KTR on BC Declaration: బీసీ డిక్లరేషన్‌పై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు, ఎలక్షన్ గాంధీగా రాహుల్ పేరు మార్చుకోవాలి: కేటీఆర్
Telangana News | ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ బీసీ డిక్లరేషన్ ప్రకటించారని, ఆయన తన పేరును ఎలక్షన్ గాంధీగా మార్చుకోవాలని బీఆర్ఎస్ నేత కేటీఆర్ సూచించారు.
Congress BC declaration In Telangana | హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలలో మంగళవారం నాడు జరిగిన ఘటన తెలంగాణ ప్రజలకు రెండు విషయాలు స్పష్టంచేసిందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. ఏడాదికాలంగా పూర్తిగా విఫలమవుతున్నా పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వానికి దేనిపై కూడా స్పష్టత లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అబద్ధాలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ వేదికగా సమర్పించిన డేటాపై కాంగ్రెస్ ప్రభుత్వానికే ఏమాత్రం క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు.
బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం లేదని నిన్నటితో తేలిపోయిందన్నారు. రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ వేదికగా యూటర్న్ తీసుకుంది. కేంద్రంపైకి నెపం నెట్టి తాము మాత్రం తప్పించుకోవాలని మాస్టర్ ప్లాన్ వేసిందని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ చేస్తున్న బీసీ డిక్లరేషన్ అనేది వంద శాతం అబద్ధం, తెలంగాణ ప్రభుత్వానికి నిబద్ధత లేదన్నారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలు, చెప్పిన ఆరు గ్యారెంటీలు, చేసిన డిక్లరేషన్లన్నీ బూటకమని నిన్న తేలిపోయిందన్నారు. ఓట్ల కోసం ఎన్నికల్లో అబద్ధాలు ప్రచారం చేసి లబ్దిపొందడమే లక్ష్యంగా పెట్టుకున్న రాహుల్ గాంధీ తన పేరును ఎలక్షన్ గాంధీగా మార్చుకుంటే మంచిదని కేటీఆర్ హితవు పలికారు.