Telstra in Hyderabad: హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ సంస్థ.. ఈ రంగంలో మరిన్ని ఉద్యోగాలు
టెల్స్ట్రా సంస్థ రెండు ఇన్నోవేషన్ సెంటర్లను హైదరాబాద్, పుణెలో నెలకొల్పేందుకు ఆసక్తి చూపింది. బెంగళూరులో ప్రొడక్ట్ ఇంజినీరింగ్ ల్యాబ్‌ను గతంలోనే సంస్థ ప్రారంభించింది.
హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ అడుగు పెట్టనుంది. ఆస్ట్రేలియా కేంద్రంగా కార్యకలాపాలు సాగించే టెలీ కమ్యూనికేషన్, టెక్నాలజీ దిగ్గజం టెల్స్ట్రా భారత్‌లో తన ఉనికిని విస్తరించాలని నిర్ణయించింది. రెండు ఇన్నోవేషన్ సెంటర్లను హైదరాబాద్, పుణెలో నెలకొల్పేందుకు ఆసక్తి చూపింది. బెంగళూరులో ప్రొడక్ట్ ఇంజినీరింగ్ ల్యాబ్‌ను గతంలోనే సంస్థ ప్రారంభించింది.
అయితే టెల్స్ట్రా సంస్థ హైదరాబాద్‌లో ప్రారంభించబోయే ఇన్నోవేషన్ కేంద్రం గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్‌గా పని చేయనుంది. ఇది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), 5జీ, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి అంశాలపై పని చేస్తుంది. టెలికాం, ఇంటర్నెట్ రంగంలో వస్తున్న నూతన మార్పులను టెక్నాలజిస్టులు పూర్తిగా ఉపయోగించుకోవడంతో పాటు సరికొత్త ఆవిష్కరణలకు ఈ సెంటర్ వేదికగా మారనుంది. టెలికాం రంగానికి సంబంధించి స్థానికంగా ఉన్న సాంకేతిక నిపుణులకు మంచి అవకాశాలు రానున్నాయి.
కాగా, టెల్స్ట్రా హైదరాబాద్‌లో నెలకొల్పబోయే క్యాంపస్‌ను స్పెషలైజ్డ్ హై పెర్ఫార్మెన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ (హెచ్పీఎస్ఈ)గా ఏర్పాటు చేయనున్నారు. టెలికాం సాఫ్ట్వేర్కి సంబంధించి కన్సుమర్ బేస్డ్ డీప్ టెక్నాలజీ ఆవిష్కరణలు హైదరాబాద్ ఉండనున్నాయి. త్వరలో తాము ప్రారంభించే ఇన్నోవేషన్ సెంటర్లు టెలికాం రంగంలో కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీకి చిరునామాగా ఉంటాయని టెల్స్ట్రా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఎన్టీ అరుణ్ కుమార్ వెల్లడించారు. టెలికాం పరిశ్రమలో భవిష్యత్తులో తలెత్తే సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.
గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్‌ని టెల్స్ట్రా 2019లో ప్రారంభించింది. రెండేళ్ల కిందట 200 మందితో ప్రారంభమైన బెంగళూరు కార్యాలయంలో ప్రస్తుత ఉద్యోగుల సంఖ్య వెయ్యికి చేరింది. ఇప్పుడు తొలి ఇన్నోవేషన్ సెంటర్‌ను మించేలా పుణె, హైదరాబాద్‌లలో మరో రెండు క్యాపబిలిటీ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. బెంగళూరు, పూణే, హైదరాబాద్‌లలో కలిపి మొత్తంగా లక్ష చదరపు అడుగుల స్థలంలో కార్యకలాపాలు నిర్వహించాలని టెల్స్ట్రా అడుగులు వేస్తోంది.
Also Read: Komatireddy Venkat Reddy: చర్చనీయాంశంగా కోమటిరెడ్డి తీరు.. వద్దన్నా అటు వెళ్లిన ఎంపీ, పైగా సమర్థన
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
and tablets