Shamshabad Airport : శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు ప్రయాణికులు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయారు. వారిని నితిన్‌ షా, షేక్‌ సకీనా గా గుర్తించారు. ప్రయాణికులు విమానాశ్రయంలోకి ప్రవేశించగానే అక్కడికక్కడే  కుప్ప కూలారు. అక్కడనే ఉన్న భద్రతా సిబ్బంది వేగంగా స్పందించి వారిని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు చికిత్స పొందుతూ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నితిన్‌ షా స్వస్థలం గోవా కాగా.. సకీనా సౌదీ అరేబియాలోని జెడ్డా అని తెలుస్తోంది. వీరిద్దరి మరణానికి కారణాలు తెలియరాలేదు. ఎయిర్ పోర్టు పోలీసులు మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు. వీరి మృతికి గల కారణాల గురించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.   


ఇద్దరు ప్రయాణికులు..వేర్వేరు విమానాల్లో.. వేర్వేరు ప్రాంతాల నుంచి.. 2024, సెప్టెంబర్ 19వ తేదీన హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు. విమానం దిగి.. రన్ వే పైనుంచి ఎయిర్ పోర్టులోకి వచ్చిన వెంటనే ఒక్కసారిగా కుప్పకూలినట్లు ఎయిర్ పోర్టు సిబ్బంది. ఆ వెంటనే ఎయిర్ పోర్ట్ లోనే ఉన్న అపోలో ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయారు.  స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది. ఇటీవల కాలంలో ఆకస్మిక మరణాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. అప్పటి వరకు బాగున్న వారు ఉన్నట్లుండి తనువు చాలిస్తున్నారు. గుండె పోటు మరణాలు కూడా ఇటీవల బాగా పెరిగిపోయాయి. మారిన జీవన శైలి, ఒత్తిళ్ల కారణంగానే ఇలా చనిపోతున్నారని నిపుణులు చెబుతున్నారు. 



 కొత్తగూడెంలో విమానాశ్రయం 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎయిర్ పోర్టు ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ మేరకు కొత్తగూడెంలో ఎయిర్ పోర్టు ఏర్పాటు చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కలిసి వినతిపత్రం సమర్పించారు. కాగా, కొత్తగూడెం జిల్లాలో ఎయిర్ పోర్టు ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. అప్పటి ప్రభుత్వం టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గతంలో నిర్మించిన విమానాశ్రయ భూములకు ల్యాండ్ క్లియరెన్స్ ఇవ్వాలని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఒక నివేదికలో ప్రభుత్వాన్ని కోరారు. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు కూడా సానుకూల నివేదిక ఇవ్వడంతో విమానాశ్రయం ఏర్పాటుపై జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేరనుంది.