ట్రాఫిక్ పోలీసులు విడుదల చేసిన మ్యాప్ ( Image Source : Hyderabad Traffic Police Twitter )
Hyderabad Traffic Restrictions: తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం వద్ద సందడి నెలకొంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టిన కొత్త సెక్రటేరియట్ ను ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఆంక్షలు విధించారు. రాత్రి 8 గంటల వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. హుస్సేన్ సాగర్, నెక్లెస్ రోడ్డు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తెలుగు తల్లి జంక్షన్ వద్ద వాహనాలను దారి మళ్లించారు. ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వాహనాలకు నో ఎంట్రీ విధించారు. ట్యాంక్ బండ్, తెలుగుతల్లి, బీఆర్కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ లో వాహనాలకు అనుమతి నిరాకరించారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న పార్కులను మూసివేశారు.
#HYDTPinfo
— Hyderabad Traffic Police (@HYDTP) April 29, 2023
Commuters, please make a note of Tr. Restrictions & Diversion in view of inauguration of the New Dr. B.R. Ambedkar Secretariat building of Telangana State, on 30-04-2023 & plan your journey accordingly. https://t.co/yuxyCTmzG1 #TrafficAlert #TrafficAdvisory pic.twitter.com/lFYN1IPROs
#HYDTPinfo Commuters are requested to make note of traffic regulations, which will be in place tomorrow in the vicinity of NTR Marg and Hussain Sagar lake.@HYDTP urge invitees to follow the directions related to alighting & parking of vehicles.@HYDTP solicit your cooperation. pic.twitter.com/uCSUmG8r0L
— Raju K P V (@InsAdmnHYDTP) April 29, 2023
నూతన సచివాలయం ఆరు అంతస్తులే.. కానీ!
పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు మెరుగైన పాలన అందించాలన్న సీఎం కేసీఆర్ ఆలోచనలో భాగంగా ఈ కొత్త సెక్రటేరియట్ భవన నిర్మాణం జరిగింది. ఎయిర్ పోర్ట్ అథారిటీ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, అగ్నిమాపక శాఖ, జీహెచ్ఎంసి తదితర శాఖల నుంచి అవసరమైన అనుమతులు పొందిన తర్వాత 2021 జనవరిలో నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ ఏప్రిల్ నెలాఖరు నాటికి సరిగ్గా 26 నెలల సమయం పూర్తవుతుంది. ఆర్ అండ్ బి శాఖ ఐజీబీసీ (ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్), టిఎస్ టెక్నలాజికల్ సర్వీసెస్, రాష్ట్ర పోలీసు విభాగాల సూచనలతో ఎలాంటి లోపం లేకుండా ఈ భవన నిర్మాణం జరిగింది. దేశంలోని చారిత్రక కట్టడాల కన్నా దీనిని ఎక్కువ ఎత్తులో నిర్మించారు. అందులో రెండుసార్లు 45 రోజుల చొప్పున కరోనాతో పనులు ఆగిపోయాయి. అయినా కార్మికులను ఎక్కువ మందిని తీసుకొచ్చి ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. మొదటగా ఈ నిర్మాణం ప్రారంభించినప్పుడు 1500 మందితో ప్రారంభమై చివరకు 4000 మంది కార్మికులు ఈ నిర్మాణం కోసం పనిచేశారు.
మొత్తం 28 ఎకరాలు! అందులో రెండున్నర ఎకరాల్లోనే భవనం!
ప్రధాన గుమ్మటాలపై ఏర్పాటు చేసిన అశోకుడి చిహ్నం నేలపై నుంచి 265 అడుగుల ఎత్తులో ఉంది. గాలి, వెలుతురు ధారళంగా వచ్చే విధంగా నిర్మించారు. 28 ఎకరాల్లో 2.5 ఎకరాల్లో మాత్రమే భవనాన్ని నిర్మించారు. పార్కింగ్ ను 6 ఎకరాల్లో చేసేలా తగిన విధంగా ఏర్పాట్లు చేశారు. 2వేల మంది ఉద్యోగులు పనిచేసే విధంగా నూతన సచివాలయాన్ని నిర్మించారు. లోయర్ గ్రౌండ్ ఫ్లోర్లో స్టోర్స్, రికార్డ్ రూంలు, వివిధ సేవలకు కేటాయించారు. ఉద్యోగుల కోసం ప్రతి అంతస్థులో ఒక లంచ్ రూమ్ ఉంది. రికార్డులు, సెక్యూరిటీ, హౌస్ కీపింగ్, భవన నిర్వహణ తదితర ఆఫీసులను గ్రౌండ్ ఫ్లోర్ లో ఏర్పాటు చేశారు. ఫైర్ స్టేషన్, క్రెషి, డిస్పెన్సరీ, ఎంప్లాయీస్ అసోసియేషన్ హాల్, సెక్యూరిటీ సిబ్బందికి వెస్ యాన్సిలరీ బిల్డింగ్ లు ఉన్నాయి. సౌత్ వెస్ట్ వైపు ఆలయం, మసీదు, చర్చిలను నిర్మించారు. సందర్శకుల కోసం 160 కార్లు, 300 బైక్ లకు సౌత్ ఈస్ట్ వైపు పార్కింగ్ సౌకర్యం ఉంది.
TSLPRB: ఎస్‌ఐ, కానిస్టేబుల్ నియామకాలు, ఒక్కో పోస్టుకు ఆరుగురు పోటీ!
YS Viveka Murder Case: వైఎస్ భాస్కర్‌రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి
TSPSC Paper Leakage: నిందితుడు డీఈ రమేష్ కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టును ఆశ్రయించిన సిట్
Telangana Formation Day: తెలంగాణ ప్రజలను అందరూ మోసం చేస్తే, సోనియా వారి బాధను అర్థం చేసుకున్నారు: మీరా కుమార్
Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు
Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !
Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో
Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?
WTC 2023 Final: డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో వర్షం పడితే! - పోనీ డ్రా అయితే గద ఎవరికి?