Kavitha Meets KCR: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత చాలా కాలం తర్వాత తండ్రి, పార్టీ చీఫ్ కేసీఆర్‌తో సమావేశమయ్యారు. పార్టీలో తనను టార్గెట్ చేస్తూ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించిన తర్వాత ఇప్పటి వరకు కేసిఆర్‌తో సమావేశం కాలేదు. మేలో మొదలైన వివాదం తర్వాత ఇప్పుడు ఆమె తన తండ్రితో సమావేశమయ్యారు. ఇది బీఆర్‌ఎస్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. కాసేపట్లో పీసీ ఘోష్ కమిషన్ విచారణకు హాజరుకానున్నారు కేసీఆర్. ఇంతలోనే కవితతో సమావేశం అయ్యారు.