Raja Singh: ఈరోజు కాకపోతే రేపు నీ తల నరికేస్తాం! ఎమ్మెల్యే రాజా సింగ్‌కు బెదిరింపు కాల్స్ కలకలం

Death Threats to Raja Singh | కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడ్డారు. కచ్చితంగా చంపేస్తామని ఫోన్ చేసి బెదిరించడం కలకలం రేపుతోంది.

Continues below advertisement

BJP MLA Raja Singh receives death threats | హైదరాబాద్: తెలంగాణకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపుతోంది. గతంలోనూ పాక్, ఆఫ్గనిస్తాన్ కేంద్రంగా ఆయన హత్యకు కుట్ర జరిగిన విషయం తెలిసిందే. దీనిపై అప్పట్లో రాజా సింగ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. వేరే కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాజా సింగ్ హత్యకు కుట్ర పన్నిన నిందితులను అరెస్ట్ చేశారు.

Continues below advertisement

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు తాజాగా మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆదివారం మధ్యాహ్నం తనకు రెండు నంబర్ల నుంచి కాల్స్ వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈరోజు కాకపోతే రేపు అయినా నీ తల నరికేస్తాం ఇన్షాల్లా! అంటూ తనను హెచ్చరించారని రాజా సింగ్ చెప్పారు.  ఇప్పుడు మీ మోదీ (ప్రధాని నరేంద్ర మోదీ), మీ యోగి (యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్) కూడా నిన్ను రక్షించలేరంటూ తనను హెచ్చరించినట్లు టైగర్ రాజాసింగ్ తెలిపారు. ఆ ఫోన్ నంబర్లు వివరాలు మీడియాకు వెల్లడించారు. 

రాజా సింగ్‌కు బెదిరింపు కాల్స్ ఈ నెంబర్స్ నుంచి వచ్చాయి. 

+918986512926
3.54 pm
+919434154614
3.30pm

హిందువుల గొంతునొక్కే ప్రయత్నం

ప్రపంచ వ్యాప్తంగా హిందువులపై జరుగుతున్న దాడులు, బెదిరింపులను ఎవరూ పట్టించుకోరని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. తాను హిందువుల కోసం మాట్లాడితే ఉద్దేశపూర్వకంగానే తనపై చర్యలు తీసుకున్నారని ఆరోపించారు. విద్వేషపూరిత ప్రసంగం చేశాడని సాకులు చెబుతూ తన సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేపిస్తున్నారని వాపోయారు. శైవ క్షేత్రం శ్రీశైలంలో శివ భక్తుల పైన పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని రాజా సింగ్ తీవ్రంగా ఖండించారు. ఇది కేవలం ఒకరిద్దరు వ్యక్తుల మీద జరిగిన దాడి కాదని, మొత్తం హిందువుల మీద జరిగిన దాడిగా అభివర్ణించారు.

హిందువుల పుణ్యక్షేత్రం శ్రీశైలంలో ముస్లింలకి షాపులు ఎందుకు ఇస్తున్నారంటూ సూటిగా ప్రశ్నించారు. భారతదేశంలో భావప్రకటన స్వేచ్చ ప్రమాదంలో పడిందని, అందుకు ఈ ఘటనే ఉదాహరణగా నిలుస్తుందన్నారు. "కంటెంట్ మోడరేషన్"  ముసుగులో జరుగుతున్న వివక్షను హిందువులు బహిర్గతం చేయాలని మీడియాను తనకు సహకరించాలని కోరారు. హిందూ హక్కుల కోసం నినదిస్తే.. ఎలా అణచివేతకు గురవుతున్నారో హిందువులంతా తెలుకోవాలన్నారు.  

Continues below advertisement
Sponsored Links by Taboola