Bandi Bhagirath Case: హై ప్రొఫైల్ కేసుగా మారిన బండి భగీరథ్‌ పోక్సో కేసుపై సిట్ విచారణ ఎలా సాగనుంది? డిజిట్‌ ఆధారాలు శిక్ష పడేలా చేస్తాయా? బండి సంజయ్‌ను కూడా సిట్ అధికారులు విచారిస్తారా అనే అంశాలపై ఏబీపీ దేశం ప్రతినిధితో రిటైర్డ్ డీసీపీ బి. రెడ్డన్న పంచుకున్న విశ్లేషణాత్మక వివరాలు చూద్దాం. 

Continues below advertisement

ABP దేశం: బండి భగీరథ్‌పై పోక్సో కేసులో సిట్ విచారణ ఎలా సాగుతోంది? వాట్సప్ చాట్, కాల్ రికార్డింగ్స్ , వీడియోలు కీలక మారుతాయా?

బి. రెడ్డన్న, మాజీ డీసీపీ: బండి భగీరథ్‌పై పోక్సో కేసులో వాళ్లిద్దరి మధ్య వాట్సప్ చాటింగ్, ఫోన్ కాల్స్ మాత్రమేకాదు అన్ని అధారాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు సిట్ అధికారులు. అంతేకాదు సోషల్ మీడియాలో ఇతర మాద్యమాల ద్వారా చాటింగ్ డేటాను కూడా ఆధారాలుగా తీసుకుంటారు. ఘటనకు ముందు తరువాత వీళ్లు ఎవరిని కలిశారు. ఎక్కడ తిరిగారు. మధ్యవర్తులు ఎవరైనా ఈ కేసులో మాట్లడారా? ఏం మాట్లడారు. ఇలా వాళ్లందరినీ పోలీసులు పిలిపించి, సమగ్రంగా విచారిస్తారు. పోలీసు విచారణలో లేదా న్యాయస్దానంలో విచారణ జరిగే క్రమంలో ఎవరైతే మైనర్ బాధితురాలు లేదా బాధితుడి ఫోటో అత్యంత గోప్యంగా ఉంచుతారు. వీటిని బహిర్గతం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలుంటాయి. బాధిత అమ్మాయి చెప్పిన సమాచారాన్ని స్పెషల్ కోర్టులో ఇన్ కెమెరాలో వన్ బై వన్ విచారణ చేస్తారు. జడ్జి చాంబర్‌లో ఇతరులు చూడకుండా విచారణ జరపడమేకాదు, మొత్తం విచారణలో ఏం ప్రశ్నలు అడిగారు, బాధితురాలు ఎలా సమాధానం చెప్పింది అనే అన్ని విషయాలను పూర్తిగా వీడియో రికార్డ్ చేస్తారు. పోక్సో కేసులో నిందితుడ్ని సైతం ఇదే విధంగా విచారిస్తారు. అలా వీడియో రికార్డ్ చేయడంతోపాటు వాళ్లు ఏం మాట్లడారు అనేది పూర్తి గోప్యంగా ఉంచుతారు. కేవలం కోర్టులో జడ్జికి మాత్రమే వీడియో వివరాలు అందజేస్తారు.

Continues below advertisement

ABP దేశం: బండి భగీరథ్ తండ్రిని కలిస్తే బెదరించారని బాధితురాలి తల్లి చెబుతోంది, నిందితుడి తండ్రిని విచారిస్తారా?

బి. రెడ్డన్న, మాజీ డీసీపీ: బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో ప్రతీ ఒక్కరినీ విచారించవచ్చు. మధ్యవర్తిగా వ్యవహరించిన వ్యక్తితో పాటు బాధితురాలి కుటుంబ సభ్యులను అక్కడకు తీసుకెళ్లిన డ్రైవర్‌ను సైతం విచారిస్తారు. ఈ నేపథ్యంలో నిందితుడు బండి భగీరథ్ తండ్రిని కూడా విచారించవచ్చు. ఈ కేసుతో ప్రమేయం ఉన్నవాళ్లు ఎవరైనా, వాళ్లు ఏ హోదాలో ఉన్నా విచారణ ఎదుర్కోక తప్పదు. సీఎం హత్య చేస్తే కచ్చితంగా విచారిస్తారో ఇది కూడా అంతే. పోలీసు అధికారి రేప్ చేస్తే కేసు అవుతుంది, అదేస్దాయిలో ప్రజాప్రతినిధులను కూడా విచారిస్తారు. పెద్ద హోదాలో ఉన్నా విచారించే హక్కు పోలీసు అధికారులకు ఉంటుంది. సాక్షిగా అయితే సాక్షిగా విచారిస్తారు. బెదిరించారు అని తేలితే, ప్రలోభ పెట్టారని ఆధారాలను చూపితే, కచ్చితంగా చట్టపరంగా చర్యలు ఉంటాయి.

ABP దేశం: పోక్సో కేసులో మీడియా హద్దులేంటి..?

బి. రెడ్డన్న, మాజీ డీసీపీ: ఈ కేసులో ప్రమేయం ఉన్న ప్రతీ ఒక్కరినీ ముందుగా విచారించిన తరువాత, వాళ్లిచ్చిన సమాచారం ఆధారంగా నిందితుడ్ని కస్టడీకీ కోరే అవకాశాలున్నాయి. నిందితుడు ఇచ్చే సమాధానాలు ఆధారంగా అవసరమైతే 2 లేదా అంతకంటే ఎక్కువ రోజులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తారు. బాధితురాలు మైనర్ కావడంతో ఈ కేసులో మెడికల్ ఎగ్జామినేషన్ విషయంలో చాలా జగ్రత్తలు పాటిస్తారు. మెడికల్ ఎగ్జామిన్ చేస్తున్న డాక్టర్ ఎట్టి పరిస్దితిలోనూ బాధితురాలి ఐడెంటీని ఎక్కడా బహిర్గతం చేయకూడాదు. పోలీసు అధికారులు సైతం సాక్షులను, పంచనామా ద్వారా సేకరించిన ఆధారాలు సీల్డ్ కవర్‌లో కోర్టులో జడ్జికి సమర్పిస్తారు. పూర్తి వివరాలతో ఛార్జిషీట్ దాఖలు చేస్తారు. విచారణ క్రమంలో ఏ రోజు ఎవరిని విచారించారో బయటకు చెప్పకూడాదు. కేసు విచారణపై సోషల్ మీడియాలో ,య్యూట్యూబ్ ఛానెల్స్‌లో ఇష్టమొచ్చినట్లు థంబ్ నెయిల్ పెడితే వాళ్లు కూడా శిక్షార్హులవుతారు. చాలా కేసుల్లో సోషల్ మీడియా యాక్టీవ్‌గా ఉంటుంది. అలా ఈ కేసుల్లో వ్యవహరిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవచ్చు.

ABP దేశం: రాజకీయ ప్రాభల్యం ఉన్న ఈ కేసులో విచారణ అధికారులపై రాజకీయ ఓత్తిడి ప్రభావం చూపుతుందా?

బి. రెడ్డన్న, మాజీ డీసీపీ: ఉద్యోగాలు పణంగా పెట్టి పోలీసు అధికారులు ఎప్పుడూ ఉద్యోగాలు చేయరు. చట్టానికి లోబడే పనిచేస్తారు. చట్టం అతిక్రమిస్తే పోలీసులు సైతం జైలుకు వెళ్లక తప్పదు. అలా అనేకమంది జైలుకు వెళ్లిన అధికారులున్నారు. చట్టం ముందు ఎవరైనా ఒక్కటే. పోలీసులు సైతం ఇందుకు అతీతులు కాదు. ఒత్తిడి అనేది చాలా కేసుల్లో ఉంటుంది. నిందితుల ప్రాబల్యం  ఉన్న ప్రతీ కేసులో ఒత్తిడి ఉంటుంది కానీ విచారణ అధికారులు అవేవీ పట్టించుకోరు. అలా ప్రభావం చూపితే, వాళ్లే జైలుకు వెళ్లక తప్పదు.

ABP దేశం: బండి భగీరథ్ కేసులో జీవిత ఖైదును డిసైడ్ చేసే కీలక ఆధారాలేంటి.?

బి. రెడ్డన్న, మాజీ డీసీపీ: నిందితురాలి హోమ్ నుంచి సెమన్ వస్తుంది. ఆ సెమన్ కలెక్ట్ చేస్తారు. నిందితుడి బ్లెడ్ గ్రూప్ టెస్ట్ చేస్తారు. ఆ సెమన్ అతనిదే అని తెలిస్తే రేప్ చేశాడని చెప్పడానికి అంతకంటే మించి ఆధారం ఇంకేముంటుంది. ఈ ఒక్క ఆధారంతోనే జైలు శిక్ష డిసైడ్ అవుతుంది. నేతరం తీవ్రతను బట్టి ఈ కేసుల్లో ఏడేళ్ల నుంచి జీతకాలం జైలు శిక్షపడిన సందర్భలున్నాయి. ఇటీవల వరంగల్‌లో 33ఏళ్లు జైలు శిక్ష విధించారు. విదేశాల్లో 200 ఏళ్లు జైలు కూడా విధించారు. మైనర్ అమ్మాయి లేదా అబ్బాయి ఎవరో మనకు తెలియక పోయినా దారినపోతూ జరిగింది చూసినా, ఆ సాక్ష్యులు చెప్పిన ఆధారాలతో కూడా కేసు నమోదు చేసి విచారణ చేస్తారు. అరెస్ట్, రిమాండ్, ఆ తర్వాత సాక్ష్యాల సమీకరించాలని అనుకుంటే పోలీసు కస్టడీలో తీసుకుని నిందితుడ్ని విచారిస్తారు. సెక్స్ చేసేటప్పుడు కండోమ్ వాడాను, దాచేశానని నిందితుడు విచారణలో చెబితే, సెక్షన్ 27 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కింద చార్జ్ షీట్‌లో అతనికి వ్యతిరేకంగా పెడతారు. ఇలా కేసును అన్ని కోణాల్లో పూర్తి స్థాయిలో విచారణ పూర్తి చేస్తారు. సీల్డ్ కవర్‌లో జడ్జికి మాత్రమే ఆధారాలను సమర్పిస్తారు సిట్ అధికారులు. ఆధారాలను పరిశీలించిన న్యాయమూర్తి విచక్షణపైన శిక్ష ఆధారపడి ఉంటుంది. పదేళ్లు, ఏడు లేదా జీవితకాలం ఒక్కోసారి ఉరి శిక్ష కూడా విధించిన సందర్భాలున్నాయి.