Hyundai Creta Price : హ్యుందాయ్ క్రెటా కొనాలనుకుంటున్న మీరు హైదరాబాద్‌లో  నివసిస్తున్నట్లయితే, ఈ SUV ఎక్కడ తక్కువ ధరకు లభిస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

నిజానికి, భారతదేశంలో ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 11.11 లక్షల నుంచి ప్రారంభమవుతుంది, హై ఎండ్‌ కారు ధర 20.42 లక్షల వరకు ఉంటుంది.   కానీ ఆన్-రోడ్ ధరలో పన్నులు, RTO ఛార్జీలు, ఇన్సూరెన్స్ వంటివి ఉంటాయి, ఇవి ఆయా ప్రాంతాలను బట్టి మారుతుంది.  

 హైదరాబాద్, సికింద్రాబాద్‌లో ఎక్కువ ధర ఎక్కడ? 

హైదరాబాద్‌లో హ్యుందాయ్ క్రెటా బేస్ మోడల్ ఆన్-రోడ్ ధర సుమారు రూ. హైదరాబాద్‌లో 13,72,962 లక్షలకు లభిస్తుంది.  ఇందులో ఎక్స్‌ షోరూం ధర రూ. 11,10,900 ఉంటుంది. ఆర్టీవో ఫీజు రూ. 1,88,853  బీమా కోసం రూ.61,500 ఇతర ఛార్జ్‌లు రూ.11,709, మిగతా ఆప్షనల్స్‌ రూ.18,799 వసూలు చేస్తారు.  సికింద్రాబాద్‌లో ఈ ధరలు పరిశీలిస్తే... ఎక్స్‌షోరూం ధర రూ. 11,10,900 ఉంటుంది. ఆర్టీవో ఫీజు కూడా రూ. 1,88,853. బీమా ఖర్చు s.59,762 అదనం. ఇతర ఛార్జ్‌లు రూ.11,709, మిగతా ఆప్షనల్స్‌కు రూ.14,500 ఖర్చు పెట్టాలి. రెండింటి మధ్య తేడా 1,731 రూపాయలే కానీ.  డీలర్‌షిప్ , ఇన్సూరెన్స్ కంపెనీలపై ఆధారపడి ఉంటుంది, కాబట్టి నిజమైన ధర కొంత మారవచ్చు. కాబట్టి మీరు ధర ఆధారంగా నిర్ణయం తీసుకుంటే, సికింద్రాబాద్‌లో కొంతవరకు చౌకగా లభించవచ్చు.

తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడ ఎలాంటి దరకు లభిస్తుందో చూద్దాం. 

  • కరీంనగర్‌లో - రూ. 13,63,355
  • వరంగల్‌లో- రూ. 13,63,355
  • నిజామాబాద్‌లో - రూ.13,63,355
  • నల్గొండలో - రూ. 13,63,355
  • ఖమ్మంలో రూ.13,72,962

హ్యుందాయ్ క్రెటా ఫీచర్లు

హ్యుందాయ్ క్రెటా కేవలం ఒక కారు మాత్రమే కాదు, ఇది స్టైల్, సౌకర్యం, అధునాతన సాంకేతికత అద్భుతమైన కలయిక. దీని టాప్-లెవెల్ ఫీచర్లు దీన్ని దాని విభాగంలో అత్యధికంగా అమ్ముడయ్యే SUVగా చేస్తున్నాయి.  ఈ కారులో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది, ఇది ఆండ్రాయిడ్ ఆటో,  యాపిల్ కార్‌ప్లేలను సపోర్ట్ చేస్తుంది. అదనంగా, ఇందులో పనోరామిక్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి ప్రీమియం ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ అన్ని సౌకర్యాల కారణంగా క్రెటా డ్రైవింగ్‌ను సులభతరం చేయడమే కాకుండా, లగ్జరీ అనుభూతిని కూడా అందిస్తుంది.

ఇంజిన్ పనితీరు

హ్యుందాయ్ క్రెటాలో మూడు రకాల ఇంజిన్ ఎంపికలు లభిస్తాయి, ఇవి అన్ని రకాల డ్రైవర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు.  మొదటిది 1.5 లీటర్ MPi పెట్రోల్ ఇంజిన్, ఇది నాచురల్లీ ఆస్పిరేటెడ్,  సింపుల్, ఫ్యూయల్ ఎఫిషియంట్ డ్రైవింగ్‌ను అందిస్తుంది. రెండో ఎంపిక 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్, ఇది ఎక్కువ శక్తి,  స్పోర్టీ అనుభవానికి అనుకూలం. మూడో ఎంపిక 1.5 లీటర్ CRDi డీజిల్ ఇంజిన్, ఇది దూర ప్రయాణాలు, అద్భుతమైన మైలేజ్‌కు ప్రసిద్ధి చెందింది. మైలేజ్ విషయంలో హుండై క్రెటా 17 కిలోమీటర్లు నుండి 21 కిలోమీటర్లు వరకు ఇస్తుంది. ఇందులో మాన్యువల్, ఆటోమేటిక్ రెండు రకాల ట్రాన్స్‌మిషన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.

తాజా ADAS టెక్నాలజీతో అమర్చారు

సేఫ్టీ విషయంలో కూడా హ్యుందాయ్ క్రెటా ఎవరికీ వెనుకంజ వేయదు. ఈ SUV అనేక ఆధునిక భద్రతా ఫీచర్లతో అమర్చారు.  వీటిలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS,  EBD వంటి బేసిక్ సేఫ్టీ ఫీచర్లతోపాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్ స్టార్ట్ అసిస్ట్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్ ఉన్నాయి. అదనంగా, కొత్త క్రెటాలో లెవెల్ 2 ADAS టెక్నాలజీ అందించారు.  ఇది దీన్ని మరింత సురక్షితంగా చేస్తుంది. ఈ సాంకేతికత ద్వారా ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్-కీపింగ్ అసిస్ట్, బ్లైండ్-స్పాట్ డిటెక్షన్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లు లభిస్తాయి. మొత్తంమీద, ఈ కారు మీకు స్టైల్ , సౌకర్యంతో పాటు సురక్షితమైన డ్రైవింగ్ అనుభవాన్ని కూడా అందిస్తుంది.