Lionel Messi Vs Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాజకీయాలతోపాటు ప్రస్తుతం క్రీడా మైదానంలో తన ప్రతిభను చాటుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. 56 ఏళ్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. 

Continues below advertisement

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే వారం శనివారం (డిసెంబర్ 13, 2025)న జరగనున్న పెద్ద ఫుట్‌బాల్ మ్యాచ్‌కు సన్నద్ధమయ్యారు. ఈ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని జట్టు ప్రపంచ ఫుట్‌బాల్ ఐకాన్, ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్‌గా పేరుగాంచిన లియోనెల్ మెస్సీ జట్టుతో తలపడనుంది.

హైదరాబాద్‌లో భారీ ఫుట్‌బాల్ మ్యాచ్

ప్రపంచ ఫుట్‌బాల్ ఐకాన్ లియోనెల్ మెస్సీ, తెలంగాణ సీఎం  రేవంత్ రెడ్డి జట్ల మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ ఇవాళ (డిసెంబర్ 13, 2025న) హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ఈ చారిత్రాత్మక మ్యాచ్‌ను హైదరాబాద్‌లో నిర్వహించే అవకాశం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా చాలా కసరత్తు చేయడం ఈ మ్యాచ్‌పై ఆసక్తని పెంచేసింది.  

Continues below advertisement

ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో చెమటలు చిందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

ఈ భారీ ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం (డిసెంబర్ 1, 2025)న హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నా రెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCHRD) గ్రౌండ్‌లో ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. ఈ సమయంలో ఆయన స్వయంగా మైదానంలో పరిగెత్తుతూ, బాల్‌ను నియంత్రిస్తూ, కిక్ చేస్తూ కనిపించారు. ఆయనలోని ఈ ఉత్సాహాన్ని చూస్తుంటే 'వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే' అనే సామెత నిజమవుతున్నట్లు అనిపిస్తుంది.

మ్యాచ్ కోసం ప్రముఖ ప్లేయర్లంతా సిద్ధమయ్యారు. అయితే ఈమ్యాచ్‌లో అటు ముఖ్యమంత్రి, ఇటు మెస్సీ చివరి ఐదు నిమిషాలు మాత్రమే గ్రౌండ్‌లో కనిపిస్తారని నిర్వాహకులు చెబుతున్నారు. ఇది కేవలం ఫ్రెండ్లీ మ్యాచ్ అని చెబుతున్నారు. ఈ మ్యాచ్‌ను చూసేందుకు మెస్సీని కలిసేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ హైదరాబాద్ వస్తున్నారు.