Rajiv Swagruha flats: హైదరాబాద్‌లోని బండ్లగూడ, పోచారంలోని రాజీవ్ స్వగృహ ప్లాట్లకు మంగళవారం డ్రా తీయనున్నారు. పదేళ్ల కిందట ఈ ప్లాట్లను నిర్మించారు. ఇప్పుడు ఇందులో మిగిలిపోయిన ఒకటి, రెండు, మూడు పడక గదుల విక్రయానికి ప్రభుత్వం సెప్టెంబరులో నోటిఫికేషన్ విడుదల చేసింది. 


ఆసక్తి కలిగిన కొనుగోలుదారులు సింగిల్ బెడ్ రూమ్ కు ఒక లక్ష, డబుల్ బెడ్ రూమ్ కు రూ. 2 లక్షలు, త్రిబుల్ బెడ్ రూమ్ కు రూ. 3 లక్షలు టోకెన్ అడ్వాన్స్ చెల్లించారు. ఇప్పుడు వీరికి ప్లాట్ల కేటాయింపు కోసం రేపు డ్రా తీయనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు బండ్లగూడ, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పోచారం ప్లాట్లకు డ్రా తీస్తారు. ఈ ప్రక్రియను యూట్యూబ్, ఫేస్ బుక్ లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు హెచ్ ఎండీఏ అధికారులు తెలిపారు.