Hyderabad News: హైదరాబాద్ లో అర్హులు అయిన పేద ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలో రెండో విడత డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి బల్దియా ప్రయత్నాలు చేస్తుండగా.. పలు ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఇండ్ల పట్టాలను లబ్ధిదారులకు అందజేయనున్నారు. తొలి విడతలో 11 వేల 700 ఇండ్ల పట్టాల పంపిణీ పూర్తి కాగా.. రెండో విడతలో 13 వేల 300 మంది లబ్ధిదారుల సొంతింటి కలను తెలంగాణ ప్రభుత్వం సాకారం చేయనుంది. 50 లక్షల రూపాయల విలువ చేసే సొంతింటిని ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా ఇళ్ల పంపిణీ చేస్తోంది. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని తీసుకొచ్చి హైదరాబద్ వ్యాప్రంతగా మొత్తం 70 వెల ఇఁడ్ల పంపిణీ పూర్తి చేయగా... మరో 30 వేల ఇండ్లు పలు దశల్లో ఉన్నాయి. అయితే దశల వారీగా వీటిని లబ్ధిదారులకు అందజేయాలని సర్కారు నిర్ణయించుకుంది. ఈక్రమంలోనే పూర్తయిన ఇళ్లను పూర్తయినట్లుగా పంపిణీ చేస్తోంది. 


రెండో విడత డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్ల పంపిణీకి ఈనెల 15న లక్కీ డ్రా నిర్వహించారు. దీని ద్వారా జీహెచ్ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో మొత్తం 13వేల 200 మంది  లబ్దిదారులను ఎంపిక చేశారు. ఆసారి లబ్ధిదారుల ఎంపికలో రిజర్వేషన్ల విధానాన్ని పాటించామన్నారు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌. జీహెచ్ఎంసీ పరిధిలోని 24  నియోజకవర్గాల్లో... ప్రతి నిజయోకవర్గం నుంచి కనీసం 500 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్టు అధికారులు కూడా వివరించారు. 


ఎవరెవరు ఎక్కడ పంపిణీ చేయనున్నారంటే..?


గ్రేటర్ పరిధిలో మొతత్ం 9 నియోజక వర్గాల వారిగా ఇండ్ల పట్టాల పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేసశారు. రెండో విడతలో ఇండ్లను పంపిణీ చేసేందుకు మంత్రి కేటీఆర్ కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దుండిగల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారని బల్దియా వర్గాలు వెల్లడించాయి. 2100 మంది లబ్ధిదారులకు ఇండ్ల పంపిణీ చేస్తారని తెలిపాయి. అలాగే డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ మేడ్చల్, ప్రతాపసింగారం లో 1100, మంత్రి హరీష్ రావు పటాన్ చెరు, కొల్లూరు-2 లో 4800 ఇండ్లను అందజేయనున్నారు. అలాగే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉప్పల్, చర్లపల్లిల్లో వెయ్యి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం, మానసాన్ ప్లలిలో 800,  మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఇబ్రహీంపట్నం, హత్తిగూడ 432 ఇండ్లను పంపిణీ చేయబోతున్నారు. మంత్రి చామకూర మల్లారెడ్డి మేడ్చల్, జవహార్ నగర్ లో 1200, హోంమంత్రి మహమూద్ అలీ ఇబ్రహీంపట్నం, తట్టి అన్నారంలో 1268, మేయర్ గద్వాల్ విజయ లక్ష్మీ ఇబ్రహీంపట్నం, తిమ్మాయిగూడలో 600 ఇండ్లను లబ్ధిదారులకు అందేజేయనున్నారు. 


సాంకేతిక సాయంతోనే ఇండ్ల నిర్మాణం


నేడు జరిగే ఇండ్ల కేటాయింపు పూర్తి స్థాయిలో సాంకేతికతతోనే జరుగుతుందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. బల్దియా, టెక్నీషియన్ల కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా.. ప్రభుత్వం రూపొందించిన రిజర్వేషన్ల ప్రకారమే ఇండ్ల పంపిణీ జరగనుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులతో పాటు ఫ్లోర్స్ కేటాయింపులోనూ దివ్యాంగులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ క్రమంలో వారికి గ్రౌండ్ మొదటి అంతస్తులో ఇళ్లను కేటాయించే విధంగా సాఫ్ట్ వేర్ రూపొందించారు. ఇప్పికే దశల వారీగా జరిగిన డ్రైరన్ పేరిట ప్రత్యేక కార్యక్రమాలను బల్దియా, జిల్లా యంత్రాంగం నిర్వహించింది. రెండో విడత ఇండ్ల పంపిణీని పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేశారు.