Phone Taping Case: ఫోన్ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం.. నేరస్తుల అప్పగింత అస్త్రం ప్రయోగిస్తున్న ప్రభుత్వం

TG POLICE: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితులు ప్రభాకర్‌రావు,శంకర్‌రావును అమెరికా నుంచి వెనక్కి రప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నేరస్తుల అప్పగింత అస్త్రాన్ని వాడనుంది.

Continues below advertisement
Phone Tapping Case: తెలంగాణ(Telangana)లో సంచలంన రేపిన ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(SIB) మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు(Prabhakarrao), శంకర్‌రావును  రాష్ట్రానికి రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. చివరిగా నేరస్తుల అప్పగింత (Extradition)అస్త్రంను ప్రయోగించేందుకు  సిద్ధమైంది. 
 
కరుడుగట్టిన నేరస్తులను అప్పగించుకునే విషయంలో భారత్‌, అమెరికా(America) మధ్య అవగాహన ఒప్పందం ఉంది. ఇరుదేశాల్లో తీవ్రనేరాలకు పాల్పడి పారిపోయి వచ్చిన వారిని నిబంధనలకు అనుగుణంగా ఇచ్చిపుచ్చుకోవాలన్నదే ఈ ఒప్పందం. ఇప్పుడు ఈ ఒప్పందం మేరకు అమెరికా పారిపోయి తలదాచుకుంటున్న ప్రభాకర్‌రావు, శంకర్‌రావును వెనక్కి తిరిగి తెప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది.ఈ కేసు ఎంత ముఖ్యమైనదో  వివరిస్తూ...తెలంగాణ సీఐడీ(CID) అధికారులు  కేంద్రానికి నివేదిక పంపారు. వారు అక్కడి నుంచి వచ్చి నోరు విప్పితే...చాలా విషయాలు బయటకు వస్తాయని, తప్పకుండా వారిని భారత్‌కు రప్పించే ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరారు. విదేశీ వ్యవహారాలశాఖ నంచి అమెరికా ప్రభుత్వానికి నివేదిక వెళ్లనుంది. అన్నిఅంశాల పరిశీలించిన పిదప వారిని అక్కడి ప్రభుత్వం వెనక్కి పంపే అవకాశం ఉంది తెలంగాణ పోలీసులు భావిస్తున్నారు. కేసు విచారణ సాగుతుండగానే ప్రభాకర్‌రావు అమెరికా పారిపోయారు.అక్కడ ఆయనకు గ్రీన్‌కార్డు(Green Card) ఉంది.అటు శ్రవణ్‌రావు వీసా గడువు ముగిసినప్పుటికీ ఆయన అమెరికాలో అక్రమ వలసదారుడిగా తలదాచుకుంటున్నారు. ఇదే విషయాన్ని అమెరికా అధికారులకు భారత్‌ వివరించనుంది. 
గత ప్రభుత్వ హయాంలో ఎస్‌ఐబీ చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలోని బృందం...నిబంధనలకు విరుద్ధంగా ప్రతిపక్ష నేతలు, బడా వ్యాపారవేత్తలు,ఇతరుల ఫోన్‌లు ట్యాపింగ్ చేశారు.ముఖ్యంగా ఎన్నికలకు ముందు ఎవరెవరు ఎవరితో మాట్లాడుతున్నారు.ఎవరెవరు ఎవరిని కలుస్తున్నారు. ఏయే వ్యాపారవేత్తలు ఎవరెవరికి ఎంతెంత పార్టీ ఫండ్‌ ఇస్తున్నారో కనుక్కుని ఈ వివరాలన్నీ అప్పటి ప్రభుత్వ పెద్దలకు అందించారన్నది ఆరోపణ. దీనిద్వారా ప్రభుత్వ పెద్దలు రాజకీయంగా లబ్ధిపొందడమేగాక...ప్రతిపక్ష నేతలకు సహకరించే వారిపై దాడులు చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి.విపక్షాలను రాజకీయంగా,ఆర్థికంగా  దెబ్బతీయడే లక్ష్యంగా ఆకాలంలో అనైతికంగా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. 
 
                 కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ఈ వ్యవహారంపై దృష్టిసారించింది. ఫోన్ ట్యాపింగ్ జరిగింది నిజమేనని నిర్థరించుకున్న వెంటనే ఒక్కొక్కరినీ అరెస్ట్ చేయడం మొదలుపెట్టింది.ఈ కేసులో ఇప్పటికీ  పలువురు కీలక అధికారులు రిమాండ్‌లో కొనసాగుతున్నారు. వారు ఇచ్చిన  వాంగ్మూలం ప్రకారం అప్పటి  ప్రభుత్వం పెద్దలు, ఉన్నతాధికారుల సూచనల మేరకే నేతలు, వ్యాపారుల  ఫోన్ సంభాషణలు  చాటుగా విన్నట్లు అంగీకరించారు. అయితే ఈకేసులో కీలకంగా వ్యవహరించిన అప్పటి  ఎస్‌ఐబీ చీఫ్‌ ప్రభాకర్‌రావు, శ్రవణ్‌కుమార్  అమెరికా పారిపోయారు.వారిని వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. ప్రభాకర్‌రావుకు అమెరికాలో గ్రీన్‌కార్డు ఉండటంతో  ఎప్పటికప్పుడు పోలీసుల ప్రయత్నాలను నిందితులు తిప్పికొడుతున్నారు. దీంతో ఈసారి ఏకంగా నిందితుల అప్పగింత అస్త్రాన్ని తెలంగాణ పోలీసులు ప్రయోగించారు. కరుడుగట్టిన నేరస్తుల అప్పగింత విషయంలో భారత్‌-అమెరికా మధ్య ఉన్న ఒప్పందాన్ని తెరపైకి తెచ్చారు. ఈక్రమంలో  కేంద్ర హోంశాఖకు సమాచారం ఇచ్చిన హైదరాబాద్‌ పోలీసులు...విదేశాంగశాఖ ద్వారా అమెరికా ప్రభుత్వానికి నివేదిక పంపనున్నారు.దీనికి అక్కడి ప్రభుత్వం అంగీకరిస్తే....నిందితులిద్దరూ భారత్‌కు రావాల్సిందే. ఇద్దరు నిందితులపై ఇప్పటికే రెడ్‌కార్నర్‌ నోటీసుుల జారీ చేశారు. విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా ఇంటర్ పోల్‌కు సమాచారం పంపించారు. దీనిపై నిందితులు విదేశీ వ్యవహారాలశాఖలో అప్పీలు చేశారు. ఈతంతు ఓ వైపు సాగుతుండగానే.... నేరస్తుల అప్పగింత ఒప్పందాన్ని పోలీసులు తెరపైకి తెచ్చారు. 
 
 
                      నిందితులిద్దరూ అమెరికాలో అక్రమ వలసదారులుగా నివాసం ఉంటున్నారు. తమను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని మూడు నెలల కిందట ప్రభాకర్‌రావు అమెరికా ప్రభుత్వానికి  దరఖాస్తు చేసుకున్నారు.అయితే  దీనిపై అక్కడి ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం  తీసుకోలేదు.వారు నోరువిప్పతే ఇక్కడ చాలామంది రాజకీయ నేతల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.
 
Continues below advertisement