.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Frequently Asked Questions
జవహర్ నగర్ లో జరిగిన దోపిడీలో ఎంతమంది పాల్గొన్నారు?
దోపిడీలో ఎంత విలువైన సొత్తును దొంగిలించారు?
ఈ సంఘటనలో 75 తులాల బంగారం, 20 కిలోల వెండిని దొంగిలించారు.
నిందితులు బాధితులను ఎలా బెదిరించారు?
నిందితులు రిటైర్డ్ ప్రొఫెసర్ దంపతులను బెదిరించి, వారి కాళ్లు, చేతులు కట్టేసి, మత్తుమందు కలిపిన పదార్థాలను తినిపించారు.
పోలీసులు ప్రజలకు ఎలాంటి సూచనలు ఇచ్చారు?
పని మనుషుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అనుమానిత వ్యక్తులను ఇంట్లోకి రానివ్వకూడదని, విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.
ట్రెండింగ్ వార్తలు






















