అన్వేషించండి

Leopard In Medak: అకోలా- హైదరాబాద్ 161 నేషనల్ హైవే పక్కన చిరుత సంచారం.. జాగ్రత్తగా ఉండండి

ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లాలో పెద్దపులి సంచారం స్థానికులకు భయభ్రాంతులకు గురిచేయగా, తాజాగా మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం వాసులను ఓ చిరుత హడలెత్తిస్తోంది.

అల్లాదుర్గం: మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలో చిరుతపులి సంచారం స్థానిక ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. అకోలా- హైదరాబాద్ 161వ జాతీయ రహదారి పక్కన, అల్లాదుర్గం ఐబీ చౌరస్తా సమీపంలోని సర్వీసు రోడ్డుపై చిరుత తిరుగుతుండటాన్ని పలువురు వాహనదారులు, స్థానికులు గమనించారు. ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమైంది.

చిరుత సంచారంపై సమాచారం అందుకున్న ఎమ్మార్వో మల్లయ్య, ఎస్‌ఐ శంకర్, ఇతర అధికారులు వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు. ముఖ్యంగా జాతీయ రహదారికి సమీపంలో ఉన్న గొల్లకుంట తండా, గాండ్లబాయి తండా, మాందాపూర్, చిల్వేర్ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా అటవీ ప్రాంతాల్లోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. చిరుత జాడ కోసం ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు.

హైదరాబాద్ సమీపంలో 50 ఏళ్ల తర్వాత తొలిసారి..

ఇటీవల హైదరాబాద్ సమీపంలో పులి కనిపించింది. నగరానికి కేవలం 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లా దత్తాయిపల్లి అటవీ ప్రాంతంలో పెద్దపులి ఆనవాళ్లు లభ్యమయ్యాయి. యాదాద్రి పుణ్యక్షేత్రానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోనే పులి అడుగుజాడలను అధికారులు గుర్తించారు. సుమారు అర్ధ శతాబ్దం తర్వాత హైదరాబాద్‌కు ఇంత సమీపంలో పులి జాడ కనిపించడం ఇదే తొలిసారి అని అటవీ శాఖ పేర్కొంది. ఈ పులి మహారాష్ట్రలోని తాడోబా రిజర్వ్ నుండి దారి తప్పి.. ఆసిఫాబాద్, సిద్దిపేట జిల్లాల మీదుగా ఇక్కడికి చేరుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఆ సయమంలో దత్తాయిపల్లి, గందమల్ల, కోనాపూర్ గ్రామస్థులను అధికారులు అప్రమత్తం చేశారు.

భద్రాద్రి జిల్లాలో పులి దాడి.. ఆవులు మృతి

ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోనూ పులి కలకలం రేపింది. కావడిగుండ్ల అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తూ పశువులపై దాడులకు పాల్పడింది. సోడెం నాగేశ్వరరావు అనే రైతుకు చెందిన రెండు ఆవులను పులి చంపేయడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఈ పులి ఆంధ్రప్రదేశ్‌లోని పాపికొండల నేషనల్ పార్క్ నుండి తెలంగాణ సరిహద్దుల్లోకి ప్రవేశించినట్లు అటవీ అధికారులు గుర్తించారు. పులిని పట్టుకోవడానికి ట్రాప్ కెమెరా, బోన్లు ఏర్పాట్లు చేశారు. తరువాత పులి జాడ దొరకలేదు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. కవితకు మళ్లీ నోటీసులు!
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. కవితకు మళ్లీ నోటీసులు!
CM Revanth Reddy: మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
Secunderabad Railway Stations: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా రూల్స్‌! టికెట్ ఉన్న వాళ్లకు మాత్రమే ఎంట్రీ!
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadiri: కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
Kavitha Hunger Strike: ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 
ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 
LPG Cylinder New Rule: ఎల్‌పిజి ఉత్పత్తి పెంచాలని రిఫైనరీస్‌కు కేంద్రం ఆదేశం!రెస్టారెంట్లు, హోటళ్లకు సరఫరా చేయడానికి కమిటీ ఏర్పాటు!
ఎల్‌పిజి ఉత్పత్తి పెంచాలని రిఫైనరీస్‌కు కేంద్రం ఆదేశం!రెస్టారెంట్లు, హోటళ్లకు సరఫరా చేయడానికి కమిటీ ఏర్పాటు!
India LPG Cylinder News: మధ్యప్రాచ్య యుద్ధంతో LPG సిలిండర్లపై కీలక నిర్ణయం! బుకింగ్ సమయాన్ని పొడిగింపు!
మధ్యప్రాచ్య యుద్ధంతో LPG సిలిండర్లపై కీలక నిర్ణయం! బుకింగ్ సమయాన్ని పొడిగింపు!
Pakistan Oil Crisis: పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం! పాఠశాలలు బంద్‌! వారానికి 4 రోజులే ప్రభుత్వ ఆఫీస్‌లు! మంత్రుల జీతాల్లో కోత! ఇఫ్తార్ విందులపై నిషేధం! 
పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం! పాఠశాలలు బంద్‌! వారానికి 4 రోజులే ప్రభుత్వ ఆఫీస్‌లు! మంత్రుల జీతాల్లో కోత! ఇఫ్తార్ విందులపై నిషేధం! 
Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Embed widget