Telangana Latest News: తెలంగాణ స్పీకర్‌ను అగౌరవపరిచేలా మాట్లాడలేదని బీఆర్‌ఎస్ మరోసారి స్పష్టం చేసింది. శనివారం సభ ప్రారంభ సమయంలో బీఆర్‌ఎస్ సభ్యుడు హరీష్ మాట్లాడుతూ జగదీష్‌రెడ్డి సస్పెన్షన్‌పై పునరాలోచించాలని రిక్వస్ట్ చేశారు.
సభలో హరీష్‌రావు మాట్లాడుతూ... స్పీకర్ అంటే తమకు చాలా గౌరవం ఉందని అన్నారు. ఆయన్న ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు సహకరించామని పేర్కొన్నారు. అలాంటి స్పీకర్‌ను అగౌరవపరిచే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. జగదీష్ రెడ్డి కూడా తప్పుగా మాట్లాడాలేదని వివరణ ఇచ్చారు. అందుకే సస్పెన్షన్‌ను పునఃపరిశీలించాలని కోరారు. సస్పెండ్ చేసే ముందు జగదీష్ రెడ్డి వివరణ కూడా తీసుకొని ఉంటే బాగుండేదని అన్నారు.
అంతకుముందు స్పీకర్ ఛాంబర్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సభాపతిని కలిశారు. ఎలాంటి వివరణ తీసుకోకుండా చర్యలు తీసుకున్నారని అన్నారు. తప్పుగా మాట్లాడలేదని సస్పెన్షన్ ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు.