Madhapur SI Missing News: హైదరాబాద్ : నగరంలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న ఎస్ఐ అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. మాదాపూర్ ఎస్ఐ రాజేశ్వర్ రెడ్డి కనిపించడం లేదు. సోమవారం ఉదయం నుండి ఎస్ఐ కనిపించకుండా పోయాడు. క్రిస్మస్ బందోబస్తు అంటూ ఉదయం ఇంట్లో చెప్పి వెళ్ళాడు ఎస్ఐ. అంతలో ఏం జరిగిందో కానీ, మధ్యాహ్నం సమయంలో పిల్లలు నువ్వు జాగ్రత్త అంటూ భార్యకు మెసేజ్ చేశాడు ఎస్ఐ రాజేశ్వర్ రెడ్డి. ఇప్పటి వరకు ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడంతో ఎస్ఐ ఆచూకీ కోసం వెతుకుతున్నారు మాదాపూర్ పోలీసులు. ఉన్నత అధికారుల వేదింపులు తట్టుకోలేక వెళ్లి పోయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఎస్ఐ రాజేశ్వర్ రెడ్డి
2014 కు చెందిన ఎస్ఐ అని సమాచారం.
SI Missing In Hyderabad: భార్యకు మెసేజ్ చేసి అదృశ్యమైన మాదాపూర్ ఎస్ఐ
ABP Desam
Updated at:
25 Dec 2023 11:01 PM (IST)
SI Missing In Hyderabad: భార్యకు మెసేజ్ చేసి అదృశ్యమైన మాదాపూర్ ఎస్ఐ
NEXT
PREV
Published at:
25 Dec 2023 11:01 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -