Election commission has ordered to take action against KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. మే 13న రాష్ట్రంలో పార్లమెంట్ ఎలక్షన్ పోలింగ్ రోజున మాజీ మంత్రి కేటీఆర్ నిబంధనలు ఉల్లంఘించారని ఈసీ చర్యలకు సిద్ధమైంది. ఎన్నికల రోజున మాట్లాడిన కేటీఆర్ తాను ఏ వ్యక్తికి ఓటు వేశారో పరోక్షంగా వెల్లడించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొంటూ కేటీఆర్‌పై చర్యలకు ఈసీ ఆదేశించింది. ఈ విషయంపై ఈసీ ఇదివరకే కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని గడువు ఇవ్వగా, కేటీఆర్ వివరణ ఇవ్వకపోవడంతో ఈసీ చర్యలకు ఆదేశించింది.