Amit Shah TS Visit: ఈనెల 28వ తేదీన బీజేపీ అగ్రనేత, కేంద్రం హోమంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్ర పార్టీ ఎన్నికల కోసం ఏ మేర సిద్ధం అయిందో పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని 17 లోక్ సభ, 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లోని బూత్ కమిటీలు, మండల, ఇతర స్థాయిల కమిటీల నియామకం తదితర విషయాలపై సమీక్షిస్తారు. అవసరం అయితే అమిత్ షా 29వ తేదీ రోజు ఇక్కడే ఉంటారు. నాలుగేసి లోక్ సభ నియోజక వర్గాలను కపిలి ఒక క్లస్టర్ గా సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అమిత్ షా కనీసం రెండు క్లస్టర్ సమావేశాల్లో పాల్గొని సంస్థాగత ఎన్నికల సన్నద్ధతను పరిశీలించనున్నట్లు సమాచారం. అలాగే ఈనెల 19వ తేదీన ప్రధాని మోదీ కూడా హైదరాబాద్ రాబోతున్నారు. 


వందేభారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభించేందుకు హైదరాబాద్ రానున్న ప్రధాని


అదేరోజు హైదరాబాద్ లో పరుగులు పెట్టేందుకు వస్తున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలోనే అతి పెద్ద స్టేషన్ సికింద్రాబాద్ ను 699 కోట్ల రూపాయల వ్యయంతో పనరాభివృద్ధి చేయబోతున్నారు. ప్రస్తుతం ఉన్న భవనాల్ని కూల్చి అంతర్జాతీయ ప్రమాణాలు, పూర్తిస్థాయి వసతులతో నూతనంగా నిర్మిస్తారు. అయితే ఇందుకోసం గుత్తెదారు ఎంపిక అక్టోబరులోనే పూర్తి అయింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభలో ప్రసగించనున్నారు. 


పార్టీ నేతలు ఇద్దరు ఇదే నెలలో, రోజుల వ్యవధిలోనే రావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. వచ్చే డిసెంబర్ లోగా ఎన్నికలు ఎప్పుడైనా ఉండొచ్చనే అంచనాల మధ్య బీజేపీ కసరత్తును ముమ్మరం చేసింది. ఎన్నికల సన్నద్ధతపై తాజాగా ఆర్ఎస్ఎస్ జాతీయ నాయకత్వం నుంచి బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు సలహాలు తీసుకున్నాయి. కేసీఆర్ సర్కారు ఫైఫల్యాలను ఎండగట్టడంతో పాటు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మరింత సమన్వయంతో పని చేయాలని ఆర్ఎస్ఎస్ సూచించనట్లు తెలుస్తోంది. అలాగే సంస్థాగతంగా పార్టీ పటిష్టత, పోలింగ్ బూత్ స్థాయి వరకు వివిధ కమిటీల బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం తదితర అంశాలపై గృష్టి పెట్టనున్నారు. అలాగే బుధవారం బీజేపీ రాష్ట్ర ప్రజా సమస్యలు పరిష్కారం తదితర అంశాలపై దృష్టి పెట్టనున్నారు. అంతే కాకుండా బుధవారం రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర  అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన జరిగే పార్లమంట్ ప్రభారీ, విస్తారక్ సమావేశంలోనే బన్సల్ పాల్గొంటారని సమాచారం.


రాష్ట్ర ముఖ్య నేతలకు ప్రత్యేక స్థానాలు కల్పించి..


అలాగే రాష్ట్రంలోని లోక్ సభ నియోజక వర్గాల్లో పార్లమెంట్ కన్నీనర్లు, జాయింట్ కన్వీనర్లుగా రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలను బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నియమించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల వరకు వీరు తమకు కేటాయించిన నియోజక వర్గాల్లో పని చేయాల్సి ఉంటుంది. వీటన్నిటిని పరిశీలించేందుకు గాను కేంద్ర హోం మంత్రి అమిత్ షఆ రాష్ట్రానికి రానున్నారు. పార్టీ సన్నద్ద చూశాకా, కావాల్సిన సలహాలు, సూచనలు ఇచ్చి పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేస్తారు.