Hyderabad Crime News: ఫ్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు మోసం చేసిన సాహితీ ఇన్ ఫ్రా కేసులో సరికొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఆ సంస్థ యజమాని వందల కోట్లు కాజేస్తే.. అక్కడ పని చేసే ఉద్యోగులు లక్షల్లో దోచేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ సంస్థ మాయలు బయటపడగానే మోసాలకు పాల్పడ్డ ఉద్యోగులంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తక్కువ ధరకే ప్లాట్లు ఇస్తామంటూ వేలాది మందిని మోసగించిన సాహితీ ఇన్ ఫ్రా టెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ బూదాటి లక్ష్మీ నారాయణను నగర సీపీఎస్ పోలీలుసు ఈనెల 2వ తేదీన అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే కస్టడీకి తీసుకున్న పోలీసులు.. మూడ్రోజుల పాటు విచారించారు. పలు అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించి కస్టడీ పూర్తవడంతో సోమవారం జైలుకు పంపించారు.
అయితే ఈ కేసులో బాధితుల సొమ్ములో కొంత భఆగం మార్కెటింగ్ ఉద్యోగులు దోచేసినట్లు పోలీసులు గుర్తించారు. సంస్థ మార్కెటింగ్ కోసం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించింది. ఉద్యోగులకు నెలవారీ వేతనంతో పాటు స్థాయిని బట్టి పది నుంచి ఇరవై శాతం కమీషన్ ఇచ్చినట్లు సమాచారం. రోజువారీ విక్రయాలు, నగదు జమ తదితర లావాదేవీల కోసం మరా-మి సాఫ్ట్ వేర్ ను ఉపయోగించారు. సాంకేతిక లోపాలను కొందరు ఉద్యోగులు అవకాశంగా మలుచుకున్నారు. ప్లాట్లు సొంతం చేసుకున్న కొనుగోలు దారులకు చెల్లించిన మొత్తానికి రశీదు ఇచ్చారు. చెక్కులు, ఆన్ లైన్ రూపంలో వచ్చిన వాటిని సంస్థకు అందించారు. నగదు రూపంలో చేతికి అందిన సొమ్మును మాత్రం సొంత ఖాతాల్లో వేసుకున్నారు. సాఫ్ట్ వేర్ లో మాత్రం పూర్తి నగదు సంస్థ ఖాతాల్లోకి చేరుతున్నట్లు ఏమార్చారు. ఉద్యోగులు కాజేసిన సొమ్ము రూ.100 కోట్లుఉన్నట్లు గుర్తించిన సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసు కేసులతో భయపడిన సదరు ఉద్యోగులు రూ. 40 కోట్లు ఇస్తామంటూ లక్ష్మీ నారాయణతో ఒప్పందం చేసుకున్నారు. అనంతరం రూ. 10 కోట్లు ఇ్చచారు. లక్ష్మీ నారాయణ అరెస్టుతో వారంతా సెల్ ఫోన్లు స్విచ్ఛఆఫ్ చేసుకొని అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. నగర శివార్లలో 11 చోట్ల ప్రీలాంచ్ ఆఫర్లు గుప్పించి కోట్లు వసూలు చేశారు. వీటిలో అమీన్ పూర్ లోని స్థలాలు మినహా మిగిలిన 2 నుంచి 3 ప్రాంతాల్లోని భూములు వివాదంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నగర శివార్లలో 4 ఎకరాలకు సంబంధించి అసలు యజమాని ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. మరో ప్రాంతంలోని 5 ఎకరాల భూమి కోసం కేవలం అగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం.
దీంతో డిపాజిట్ల పరిరక్షణ చట్టంలోని పలు సెక్షన్లను జతచేర్చారు. ఆర్థిక లావాదేవీలు, వివిధ సంస్థలకు సొమ్ము బదలాయింపు తదితర అంశాలను గుర్తించేందుకు సీపీఎస్ పోలీసులు నలుగురు ఆడిటర్ల సహాయం తీసుుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నో చిక్కు ముడులతో ఉన్న ఈ కేసును ఓ కొల్లికి తీసుకురరావడం పోలీసులకు సవాల్ గా మారరింది.