సికింద్రాబాద్: యూనిట్ హెడ్‌క్వార్టర్స్ కోటా రిక్రూట్‌మెంట్ ర్యాలీ (అగ్నివీర్) త్వరలో ప్రారంభం కానుంది. యునిట్ హెడ్‌క్వార్టర్ కోటా (UHQ) కింద ఆగస్టు 01, 2025న సికింద్రాబాద్‌లోని 1 EME సెంటర్‌లో అగ్నివీర్ వీరుల పోస్టుల కోసం ఆర్మీ రిక్రూట్ మెంట్ చేపట్టనుంది. యుద్ధ వితంతువులు/ వితంతువులు/ మాజీ సైనికులు/ సైనికుల కుమారులు, సైనికులు/మాజీ సైనికుల సొంత సోదరుల కోసం సెలక్షన్స్ జరగనున్నాయి. అగ్నివీర్ (GD), అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ Tdn 10వ ఎడ్న్ STD కేటగిరీ (చెఫ్), ఓపెన్ కేటగిరీ కోసం అగ్నివీర్ కోసం ఆర్మీ రిక్రూట్‌మెంట్  నోటిఫికేషన్ విడుదలైంది. స్విమ్మింగ్, వాలీబాల్, డైవింగ్ విభాగాలలో స్పోర్ట్స్ కేటగిరీలో ఓపెన్ విభాగంలో అగ్నివీరుల నియామకం చేపడుతున్నారు. 

ఏజ్ లిమిట్అన్ని విభాగాల్లోనూ అభ్యర్థులకు వయోపరిమితి 17 ½ నుండి 21 సంవత్సరాలు (01 అక్టోబర్ 2004 కి ముందు జన్మించరాదు, 01 ఏప్రిల్ 2008 తర్వాత జన్మించకూడదు) పదిహేడున్నర సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల లోపు వారిని అర్హులుగా పరిగణిస్తారు. 

విద్యార్హత..అగ్నివీర్ జనరల్ డ్యూటీకి విద్యార్హత 10వ తరగతి / మెట్రిక్ లేషన్ ఉత్తీర్ణత. మొత్తం 45% మార్కులతో పాస్ కావాలి. ప్రతి సబ్జెక్టులో 33% శాతం మించి రావాలి. గ్రేడింగ్ విధానాన్ని అనుసరించే బోర్డులకు, కనీసం 'D' గ్రేడ్ (వ్యక్తిగత సబ్జెక్టులలో 33%-40%) లేదా నిర్దిష్ట సబ్జెక్టులలో 33%. మొత్తం 'C2' గ్రేడ్ లేదా సమానమైన 45%కి అనుగుణంగా గ్రేడ్‌లు ఉండాలి.

అగ్నివీర్ టెక్నికల్ పోస్టులకు అయితే సైన్స్‌లో 10+2 / ఇంటర్మీడియట్ పరీక్షలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంగ్లీషుతో కనీసం 50% మార్కులతో.. ప్రతి సబ్జెక్టులో 40% మార్కులతో పాస్ కావాలి. పైన పేర్కొన్న విద్యా అర్హతతో ఏదైనా గుర్తింపు పొందిన రాష్ట్ర విద్యా బోర్డు లేదా సెంట్రల్ ఎడ్యుకేషన్ బోర్డ్ నుండి NIOS, ITI కోర్సులో కనీసం ఒక సంవత్సరం NSQF స్థాయి 4 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. 50% మార్కులతో 10వ తరగతి / మెట్రిక్ ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లీష్, మ్యాథ్స్,  సైన్స్‌లో కనీసం 40% ITI నుండి రెండు సంవత్సరాల సాంకేతిక శిక్షణ అవసరం.లేదా ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మెకానిక్ మోటార్ వెహికల్, మెకానిక్ డీజిల్, ఎలక్ట్రీషియన్ పవర్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఇన్‌స్ట్రుమెంటల్ మెకానిక్, డ్రాఫ్ట్స్‌మన్ (అన్ని రకాలు), సర్వేయర్, జియో-ఇన్ఫర్మేటిక్స్ అసిస్టెంట్, మెకానిక్ కమ్ ఆపరేటర్ ఎలక్ట్రిక్ కమ్యూనికేషన్ సిస్టమ్, వెసెల్ నావిగేటర్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటో మొబైల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ ఇంజనీరింగ్.

అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ పోస్టులు 10వ తరగతి (చెఫ్), 10వ తరగతి సాధారణ ఉత్తీర్ణత చాలు. మొత్తం మార్కుల శాతంలో ఎలాంటి నిబంధన లేదు. కానీ ప్రతి సబ్జెక్టులో కనీసం 33% స్కోర్ చేయాలి. 

అర్హత ఉన్న అభ్యర్థులు రిక్రూట్ మెంట్ ర్యాలీలో పాల్గొనడానికి 1 ఆగస్టు 2025న ఉదయం 6 గంటలకు మిల్కా సింగ్ స్టేడియం, 1 శిక్షణ బెటాలియన్, 1 EME సెంటర్, సికింద్రాబాద్‌లో రిపోర్ట్ చేయాలని సూచించారు.

ఇతర వివరాల కోసం, అభ్యర్థులు ప్రధాన కార్యాలయం, 1 EME సెంటర్, బొల్లారం, సికింద్రాబాద్, తెలంగాణ, పిన్ - 500010 లో సంప్రదించవచ్చు లేదా awwaleagle@gmail.com కు ఇమెయిల్ చేయాలని సూచించారు. లేదా www.joinindianarmy@nic.in ని సందర్శించవచ్చు లేదా 040-27863016 నెంబర్ కు కాల్ చేసి సంప్రదించవచ్చు. ఏ దశలోనైనా అభ్యర్థిత్వాన్ని/ ర్యాలీని రద్దు చేసే హక్కు కమాండెంట్ 1 EME సెంటర్‌కు ఉంటుందని అభ్యర్థులకు స్పష్టం చేశారు.