హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ రిజెక్ట్ కావడంతో బండి భగీరథ్ అరెస్టు అయ్యే అవకాశం ఉంది. పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు.
Bandi Bhageerath POCSO Case: బండి భగీరథ్ అరెస్టు తప్పదా! కేంద్రమంత్రి కుమారుడి కోసం ప్రత్యేక బృందాల గాలింపు!
Bandi Bhageerath POCSO Case: బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు రోజురోజుకు మరింత సంచలనంగా మారుతోంది. ఆయన ముందస్తు బెయిల్ ఇప్పుడు ఇవ్వలేమని హైకోర్టు చెప్పడంతో వాట్ నెక్ట్స్ అనే చర్చ మొదలైంది.

- పోక్సో కేసులో బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పరారీలో ఉన్నారు.
- హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడంతో అరెస్టు భయం.
- మైనర్ బాలిక తల్లి ఫిర్యాదుతో పోక్సో, బీఎన్ఎస్ కేసులు నమోదు.
- భగీరథ్ తనను తప్పుడు కేసులో ఇరికిస్తారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు.
Bandi Sanjay Son Arrest News: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పోక్సో కేసు విచారణలో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కనిపించడం లేదు. కేసు నమోదైనప్పటి నుంచి కనిపించడం లేదు. రెండు రోజుల క్రితం సిట్ అధికారులు లేఖను విడుదల చేశారు. రెండు రోజుల్లో విచారణకు హాజరవుతానంటూ చెప్పుకొచ్చారు. అయితే ఆయన అనుకున్నట్టు హైకోర్టు(Telangana High Court)లో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఈ దశలో ఉత్తర్వులు ఇవ్వలేమని న్యాయస్థానం పేర్కొంది. వచ్చే వారం దీనిపై తీర్పు ఇస్తామని కోర్టు స్పష్టం చేసింది. భగీరథ్ పోలీసులకు లొంగిపోతాడా, లేకా సుప్రీంకోర్టుకు వెళ్లి పోరాడతారా అన్న ఆసక్తి నెలకొంది. ప్రస్తుతానికి ఆయన కోసం పోలీసులు బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. భగీరథ్ సన్నిహితులు చెబుతున్న ప్రకారం ఏక్షణమైనా కోర్టులో లొంగిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది.
పోక్సో కేసు(POCSO Act) విచారణలో భగీరథ్ ముందస్తు బెయిల్‌పై హైకోర్టు రెండు రోజుల క్రితమే విచారణ పూర్తి చేసింది. శుక్రవార రాత్రి తుది తీర్పు వెల్లడించింది. ఈ దశలో ఎటువంటి ఉపశమనం కలిగించలేమని స్పష్టం చేసింది. న్యాయమూర్తి జస్టిస్ మాధవీ దేవి(Justice T Madhavi Devi) అర్ధరాత్రి వివరాలు వెల్లడించారు.
ముందస్తు బెయిల్ పిటిషన్ విచారించిన సందర్భంగా న్యాయమూర్తి బాధితురాలి స్టేట్‌మెంట్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. బాధితురాలి వాంగ్మూలాన్ని నేను పూర్తిగా చదివాను. ప్రస్తుత తరుణంలో ఎటువంటి మధ్యంతర ఆదేశాలు జారీ చేసేందుకు నేను సముఖంగా లేను. అని జస్టిస్ మాధవీ దేవి స్పష్టం చేశారు. దీంతో భగీరథ్‌కు అరెస్టు ముప్పు పొంచి ఉంది.
Also Read: కేంద్రమంత్రి బండి సంజయ్ తల్లికి గుండెపోటు! అత్యవసర చికిత్స చేసి స్టంట్ వేసిన వైద్యులు!
మే 8వ తేదీన నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో కీలక అంశాలు బాధితురాలు ప్రస్తావించారు. 17 మైనర్ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు భగీరథ్‌పై బీఎనఎస్, పోక్సో చట్టం కింద కేసులు నమోదుచేశారు. భగీరథ్ తన కుమార్తెతో సంబందం పెట్టుకొని ఆమెను లైంగికంగా వేధించాడని బాధితురాలి తల్లి ఆరోపించింది.
విచారణ సందర్భంగా ఇరు పక్షాల లాయర్లు గట్టిగా వాదనలు వినిపించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉన్నప్పుడు మధ్యంతర బెయిల్ మంజూరు చేసే అధికారం కోర్టుకు ఉంటుందని భగీరథ్ తరఫున న్యాయవాది వాదించారు. సదరు బాలిక, భగీరథ్ 2025 నుంచి స్నేహంగా ఉన్నారని, వారి మధ్య సత్సంబంధాలు ఉన్నాయని బాధితురాలి తల్లి స్టేట్‌మెంట్‌లో పేర్కొన్న అంశాలను డిఫెన్స్ తరుఫు లాయర్ కోర్టు దృష్టికి తెచ్చారు.
Also Read: భగీరథ్ కేసులో కోర్టు సంచలన ఆదేశాలు - మీడియా, సోషల్ మీడియాల్లో బండి సంజయ్ పేరు వాడితే కఠిన చర్యలు
భగీరథ్ తండ్రి బండి సంజయ్ కేంద్రమంత్రి కావడంతో ఆయన అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి అని, ఒక వేళ అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని వాదించారు బాధితురాలి తరఫు న్యాయవాది.
కరీంనగర్ పోలీసులు సమయం కోరిన భగీరథ్
భగీరథ్ కూడా కరీంనగర్ పోలీసులకు ఒక ఫిర్యాదు చేశారు. తనను తప్పుడు కేసుల్లో ఇరికిస్తామని బెదిరిస్తూ, సదరు బాలిక కుటుంబ ఐదు కోట్లు డిమాండ్ చేసిందని ఆయన ఆరోపించారు. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని పోలీసులు భగీరథ్‌కు మే 13న నోటీసులు ఇచ్చారు. అయితే ఆయన వ్యక్తిగతంగా హాజరుకాకుండా, తన తరఫున ఒక లేఖ పంపి రెండు రోజుల సమయం కోరారు.
న్యాయమూర్తి ఆవేదన
ఈ కేసు విచారణ సందర్భంగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై జస్టిస్ మాధవీ దేవి తీవ్ర అసహనం వ్యక్తం చేశఆరు. కేసు సున్నితత్వాన్ని పక్కన పెట్టి సామాజిక మాధ్యమాల్లో సాగుతున్న ప్రచారం తనను ఎంతగానో బాధించిందని అన్నారు.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Frequently Asked Questions
పోక్సో కేసులో బండి భగీరథ్ ప్రస్తుత పరిస్థితి ఏమిటి?
బండి భగీరథ్ పై ఏ సెక్షన్ల కింద కేసు నమోదైంది?
17 ఏళ్ల మైనర్ బాలిక తల్లి ఫిర్యాదు మేరకు బండి భగీరథ్ పై బీఎనఎస్ (BNS) మరియు పోక్సో (POCSO) చట్టం కింద కేసులు నమోదుచేశారు.
బండి భగీరథ్ తరఫు న్యాయవాది కోర్టులో ఏం వాదించారు?
ముందస్తు బెయిల్ పెండింగ్‌లో ఉన్నప్పుడు మధ్యంతర బెయిల్ మంజూరు చేసే అధికారం కోర్టుకు ఉందని, బాలిక, భగీరథ్ 2025 నుంచి స్నేహితులుగా ఉన్నారని వాదించారు.
బాధితురాలి తరఫు న్యాయవాది ఏమని వాదించారు?
బండి సంజయ్ కేంద్రమంత్రి కావడం వల్ల భగీరథ్ ప్రభావవంతమైన వ్యక్తి అని, అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని వాదించారు.
ట్రెండింగ్ వార్తలు





















