అన్వేషించండి

Hyderabad మెట్రో విస్తరణను కేంద్ర మంత్రి అడ్డుకుంటున్నారు.. కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి: Revanth Reddy

Hyderabad Metro Expansion | హైదరాబాద్ మెట్రో విస్తరణతో పాటు రీజనల్ రింగ్ రోడ్డు, మూసీ ప్రక్షాళనను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కేంద్ర మంత్రి హైదరాబాద్ మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నారని సీఎం ఆరోపణ.
  • మల్కాజిగిరి, ఉప్పల్ అభివృద్ధి పనులు, క్యూర్-1 యాప్‌ను ప్రారంభించారు.
  • మూసీ ప్రక్షాళనకు కేంద్రం అడ్డుపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
  • జూన్ 15 తర్వాత రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణ మారుతుందని హెచ్చరించారు.

Telangana CM Revanth Reddy | హైదరాబాద్: ఓ కేంద్రమంత్రి హైదరాబాద్ మెట్రో విస్తరణను ఢిల్లీలో అడ్డుకుంటున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మెట్రో విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బీజేపీలో ఉంటూనే బీఆర్‌ఎస్ నేత కేటీఆర్‌కు సహకరిస్తున్నారని స్వయంగా ఆ పార్టీ నేతలు చెబుతున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్రం నుండి అనుమతులు ఎందుకు రావడం లేదో సమాధానం చెప్పాలని కిషన్ రెడ్డిని డిమాండ్ చేశారు. ఉప్పల్ భగాయత్ వేదికగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 

క్యూర్-1 మొబైల్ యాప్‌ ఆవిష్కరణ

ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు సాంకేతిక సేవలను ప్రారంభించారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణం, ఉప్పల్‌లో వంద పడకల ఏరియా ఆసుపత్రి నిర్మాణం, ఏవోసీ (AOC) సెంటర్ చుట్టూ ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన పునాది వేశారు. భవిష్యత్తు డిజిటల్ సేవల కోసం క్యూర్-1 (CURE-1) మొబైల్ యాప్‌ను ఆవిష్కరించారు. ఈ నూతన యాప్ ద్వారా నగర ప్రజలు తమ ఆస్తి పన్ను, విద్యుత్, నీటి బిల్లులను సులభంగా చెల్లించే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది.

గుజరాత్‌లో సబర్మతి రివర్ ఫ్రంట్, ఢిల్లీలో యమునా రివర్ ఫ్రంట్ పేరుతో అభివృద్ధి చేసుకుంటారు. యూపీలో గంగా నదిని అక్కడి ప్రభుత్వాలు ప్రక్షాళన చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ గొప్పగా చెబుతున్నారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. కానీ, తెలంగాణలో మూసీ ప్రక్షాళన చేస్తామంటే మాత్రం ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.  రాజకీయాలు కేవలం ఎన్నికల సమయంలోనే ఉండాలని, అభివృద్ధిలో కాదని హితవు పలికారు. ఇతర రాష్ట్రాల్లో నదుల ప్రక్షాళనను సమర్థించే బీజేపీ నేతలు, మూసీ ప్రక్షాళనపై రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికారు. 

Also Read: Komatireddy Rajgopal Reddy: మంత్రి పదవి కోసం రాజగోపాల్ రెడ్డి మరోసారి..! ఈసారైనా గుడ్‌న్యూస్ వింటారా?

జూన్ 15 తర్వాత తెలంగాణ ప్రభుత్వ కార్యాచరణ మారుతుందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ మెట్రో విస్తరణకు ఎందుకు అనుమతి ఇవ్వరో, మన రైతులు పండించిన ధాన్యాన్ని ఎందుకు పూర్తిగా కొనరో, రీజినల్ రింగ్ రోడ్డుకు (RRR) నిధులు ఎందుకు కేటాయించరో.. వాటి సంగతి చూస్తామన్నారు.  మంచి పనుల విషయంలో రాజకీయం చేయవద్దని ప్రతిపక్షాలకు సూచించారు. నన్ను ఎవ్వరూ ఏం చేయలేరని కిషన్ రెడ్డి అంటున్నాడు. అయితే ఇక్కడి ప్రజలతో పెట్టుకున్నోడు, తెలంగాణ ప్రజలతో గోక్కున్నోడు చరిత్రలో బాగుపడి బట్టకట్టినోడు లేడన్నారు.

మెట్రో విస్తరణను ఆపుతున్న కేంద్ర మంత్రి..

ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో దాదాపు 1.34 కోట్ల మంది జనాభా ఉన్నారని, ఇంత భారీ సంఖ్యలో ఉన్న ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం సాధారణ విషయం కాదన్నారు. నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో రైలు ప్రతిపాదన చేశాం. 122 కి.మీ మేర మెట్రో విస్తరణకు అన్ని అనుమతులు వచ్చాక మన కేంద్రమంత్రి కాళ్ళల్లో కట్టెలు, పుల్లలు పెట్టి అర్ధాంతరంగా ఆపేశారని ఆరోపించారు. రీజినల్ రింగ్ రోడ్డు కోసం కాలుకు బలపం కట్టుకొని తిరుగుతున్నప్పటికీ.. అనుమతులు రాకుండా ఎవరు ఆపుతున్నారు? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పరిపాలనా సౌలభ్యం కోసమే జీహెచ్‌ఎంసీ(GHMC)ని మూడుగా విభజిస్తే, కొందరు రాజకీయ లబ్ధి కోసమేనంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read: Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు

ప్రజల ఇబ్బందులను తొలగించేందుకే ఉప్పల్‌లో మున్సిపల్ ఆఫీసును ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాజకీయంగా కష్టాల్లో ఉన్న సమయంలో తనను మల్కాజిగిరి ప్రజలే ఎంపీగా గెలిపించారని గుర్తు చేసుకున్నారు. గతంలో కేంద్రం సహకారం లేకపోవడం వల్లే అనుకున్న పనులు చేయలేకపోయానని, ఇప్పుడు ముఖ్యమంత్రిగా మల్కాజిగిరి నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ధి చేసే బాధ్యతను తానే తీసుకుంటున్నానని చెప్పారు.

Frequently Asked Questions

హైదరాబాద్ మెట్రో విస్తరణకు అడ్డంకులు ఎందుకు ఎదురవుతున్నాయి?

ఒక కేంద్రమంత్రి మెట్రో విస్తరణను ఢిల్లీలో అడ్డుకుంటున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రతిపాదనలను ఆమోదించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

క్యూర్-1 మొబైల్ యాప్ దేనికి ఉపయోగపడుతుంది?

ఈ యాప్ ద్వారా నగర ప్రజలు తమ ఆస్తి పన్ను, విద్యుత్, నీటి బిల్లులను సులభంగా చెల్లించవచ్చు. భవిష్యత్తు డిజిటల్ సేవల కోసం దీన్ని ప్రారంభించారు.

మూసీ ప్రక్షాళన ప్రాజెక్టును ఎందుకు అడ్డుకుంటున్నారు?

రాజకీయాలు ఎన్నికల సమయంలోనే ఉండాలని, అభివృద్ధిలో కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇతర రాష్ట్రాల్లో నదుల ప్రక్షాళనను సమర్థించే బీజేపీ నేతలు మూసీపై రాజకీయం చేయడం సరికాదని ఆయన హితవు పలికారు.

తెలంగాణ ప్రభుత్వం జూన్ 15 తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోనుంది?

మెట్రో విస్తరణకు అనుమతులు, ధాన్యం కొనుగోలు, ఆర్‌ఆర్‌ఆర్ నిధుల కేటాయింపు వంటి పెండింగ్‌లో ఉన్న విషయాలపై ప్రభుత్వం దృష్టి సారించనుంది. అభివృద్ధి విషయంలో రాజకీయం చేయవద్దని ప్రతిపక్షాలకు సూచించింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News:ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Kaleshwaram Project: కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
Telangana Latest News: 9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
HMDA Chief Engineer ACB Raids: హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
హైదరాబాద్‌లో మరో అవినీతి తిమింగలం పట్టివేత - హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల ఆస్తులు
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
Pawan Kalyan Doctor: పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
Telangana Gurukulam Funds Scam: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై పదివేల కోట్ల స్కామ్ ఆరోపణలు - జైలుకెళ్లడానికి సిద్ధమన్న మాజీ ఐపీఎస్
CM Chandrababu Naidu Speech: ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
Jana Nayagan Release Date : జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
జన నాయగన్ అఫీషియల్ రిలీజ్ డేట్ - ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారుగా...
Ek Din OTT : ఓటీటీలోకి వచ్చేసిన సాయి పల్లవి బాలీవుడ్ మూవీ - ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేసిన సాయి పల్లవి బాలీవుడ్ మూవీ - ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Fake IAS Officer Wedding Fraud: ఐఏఎస్ అంటే ఎగిరి గంతేసి పెళ్లి చేసుకున్నాడు - శోభనం నైటే కోటి నగలతో జంప్ - పాపం పెళ్లికొడుకు !
ఐఏఎస్ అంటే ఎగిరి గంతేసి పెళ్లి చేసుకున్నాడు - శోభనం నైటే కోటి నగలతో జంప్ - పాపం పెళ్లికొడుకు !
Pawan Kalyan: సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!
సొంత ఖర్చులతోనే పవన్ కల్యాణ్ సర్జరీలు! డిప్యూటీ సీఎం ఆఫీస్ కీలక ప్రకటన!
Embed widget