హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లో గత ఏడాది ఆరుగురు బాలురు కలిసి ఓ మైనర్ బాలికను అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. కారులోనే వారు ఆ అఘాయిత్యానికి పాల్పడ్డారు. నిందితులైన ఆరుగురిలో ఐదుగురు మైనర్లు కాగా, ఒకరు మేజర్ అని అప్పుడు పరిగణించారు. అయితే, ఈ గ్యాంగ్ రేప్ కేసులో అత్యాచారం కేసులో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆరో నిందితుడిగా ఉన్న బాలుడిని మేజర్‌గా పరిగణించాలని గతంలో పోక్సో కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టేసింది. మైనర్‌గానే పరిగణించి దర్యాప్తు చేయాలని పోలీసులను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
సుమారు 10 నెలల క్రితం 2022 మే 28న సామూహిక అత్యాచారం ఘటన జరిగిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం సమీపంలోని ఆమ్నేషియా పబ్‌లో పార్టీ చేసుకున్న కాలేజీ విద్యార్థులు ఇంటికి వెళ్లిపోయే క్రమంలో ఓ బాలికను కొందరు బాలురు కారులో ఎక్కించుకొని వెళ్లారు. నగరంలో కారులో తిరుగుతూనే వారు అఘాయిత్యానికి పాల్పడ్డారు. వెంటనే ఈ కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ప్రధాన నిందితుడు సాదుద్దీన్‌తో పాటు ఐదుగురు మైనర్లు నిందితులుగా ఉన్నారు. ఐదుగురు మైనర్లలో నలుగురిని మేజర్లుగానే పరిగణించాలని కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. ఇది కాస్త తీవ్రమైన కేసు కాబట్టి, మైనర్లను మేజర్లుగా పరిగణించాలని కోరారు.
2022 సెప్టెంబర్ 30న నిందితులను మేజర్లుగా పరిగణిస్తూ జువెనైల్ జస్టిస్ కోర్డు ఆదేశాలు జారీ చేసింది. జువెనైల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ వక్స్ బోర్డ్ చైర్మన్ హైకోర్టుకు ఆశ్రయించారు. దీంతో వక్స్ బోర్డ్ చైర్మన్ కొడుకును మైనర్‌గా పరిగణిస్తూ హైకోర్టు తీర్పును వెల్లడించింది. వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కుమారుడిని మేజర్ గా పరిగణించి దర్యాప్తు చేయడానికి అనుమతించింది.