అన్వేషించండి

Pre Wedding Fraud: వారు పెళ్లికొడుకులు కాదు, కీచకులు.. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని సజ్జనార్ సలహా

ప్రేమ పెళ్లి అయినా, పెద్దలు కుదిర్చిన వివాహం అయినా పెళ్లికి ముందు శారీరక సంబంధం విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఒత్తిడికి లొంగవద్దని హైదరాబాద్ సీపీ సజ్జనార్ యువతులకు సూచించారు.

హైదరాబాద్: పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలు రోజురోజుకూ పెరిగి పోతున్నాయి. కేవలం ప్రేమ పేరుతో మాత్రమే కాదు, పెద్దలు కుదిర్చిన సంబంధాల విషయంలోనూ కొందరు నయవంచకులు యువతులను మోసం చేస్తున్నారని అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ సూచించారు. ఇలాంటి ఘటనలపై గత కొంతకాలం నుంచి హైదరాబాద్ షీ టీమ్స్‌కు ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. 

మోసం జరుగుతున్న తీరు ఇదీ..
ముందుగా సంప్రదాయబద్ధంగా పెళ్లి చూపులు జరుగుతాయి. ఆపై ఎంగేజ్‌మెంట్ జరిపిస్తారు. ఇక మాకు పెళ్లి ఖాయమైంది కదా అనే చనువుతో యువకులు ఆ యువతులకు దగ్గరవుతున్నారు. ఎలాగూ పెళ్ళి చేసుకుంటున్నాం కదా.. పని ఇప్పుడైతే ఏంటి? అని మాయమాటలు చెప్పి, కొందరు యువతులను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఒత్తిడి పెంచి యువతులను శారీరకంగా లోబచుకుంటున్నారు. తీరా తమ కోరిక తీరాక వారి అసలు రంగు బయట పడుతుంది. పెళ్లి పీటలు ఎక్కాలంటే తమకు భారీగా డబ్బు కావాలని, అదనపు కట్నం ఇస్తేనే పెళ్లి జరుగుతుందని లేకపోతే మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకుంటామని బెదిరింపులకు పాల్పడుతున్నారు’ అని సజ్జనార్ యువతులను అప్రమత్తం చేశారు.

నిశ్చితార్థం జరిగిపోవడం, బంధుమిత్రులు అందరికీ మీ పెళ్లి గురించి తెలిసిపోతుంది. కనుక ఇప్పుడు పెళ్లి ఆగిపోతే తమ కుటుంబం పరువు ఎక్కడ పోతుందోనన్న భయంతో చాలామంది యువతులు, వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు. ఇదే అదనుగా భావిస్తున్న కొందరు కేటుగాళ్ళు, అడిగినంత డబ్బు ఇవ్వాలంటూ అమ్మాయిల తల్లిదండ్రులను వేధిస్తున్నారు. పరువు పోతుంది అని భయపడి మౌనంగా ఉంటే మాత్రం మీరు జీవితాంతం నరకం అనుభవించాల్సి వస్తుంది. నిశ్చితార్థం అయినా సరే, పెళ్లి పీటలు ఎక్కేవరకు కూడా ప్రతి యువతి అప్రమత్తంగా ఉండాలని సజ్జనార్ సూచించారు.

‘పెద్దలు కుదిర్చిన సంబంధమే కదా అని ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు. అబ్బాయి ప్రవర్తన, స్నేహితులు, అలవాట్లపై తప్పక ఆరా తీయాలి. కానీ పెళ్లికి ముందే ఏకాంతంగా కలవడానికి, శారీరక సంబంధానికి ఒత్తిడి చేస్తే అలాంటి వ్యక్తులను కచ్చితంగా అనుమానించాలి. ఈ సమయంలో వారి ప్రతిపాదనను ధైర్యంగా తిరస్కరించడంతో పాటు.. డబ్బు డిమాండ్ చేసినా, బ్లాక్ మెయిల్ చేసినా భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని’ సజ్జనార్ సలహా ఇచ్చారు.

ఎవరైనా మోసపోయి ఉంటే, ఇంకా తమకు అన్యాయం జరుగుతోందని భావిస్తే ధైర్యంగా ముందుకు రావాలన్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. ఇలాంటి సమస్యలు ఎదురైతే వెంటనే హైదరాబాద్ షీ టీమ్స్ వాట్సాప్ నంబర్ 9490616555కు గానీ, డయల్ 100 కు గానీ కాల్ చేసి ఫిర్యాదు చేయాలని యువతులు, వారి కుటుంబాలకు సజ్జనార్ సూచించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Gaddar Awards 2025 : గద్దర్ అవార్డ్స్... బెస్ట్ మూవీ రాజు వెడ్స్ రాంబాయి - బెస్ట్ యాక్టర్‌గా చై, హీరోయిన్ రష్మిక
గద్దర్ అవార్డ్స్... బెస్ట్ మూవీ రాజు వెడ్స్ రాంబాయి - బెస్ట్ యాక్టర్‌గా చై, హీరోయిన్ రష్మిక
Telangana News: తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి ఎండ్ కార్డ్ పడినట్టేనా! సాయంత్రం కీలక పరిణామం!
తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి ఎండ్ కార్డ్ పడినట్టేనా! సాయంత్రం కీలక పరిణామం!
Gas Price Hike: ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
Santosh Nagar Steel Bridge: సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ ప్రత్యేకతలేంటీ ? ఇంతకీ స్థానికులు ఏమంటున్నారో తెలుసా..
సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ ప్రత్యేకతలేంటీ ? ఇంతకీ స్థానికులు ఏమంటున్నారో తెలుసా..
Advertisement

వీడియోలు

Vijay Trisha Attended Marriage | పట్టు బట్టల్లో..ఒకే కారులో..విజయ్ త్రిష | ABP Desam
Axar patel Catches vs Eng T20 World Cup 2026 | కళ్లు చెదిరే క్యాచ్ లతో దుమ్మురేపిన బాపు | ABP Desam
Jasprit Bumrah Bowling vs Eng | T20 World Cup 2026 ఫైనల్ కి భారత్ వెళ్లింది అంటే..బుమ్రా దయ | ABP Desam
Sanju Samson 89 vs England Semis | T20 World Cup 2026లో హీరోగా మారిపోయిన సంజూ శాంసన్ | ABP Desam
Ind vs Eng 2nd Semifinal Highlights | T20 World Cup 2026 సెమీస్ లో ఇంగ్లండ్ పై భారత్ విక్టరీ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి ఎండ్ కార్డ్ పడినట్టేనా! సాయంత్రం కీలక పరిణామం!
తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి ఎండ్ కార్డ్ పడినట్టేనా! సాయంత్రం కీలక పరిణామం!
Vijayawada Firing Case: విజయవాడలో హైడ్రామా; పోలీసులపైనే కాల్పులకు దుండగుడి యత్నం- ట్రిగ్గర్‌ లాక్ అవ్వడంతో తప్పిన ముప్పు!
విజయవాడలో హైడ్రామా; పోలీసులపైనే కాల్పులకు దుండగుడి యత్నం- ట్రిగ్గర్‌ లాక్ అవ్వడంతో తప్పిన ముప్పు!
Bengal Assembly Elections 2026: బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ధీటుగా మమతా బెనర్జీ ప్లాన్లు - విజయం ఖాయమని ధీమా - సాధ్యమేనా?
బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి ధీటుగా మమతా బెనర్జీ ప్లాన్లు - విజయం ఖాయమని ధీమా - సాధ్యమేనా?
Gold Discount: దుబాయ్‌లో బంగారంపై క్లియరెన్స్ సేల్‌ ఆఫర్‌!ఇరాన్ యుద్ధ సమయంలో ఎందుకలా చేస్తోంది? 
దుబాయ్‌లో బంగారంపై క్లియరెన్స్ సేల్‌ ఆఫర్‌!ఇరాన్ యుద్ధ సమయంలో ఎందుకలా చేస్తోంది? 
ఢిల్లీని
ఢిల్లీని "దెయ్యాల నగరం"గా మార్చిన ఇరాన్ పాలకుడు ఎవరో తెలుసా?
Gas Price Hike: ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
Ustaad Bhagat Singh Story : పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ రివీల్! - పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ ఏంటంటే?
పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ రివీల్! - పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ ఏంటంటే?
Best First Car India: బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ నుంచి SUV, ఎలక్ట్రిక్ వరకు - ఫస్ట్ టైమ్ కారు కొనేవాళ్లకు బెస్ట్ కార్లు
మొదటి కారు కొనాలనుకుంటున్నారా? ఇండియాలో బెస్ట్ ఆప్షన్లు ఇవే!
Embed widget