రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి కారణమైన కారును సీజ్ చేశారు. నిందితుడు సందీప్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
Raidurgam Hit and Run Incident: రాయదుర్గం హిట్ అండ్ రన్ ఘటనలో ఒకరు మృతి.. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడి అరెస్ట్
రాయదుర్గం హిట్ అండ్ రన్ కేసులో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

- ప్రమాదం చేసిన ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్: నగరంలోని రాయదుర్గం పరిధిలో హిట్ అండ రన్ కేసు నమోదైంది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాజాగూడ ప్రధాన రహదారిపై కారు ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వ్యక్తిని హాస్పిటల్‌కు తీసుకెళ్తుంటే మరో వాహనం ఢీకొట్టిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, టీటీడీ బోర్డ్ మెంబర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
ఓఆర్‌ఆర్ రోటరీ నుంచి ఖాజాగూడ గ్రామం వైపు వెళ్లే మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్న నందులాల అనే వ్యక్తిని ఒక ఇన్నోవా కారు అత్యంత వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుప పడి ఉన్న బాధితుడిని గమనించిన జైద్‌షా కద్రీ అనే విద్యార్థి వెంటనే స్పందించి, అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించాడు.
అయితే, గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్తున్న క్రమంలో ఊహించని విధంగా మరొక కారు అతివేగంగా వచ్చి విద్యార్థిని, బాధితుడిని తీవ్రంగా ఢీకొట్టింది. ఈ రెండవ ప్రమాద తీవ్రతకు నందులాల అక్కడికక్కడే మృతి చెందగా, సాయం చేసేందుకు ముందుకు వచ్చిన విద్యార్థి జైద్‌షా కద్రీ సైతం తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే ఆ కారు ఓనర్ వాహనాన్ని నిలపకుండా అక్కడి నుంచి తన వాహనంలో పరారయ్యాడు.
స్థానికులు వెంటనే అక్కడకు చేరుకుని గాయపడిన విద్యార్థిని హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసి ప్రమాదానికి కారణమైన కారును, దాని యజమానిని గుర్తించారు. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు సందీప్ ఆ సమయములో కారు నడిపి ఒకరి మృతికి కారణమైనట్లు విచారణలో స్పష్టంగా తేలింది. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి, ప్రమాదానికి కారణమైన కారును సీజ్ చేయడంతో పాటు సందీప్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
ఇటీవల ఇనార్బిట్ మాల్ వద్ద ప్రమాదంలో యువతి మృతి
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ కుమారుడు సంజూష్ (21) నడిపిన ఆస్టన్ మార్టిన్ లగ్జరీ కారు ప్రమాదంలో ఓ యువతి మృతిచెందడం తెలిసిందే. జనసేన పార్టీ ఎంపీ కుమారుడు ఈ యాక్సిడెంట్ చేయగా.. తాజాగా రాయదుర్గం ప్రమాదంలో కారు నడిపింది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అంత్యంత సన్నిహితుడైన టీటీడీ బోర్డ్ మెంబర్ ఆనంద్ సాయి కుమారుడు కావడంతో హాట్ టాపిక్ అవుతోంది.
గత నెలలో మాదాపూర్ ఇన్ఓర్బిట్ మాల్ వద్ద రోడ్డు దాటుతున్న భారతి ముఖి (26) అనే యువతిని తీవ్రంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఆమెను అదే కారులో ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఆమె అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. ఈ ఘటనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి రక్త నమూనాలు సేకరించి పరీక్షించగా, మద్యం లేదా ఇతర మత్తు పదార్థాలు సేవించలేదని నిర్ధారణ అయింది. భారతీయ నాయ సంహిత (BNS) సెక్షన్ 106(1) కింద కేసు నమోదు చేసిన పోలీసులు, ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష పడే బెయిలబుల్ నేరం కావడంతో సంజూష్‌కి నోటీసులు జారీ చేసి దర్యాప్తు చేపట్టారు.
Frequently Asked Questions
ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
ట్రెండింగ్ వార్తలు






















