Konda Murali Reaction : బుధవారం రాత్రి మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద హంగామా నడిచింది. ఆమెకు ఓఎస్‌డీగా ఉన్న సుమంత్ కోసం పోలీసులు వెళ్లడంతో హైడ్రామా మొదలైంది. ఆయన చేసిన తప్పేంటని పోలీసులకు కొండ సురేఖ కుమార్తె సుస్మిత వాగ్వాదానికి దిగారు. ఎఫ్‌ఐఆర్ కాపీ ఉందా అని ప్రశ్నించారు. తమ ఫ్యామిలీని టార్గెట్ చేస్కున్నారని ముఖ్యమంత్రితోపాటు మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి స్పందించారు. అసలు వివాదం ఏంటో తనకు తెలియదని, ఏదైనా ఉంటే నేరుగా ముఖ్యమంత్రి ఇంటికే వెళ్లి మాట్లాడతానని చెప్పారు. తమకు ఆయనతో ఎలాంటి సమస్య లేదని పేర్కొన్నారు. 

Continues below advertisement

ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన కొండా మురళి, రేవంత్ రెడ్డిని రాజశేఖర్ రెడ్డితో పోల్చి ఆయన అడుగులో అడుగు అయ్యామన్నారు. అలాంటి వ్యక్తితో తమకు విభేదాలు ఎందుకు ఉంటారని ప్రశ్నించారు. తాను ఫామ్‌హౌస్‌ ఉంటున్నానని ఇంత వరకు జరిగిన గొడవల గురించి తనకు తెలియదని వివరించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే " రేవంత్ అంటే గౌరవం. నాకు ఎమ్మెల్సీ ఇస్తామని రేవంత్ చెప్పార. నాకు రేవంత్‌తో ఎలాంటి విభేదాలు లేవు. నేను ఏ మంత్రి చాంబర్‌కు వెళ్లలేదు. సచివాలయంలో అడుగు పెట్టలేదు. ఏమన్నా ఉంటే సీఎం ఇంటికి వెళ్లి మాట్లాడతా. సుమంత్ విషయం నాకు తెలియదు. అని చెప్పారు. 

తనకు ఫోన్ ఆపరేట్ చేయడం రాదని సుస్మిత ఏం మాట్లాడిందో కూడా తనకు తెలియన్నారు. మొన్నటి వరకు చిన్న ఫోన్ తన వద్ద ఉండేదని ఈ మధ్యే కొత్తగా వచ్చిన యాపిల్ ఫోన్ కొనుకున్నట్టు చెప్పారు. ఎవర్నో అడిగితే ఆ వీడియో ఎలా చూడాలో కూడా చెప్పారని అది చూస్తున్న టైంలోనే మీడియా రావడంతో మాట్లాడుతున్నానని వెల్లడించారు. అసలు సుస్మిత ఏ పార్టీలో కూడా సభ్యత్వం తీసుకోలేదని, ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తి మాట్లాడిన మాటలు పెద్దగా పట్టించుకోవద్దని అన్నారు. కొండా సురేఖ ఎక్కడికి వెళ్లలేదని హైదరాబాద్‌లోనే ఉన్నారని చెప్పుకొచ్చారు. "నవజ్యోతి పట్నాయక్ సమావేశానికి మంత్రి సురేఖ హాజరవుతారు అని తెలిపారు. సురేఖ గెలిచిన తర్వాత మొదటిసారిగా రాత్రి కొండ సురేఖ చాంబర్‌కు వెళ్లి వాస్తు చూసి వచ్చాను. నాకు ఏదైనా పని ఉంటే నేరుగా మంత్రి ఇళ్లకే వెళ్తా తప్ప సచివాలయానికి వెళ్ళను. నా బిడ్డ సుస్మిత పార్టీలకు ఎలాంటి పదవులు లేవు, నా మనవరాలు లండన్‌లో చదువుతుంది మనవడు లండన్‌ వెళ్తాడు. నా అల్లుడు లండన్‌లో వ్యాపారం చేస్తున్నాడు, నా బిడ్డకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది. తాను ఏం మాట్లాడిందో నాకు తెలియదు. నిన్న రాత్రి సుమంత్ ఎపిసోడ్ కోసం నాకు తెలియదు. నాకు ఫోన్ కూడా సరిగ్గా వాడటంరాదు. నాకు వరంగల్ మీడియా మిత్రులపై అమితమైన ప్రేమ ఉంది, నాకు ఎల్లవేళలా అండగా ఉన్నారు. నాపై గతంలో చాలా కుట్రలు జరిగాయి. అందుకే కొండా సురేఖ వాహనం నేను ఈరోజు ఎక్క లేదు. మేము వేరువేరుగానే పర్యటిస్తాం. నన్ను టార్గెట్ చేస్తే ఎదుటివారికే నష్టం. ఇప్పటికే నేను చాలాసార్లు దెబ్బతిని ఈ స్థాయిలో ఉన్నాము" అని కొండ మురళీ అన్నారు

Continues below advertisement