Maganti Gopinath Family Issue: జూబ్లిహిల్స్ ట్విస్ట్ - తెరపైకి మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కుమారుడు - సునీత నామినేషన్ తిరస్కరిచాలని ఫిర్యాదు
Jublihills ByElection: మాగంటి సునీత నామినేషన్ తిరస్కరించాలని మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కుమారుడు ఫిర్యాదు చేశారు. సునీత అఫిడవిట్ తీసుకుని నామినేషన్ ను ఎన్నికల అధికారులు ఆమోదించారు.

Maganti Gopinath Family Issue: జూబ్లిహిల్స్ ఉపఎన్నికలలో ట్విస్ట్ చోటు చేసుకుంది. మాగంటి గోపినాథ్ కు సునీత న్యాయపరంగా సతీమణి కాదని ఆయనతో సహజీవనంలో మాత్రమే ఉన్నారని తారక్ ప్రద్యుమ్న కొసరాజు అనే యువకుడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. నామినేషన్ల పరిశీలన సమయంలో తారక్ ప్రద్యుమ్న కొసరాజు ఈ ఫిర్యాదు దాఖలుచేశారు. తారక్ ప్రద్యుమ్న, తన తండ్రి అసలైన వారసుడిని తానొక్కడినే అని పేర్కొంటూ ఎన్నికల సంఘం (ఈసీ)కి ఫిర్యాదు చేశారు. గోపినాథ్ భార్యగా చెప్పుకుంటున్న సునీతతో తన తండ్రికి చట్టబద్ధమైన వివాహం జరగలేదని, వారిద్దరూ కేవలం లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో మాత్రమే ఉన్నారన్నారు. తన తల్లి మాలినీ దేవితో మాత్రమే గోపీనాథ్‌కు చట్టబద్ధమైన వివాహం అయిందన్నారు. ఇప్పటికీ అది చెల్లుబాటులోనే ఉందని.. తాను ఒక్కడినే న్యాయపరంగా వారసుడ్నని.. ఆమె నామినేషన్ ను తిరస్కరించాలని కోరారు.
"నా తండ్రి మాగంటి గోపినాథ్, నా తల్లి మాలినీ దేవికి చట్టబద్ధమైన విడాకులు ఇవ్వకుండానే సునీతతో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. వారిద్దరి మధ్య ఎలాంటి చట్టబద్ధ వివాహం జరగలేదు" అని ఫిర్యాదులో పేర్కొన్నారు. "సునీత గోపినాథ్‌ను పెళ్లి చేసుకోలేదు కదా, మరి ఎన్నికల అఫిడవిట్‌లో భర్త అని ఎలా పేర్కొన్నారు? ఇది చట్టవిరుద్ధం" అని తారక్ ఆరోపించారు. ఈ అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇవ్వడం ఎన్నికల చట్టాలకు విరుద్ధమని నామినేషన్ చెల్లదని వాదించారు.
🟥 Big Breaking News
— Telangana365 (@Telangana365) October 22, 2025
మాగంటి గోపినాథ్ అసలైన వారసుడిని నేనేనని ఈసీకి ఫిర్యాదు చేసిన కుమారుడు తారక్ ప్రద్యుమ్న
మాజి ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తన అసలైన వారసుడిని తానొక్కడినేనని కుమారుడు తారక్ ప్రద్యుమ్న ఎన్నికల సంఘానికి సంచలన ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదులో ఆయన పేర్కొన్న వివరాలు:… pic.twitter.com/HbF3KP0Kkj
మాగంటి గోపినాథ్ మొదటి భార్య మాలినీ దేవి అని.. కుటుంబ విభేదాల కారణంగా గోపినాథ్, మాలినీ దేవి విడిపోయినప్పటికీ, చట్టబద్ధ విడాకులు జరగలేదని తారక్ ఆరోపిస్తున్నారు. తారక్ ప్రద్యుమ్న ఫిర్యాదు ఈసీకి చేరిన వెంటనే, సంబంధిత అధికారులు పరిశీలన ప్రారంభించారు. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇస్తే, ఎన్నికల చట్టం ప్రకారం ఎమ్మెల్యే పదవి రద్దు కావచ్చు లేదా జరిమానా విధించవచ్చు. అయితే సునీత.. ఈ అంశంపై మాగంటి సునీత డిక్లరేషన్ సమర్పించడంతో నామినేషన్ ఆమోదించారు.





















