Etela Rajender:రాజ్యంగం కల్పించిన వ్యక్తి స్వేచ్చను హరించే అధికారం ఎవరికీ లేదు. కేవలం సంఘవిద్రోహ శక్తులు, దేశ ద్రోహులు, టెర్రిరస్టుల మీద పెట్టాల్సిన నిఘాను ప్రతిపక్ష నాయకుల మీద, నాయకుల కుటుంబ సభ్యలు మీద , వారి పిఎస్ లు, పీఎల , పీఆర్ ఓలు ,చివరకు వారి గన్ మెన్ ల మీద పెట్టారాని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా,  తాను ఏ క్షణంలో ఎక్కడ ఉన్నాను, ఏం చేస్తున్నాను , ఎవరితో మాట్లడుతున్నాను అని తెలుసుకున్నారని చెప్పారు. "ఈ ట్యాపింగ్ వ్యవహారం 2018 నుంచి జరుగుతోంది. నేను హుజూరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసిన నాటి నుంచి నా ఫోన్ ట్యాపింగ్ చేసి నన్ను టార్గెట్ చేశారు. నన్ను ఓడించేందుకు ప్రయత్నం చేశారు. 2021లో హుజూరాబాద్ ఉపఎన్నికలు వస్తే ఆరునెల పాటు ఎన్నికల ప్రచారం జరిగితే, నేను ఏ కార్యకర్తలతో మాట్లడుతున్నాను, ఏం మట్లడుతున్నాను అనేది ట్యాప్ చేసి వారి ఇళ్లకు వెళ్లి... నాతో మాట్లాడిన వారిని బెదిరించేవారు. డబ్బులు, పదవి ఆశ చూపి, అధికారంతో బెదిరించిన ఆధారాలు సిట్ అధికారులు చూపించారు. వారి మధ్య  జరిగిన సంభాషనల కూడా కాల్ డేటా కూడా ఈరోజు సిట్ అధికారుల చూపించారు. 2023లోొ తాను గజ్వేల్‌లో పోటీ చేసినప్పుడు, హుజురాబాద్‌లో పోటీ చేసినప్పుడు ఇదే దుర్మాగమైన పద్దతి కొనసాగించారు. మునుగోడు ఉపఎన్నికల సమయంలో మేం ఎవరితో మాట్లడుతున్నాం, ఏం తింటున్నాం, ఎక్కడ పడుకుంటున్నాం. ఇలా ఇవన్నీ తెలుసుకునేవాళ్లు. " అని ఈటల ఆందోళన వ్యక్తం చేశారు. 

ఈటెల డిమాండ్...

"ఇప్పటికే  ఫోన్ ట్యాపింగ్ విచారణ ప్రారంభించి ఏడాదిన్నర గడచిపోయింది. ఈ ప్రభుత్వ వచ్చాక అనేక కమిషన్లు వేశారు. విద్యుత్ కొనుగోలుపై కమిషన్ వేశారు... ఏమైందో  తెలియదు.ఫోన్ ట్యాపింగ్‌పై కమిషన్ వేశారు, ఇప్పటకీ ట్యాపింగ్ కమిషన్ ఏం చేస్తుందో ఎవరికీ  తెలియదు. కాళేశ్వరంపై కమిషన్ వేశారు. ఏం చేస్తున్నారో  తెలియదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిజాయితీ ఉండాలి. బీఆర్ ఎస్, బిజెపిలు ఒకటని చెప్పే రేవంత్ రెడ్డి ఇప్పుడు సమాధానం చెప్పాలి. మీరు బీఆర్ ఎస్ తో తెరచాటు ఒప్పందం లేకపోతే, లాలూచీ పడకపోతే.. ఎందుకు తూతూ మంత్రంగా విచారణ జరుగుతుంది. విచారణ రిపోర్ట్స్ ఎందుకు బయటపెట్టడంలేదో సమాధారం చెప్పాలి..

ప్రభాకర్ రావు చట్టానికి లోబడి పనిచేయలేదు. కేసీఆర్ అధికారంలో ఉన్నంత కాలం కేసీఆర్ ఇష్టానికి లోబడి మాత్రమే పని చేశారు. నిబంధనలకు విరుద్దంగా ఎస్ ఐబిలో ప్రభాకర్ రావు  పదివీ విరణమణ తరువాత కూడా కావాలనే కేసీఆర్  కొనసాగించారు. ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకృష్ణరావు ఇలా ఎవరైనా పైన అధికారులు ఆదేశాలు మాత్రమే పాటించామని చెప్పారు. రాష్ట్ర గవర్నర్, జడ్జిలు,  మంత్రులు, ఎమ్మెల్యేల ఫొన్లు ట్యాప్ చేయడం అత్యంత దుర్మార్గం. 1975 లో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీని తలపించేలా తిరిగి కేసీఆర్ పాలన రోజులు కనిపించాయి. సాక్ష్యాధారాలు ఎందుకు కాల్చేశారనేది సమగ్ర విచారణ జరగాలి. ప్రజాస్వామ్యంపై విశ్వాసం పెరగాలంటే ఎంతటివారైనా తప్పకుండా విచారణ చేయాల్సిందే. లేకపోతే ఈ ప్రభుత్వం కూడా వారితో కుమ్మక్కైయిందని భావించాల్సి వస్తుంది." అని హెచ్చరించారు. 

నేనూ,నా భార్య మాటలు కూడా వినేశారు..

"నా ఫోన్ తోపాటు , నా భార్య జమున ఫోన్ నెంబర్ కూడా ట్యాప్ చేశారు. నా భార్య పంపే మెసేజ్ లు కూడా చదివేవారు. ఆ మెసేజ్ ల లిస్ట్ సిట్ అధికారులు నా ముందు పెట్టారు. ఇవన్నీ మీవేనా అని అడిగారు. ఇవన్నీ కూాడా మావేనని సిట్ ముందు చెప్పాను. మా పార్టీ నాయకులు వందల మందిపై నిఘా పెట్టారు. ప్రణీత్ రావుతోపాటు అనేక మంది నిందితులు ప్రభాకర్ రావు చెబితేనే ఫోన్ ట్యాప్ చేశామని చెప్పారు. ప్రభాకరావు నా కింది ఉన్న అధికారులు తాను చెప్పినవారి ఫోన్లతో పాటు చెప్పనివారి ఫోన్లు కూడా ట్యాప్ చేశారని చెప్పారు. ఈ మొత్తం వ్యవస్దలు సిఎం కేసీఆర్ కంట్రోల్ లో ఉండేవి. నేనూ నా భార్య మాట్లాడుకున్న మాటలు కూడా విన్నారంటే ఎంత నీచానికి ఒడిగట్టారో అర్దం చేసుకోవచ్చు. ఈ ప్రభుత్వానికి ధైర్యం లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నాము.