తాను కోడి చెరువును కబ్జా చేసినట్టు నిరూపిస్తే ఆ భూమిని వెంటనే ప్రభుత్వానికి రాసి ఇస్తానని పవన్ కల్యాణ్ సవాల్ చేశారు.
Pawan Kalyan Press Meet:రేవంత్ రెడ్డి గారూ, ఆ చెరువు పక్కన స్థలం తీసుకోండి! పవన్ కల్యాణ్ ఓపెన్ ఆఫర్!
Pawan Kalyan Press Meet:హైదరాబాద్‌లో చెరువు కబ్జా చేశారని వస్తున్న ఆరోపణలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. తాను కబ్జా చేసి ఉంటే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.

- పవన్ కల్యాణ్ హైదరాబాద్ భూముల ఆక్రమణ ఆరోపణలను ఖండించారు.
- నిరూపిస్తే భూమిని ప్రభుత్వానికి రాసిస్తానని సవాల్ విసిరారు.
- తెలంగాణలో జనసేన ఉనికిని ప్రశ్నిస్తున్న వారికి ఘాటుగా సమాధానమిచ్చారు.
- తనపై దాడులు, కేసులు, బెదిరింపులు కొత్త కాదని అన్నారు.
Pawan Kalyan Press Meet:హైదరాబాద్‌లోని తన నివాసంలో జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్వహించిన ప్రెస్‌మీట్ సంచలనంగా మారుతుంది. ఆయనపై తెలంగాణలో చేస్తున్న దుష్ప్రచారంపై ఘాటుగా స్పందించారు. తాను హైదరాబాద్‌లో కబ్జా చేశానంటూ చేస్తున్న ఆరోపణలు ఖండించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. ఆ భూములు రాసి ఇచ్చేస్తానంటూ చెప్పుకొచ్చారు.
తెలంగాణ గడ్డపై జనసేన ఉనికిని ప్రశ్నిస్తున్న వారికి, తన రాజకీయ ప్రస్థానాన్ని విమర్శిస్తున్న వారికి ఆయన సూటిగా, స్పష్టంగా సమాధానాలు ఇచ్చారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలిలో తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ నిర్వహించాలని తలపెట్టారు. దీనికి అనుమతి రాకపోవడంతో తన నివాసంలోనే ప్రెస్ మీట్ పెట్టారు. తనపై చేస్తున్న ఆరోపణలు సమాధానం ఇచ్చారు.
హైదరాబాద్‌లోని కోడి చెరువు పవన్ కల్యాణ్ కబ్జా చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. తాను ఆక్రమణలు పాల్పడినట్టు నిరూపిస్తే ఆ భూమిని తక్షణమే ప్రభుత్వానికి రాసి ఇస్తానని అన్నారు. ఆ ప్రాపర్టీని ప్రభుత్వం సీజ్ చేయవచ్చని కూడా సూచించారు. అంతే కానీ అక్కడి ప్రైవేటు వ్యక్తులు రావడం చట్ట విరుద్దమని వార్నింగ్ ఇచ్చారు. అలాంటి వారు కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు.
"నేను కబ్జా చేసినట్టు ప్రచారం చేస్తున్నారు. పవన్ ఆ చెరువును కబ్జా చేసినట్టు నిరూపిస్తే ఇవాళే రాసేస్తాను. మీ తాటాకు చప్పుళ్లకు బెదిరపోను. నా వల్ల కబ్జా జరిగి ఉంటే సీజ్ చేయండి. ప్రైవేటు స్థలాల్లోకి వస్తే కేసులు ఎదురుకోవాల్సి ఉంటుంది. భయపెట్టాలని చూస్తే భయపడే వాళ్లం కాదు. ప్రతి విషయంలో ప్రాంతీయ వాదం తీసుకొస్తే భారత్ మనుగడ కష్టం. తెలంగాణ కోసం మొదట గొంతులేపిందే జనసేన. కాంగ్రెస్ నాయకులు నాలుకు చీరుస్తామంటున్నారు. రండీ రెడీగా ఉన్నాం." అని అన్నారు.
కమిట్‌మెంట్ లేకపోతే కొండగట్టుకు విరాళం ఇచ్చే వాళ్లమే కాదన్నారు. అంతేకాకుండా టీటీడీ నిధులు కూడా వచ్చేలా చేస్తున్నామని తెలిపారు. వైఎస్ బతికి ఉన్నప్పుడు ఆ రోజు మీ గొంతులు ఏమయ్యాయని ప్రశ్నించారు. యువ రాజ్యం పెట్టిన తర్వాత భీమ్‌రావ్ వాడ కోసం పోరాడినప్పుడు తనపై తొలి కేసు నమోదు అయ్యిందని గుర్తు చేశారు. దాడులు, కేసులు, బెదిరింపులు కొత్త కాదన్న ఆయన అన్నీ తట్టుకొని బయటకు వచ్చామని ఇక్కడ అదే పటిమ చూపుతామని అన్నారు.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Frequently Asked Questions
హైదరాబాద్‌లో కోడి చెరువును పవన్ కల్యాణ్ కబ్జా చేశారన్న ఆరోపణలపై ఆయన ఏమన్నారు?
తెలంగాణలో తనపై జరుగుతున్న దుష్ప్రచారానికి పవన్ కల్యాణ్ ఎలా స్పందించారు?
హైదరాబాద్‌లో కబ్జా ఆరోపణలను ఖండించి, ప్రభుత్వానికి భూములు రాసి ఇచ్చేస్తానంటూ ఆయన స్పందించారు.
తెలంగాణలో జనసేన ఉనికిని ప్రశ్నించే వారికి పవన్ కల్యాణ్ ఏమి చెప్పారు?
తెలంగాణ కోసం మొదట గొంతు లేపిందే జనసేన అని, దాడులు, కేసులు, బెదిరింపులకు భయపడబోమని ఆయన అన్నారు.
ప్రైవేటు వ్యక్తులు ఆక్రమణలకు పాల్పడితే వారిపై పవన్ కల్యాణ్ చర్య ఏమిటని చెప్పారు?
ప్రైవేటు వ్యక్తులు ఆ ప్రాపర్టీలోకి వస్తే చట్టవిరుద్ధమని, కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
ట్రెండింగ్ వార్తలు





















