అన్వేషించండి

Singer Mangli vs Subbarao: మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన లాయర్ సుబ్బారావుకు షాక్! బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసిన పోలీసులు

Singer Mangli | సింగర్ మంగ్లీపై లాయర్ సుబ్బారావు ఆరోపణల కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. పీఎస్‌కు వెళ్లిన లాయర్ సుబ్బారావుకు పంజాగుట్ట పోలీసులు బ్రీత్ అనలైజర్ టెస్టులు నిర్వహించారు.

హైదరాబాద్: సింగర్ మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు లాయర్ సుబ్బారావు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా హైడ్రామా చోటుచేసుకుంది. ఆల్కహాల్ తాగి వచ్చాడని అనుమానంతో సుబ్బారావుకు పంజాగుట్ట సీఐ బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయించారు. రీడింగ్ 27 పాయింట్లు రాగా,   మోతాదులోపు ఆల్కహాల్ తీసుకున్నట్టు నిర్దారణ అయింది. అయితే తాను రాత్రి మద్యం సేవిస్తే ఉదయం పీఎస్‌కు వచ్చిన తనకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయడం ఏంటని లాయర్ సుబ్బారావు పోలీసులను ప్రశ్నించారు. 

తనను అవమానించి, కేసు తప్పుదోవ పట్టించేందుకే పోలీసులు ఇలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తానేమైనా డ్రంక్ చేసి వాహనం నడిపానా ఏంటి.. కేవలం ఫిర్యాదు చేయడానికి కామన్ మ్యాన్‌లా పీఎస్‌కు వచ్చిన తనతో పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదన్నారు. తనపై మంగ్లీ చేసిన ఆరోపణలకు ఆధారం చూపించాలని డిమాండ్ చేశారు. తనపై నిరాధార ఆరోపణలను చేయడంతో ఎంతో మందిని మోసం చేసిన సింగర్ మంగ్లీపై కేసు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పంజాగుట్ట పోలీసులను కోరారు. 

బాధితులు వచ్చి ఫిర్యాదు చేస్తారు, వారి గురించి మీరు హడావుడి చేయవద్దు అని సుబ్బారావుకు పంజాగుట్ట పోలీసులు సూచించారు. అయితే బాధితుల తరఫున తాను లీడ్ చేస్తున్నానని, లాయర్ గా వారికి అన్ని రకాలుగా చట్ట ప్రకారం సహాయం చేస్తానన్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా చట్ట ప్రకారం శిక్ష తప్పదని, బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు.

పాటే నా ప్రాణం.. నన్ను రోడ్డుకు లాగకండి: సింగర్ మంగ్లీ

మైక్రో ఫైనాన్స్ పేరుతో వందల కోట్ల రూపాయల వసూళ్లకు పాల్పడ్డారంటూ తనపై వస్తున్న ఆరోపణలపై ప్రముఖ టాలీవుడ్ సింగర్ మంగ్లీ తీవ్రంగా స్పందించారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సదరు న్యాయవాదిపై ఆమె నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన ఆమె తన ఆవేదనను వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు.

బెదిరింపులకు పాల్పడ్డారు

మార్చి 21న సుభా సియపోగు అనే వ్యక్తి తనను కలిశారని, లాయర్ సుబ్బారావు అనే వ్యక్తితో కలిసి తనను అమర్యాదగా బెదిరించారని మంగ్లీ ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు సంబంధం లేని కరెన్సీ నోట్ల వీడియోలు చూపించి, తనను కలవకపోతే పరువు తీస్తానని ఒత్తిడి తెచ్చారని వెల్లడించారు. ఈ పరిణామాలతో తన కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు.

మీడియాకు మంగ్లీ రిక్వెస్ట్..
‘నాకు ఎలాంటి వ్యాపారాలు లేవు.. కేవలం పాటే నా ప్రాణం. ఎవరో వచ్చి ఆరోపణలు చేస్తే నిజనిజాలు తెలుసుకోకుండా వార్తలు రాయవద్దు’ అని మంగ్లీ మీడియాను వేడుకున్నారు. కేవలం ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఆ వ్యక్తి తనపై 150 కోట్ల మోసం అనే అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా ద్వారా ఎదిగిన తనకు, అదే శాపంగా మారుతుందని ఎప్పుడూ అనుకోలేదని ఆవేదన చెందారు. గతంలో తనపై రాజకీయ ముద్రలు వేయడంతో తర్వాత ఏ పార్టీకి కూడా తాను పాటలు పాడలేదని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Narendra Modi: రూ. 9,377 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. సైబరాబాద్ అభివృద్ధిపై ప్రధాని మోదీ ప్రశంసలు
రూ. 9,377 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. సైబరాబాద్ అభివృద్ధిపై ప్రధాని మోదీ ప్రశంసలు
KTR: ప్రధాని మోదీ పర్యటన వేళ బీజేపీకి షాక్! బండి సంజయ్ కుమారుడ్ని అరెస్ట్ చేయకపోవడంపై కేటీఆర్ ఫైర్
ప్రధాని మోదీ పర్యటన వేళ బీజేపీకి షాక్! బండి సంజయ్ కుమారుడ్ని అరెస్ట్ చేయకపోవడంపై కేటీఆర్ ఫైర్
Summer Speical Online Celebrations : ఎండల ఎఫెక్ట్​తో ఆన్​లైన్​ వేడుకలు.. బెంగాలీ కల్చరల్​ అసోసియేషన్ వినూత్న సెలబ్రేషన్స్
ఎండల ఎఫెక్ట్​తో ఆన్​లైన్​ వేడుకలు.. బెంగాలీ కల్చరల్​ అసోసియేషన్ వినూత్న సెలబ్రేషన్స్
Bandi Bhagirath Files:బండి సంజయ్‌కు బిగ్‌షాక్! కుమారుడిపై ఫోక్సో కేసు నమోదు! హనీట్రాప్ అంటున్న భగీరథ్‌!
బండి సంజయ్‌కు బిగ్‌షాక్! కుమారుడిపై ఫోక్సో కేసు నమోదు! హనీట్రాప్ అంటున్న భగీరథ్‌!
Advertisement

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Josh Inglis Smashes Fastest Fifty: చెపాక్ మైదానంలో జోష్ ఇంగ్లిస్ విధ్వంసం.. చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన లక్నో హిట్టర్! సరికొత్త ఐపీఎల్ రికార్డు
చెపాక్ మైదానంలో జోష్ ఇంగ్లిస్ విధ్వంసం.. చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన లక్నో హిట్టర్! సరికొత్త ఐపీఎల్ రికార్డు
Who is S Keerthana: విజయ్ క్యాబినెట్‌లో లేడీ ప్రశాంత్ కిశోర్ - తెలుగు మాట్లాడే తమిళ మంత్రి రికార్డులు, ప్రత్యేకతలు ఇవే
విజయ్ క్యాబినెట్‌లో లేడీ ప్రశాంత్ కిశోర్ - తెలుగు మాట్లాడే తమిళ మంత్రి రికార్డులు, ప్రత్యేకతలు ఇవే
Tamil Nadu Cabinet Ministers: తమిళనాడు కేబినెట్ మంత్రుల ప్రత్యేకతలివే.. విజయ్ టీవీకే పార్టీ వారికే ఛాన్స్
తమిళనాడు కేబినెట్ మంత్రుల ప్రత్యేకతలివే.. విజయ్ టీవీకే పార్టీ వారికే ఛాన్స్
KTR: ప్రధాని మోదీ పర్యటన వేళ బీజేపీకి షాక్! బండి సంజయ్ కుమారుడ్ని అరెస్ట్ చేయకపోవడంపై కేటీఆర్ ఫైర్
ప్రధాని మోదీ పర్యటన వేళ బీజేపీకి షాక్! బండి సంజయ్ కుమారుడ్ని అరెస్ట్ చేయకపోవడంపై కేటీఆర్ ఫైర్
Tamil Nadu CM Vijay: విజయ్ సీఎం అయ్యాక రిలీజవుతున్న ఫస్ట్ తమిళ్ సినిమా... జన నాయగన్ కాదు - అయినా దళపతికి స్పెషల్
విజయ్ సీఎం అయ్యాక రిలీజవుతున్న ఫస్ట్ తమిళ్ సినిమా... జన నాయగన్ కాదు - అయినా దళపతికి స్పెషల్
CM Vijay: సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే 3 ఫైళ్లపై విజయ్ సంతకాలు.. అధికారులకు కీలక ఆదేశాలు
సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే 3 ఫైళ్లపై విజయ్ సంతకాలు.. అధికారులకు కీలక ఆదేశాలు
Agnimitra Paul: ఎవరీ అగ్నిమిత్ర పాల్? 23 క్రిమినల్ కేసులు... బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ నుంచి బెంగాల్ బీజేపీ క్యాబినెట్‌లోకి
ఎవరీ అగ్నిమిత్ర పాల్? 23 క్రిమినల్ కేసులు... బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ నుంచి బెంగాల్ బీజేపీ క్యాబినెట్‌లోకి
Anna Konidela : అమ్మతో పవన్ కల్యాణ్... బిడ్డతో అన్నా లెజినోవా - రేర్ ఫ్యామిలీ ఫోటో
అమ్మతో పవన్ కల్యాణ్... బిడ్డతో అన్నా కొణిదెల - రేర్ ఫ్యామిలీ ఫోటో
Embed widget