Hyderabad Crime News: అద్దె ఇంటి బాత్రూమ్ బల్బులో సీసీ కెమెరా! హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన!
హైదరాబాద్ లో అద్దె ఇంటి బాత్ రూమ్ లో సీసీ కెమెరాలు అమర్చిన ఘటన పెనుదుమారం రేపుతోంది. ఇంటి ఓనర్, ఎలక్ట్రీషియన్ కలసి అశ్లీల వీడియోలను చూసేందుకు ప్లాన్ చేసిన తీరు టెనెంట్స్ లో ఆందోళన కలిగిస్తోంది.

Hyderabad Crime News: హైదరాబాద్‌లో షాపింగ్ మాల్స్ ట్రైల్ రూమ్‌లో సీసీ కెమెరాలు పెట్టి అడ్డంగా దొరికిపోయిన ఘటనలు అనేకం, ఆ తరువాత లేడిసీ హాస్టల్స్ , కాలేజి హాస్టల్స్ బాత్ రూమ్ లో సైతం సీసీ కెమెరాలు పెట్టి బుక్కైన సందర్భాలు అనేకం. అయితే తాజాగా హైదరాబాద్ లో అద్దె ఇంటి ఓనర్లు కొందరు బరితెగించి, ఏకంగా టెనెంట్స్ బాత్ రూమ్ లో సీసీ కెమెరాలు పెడుతున్నారు. తాజాగా మధురానగర్ పీఎస్ పరిధిలోని జవహార్ నగర్ లో వెలుగు చూసిన ఘటన హైదరాబాద్ నగరంలో పెను సంచలనంగా మారింది. జవహార్ నగర్ లోని అశొోక్ యాదవ్ అనే ఇంటి యజమాని తన ఇంట్లో అద్దెకు ఉంటున్నవారి బాత్ రూమ్ లో సీసీ కెమెరాలు అమర్చిన తీరు టెనెంట్స్ లో ఆందోళన కలిగిస్తోంది.
టెనెంట్స్ బాత్ రూమ్ బల్బులో సీసీ కెమెరా ఎలా పెట్టాడంటే..?
జవహార్ నగర్‌లోని అశోక్ యాదవ్ అనే ఇంటి యజమాని తన ఇంట్లో అద్దెకు ఉంటున్న ఫ్యామిలీని టార్గెట్ చేశాడు. వారి ఇంట్లో ఎవరూ లేని సమయంలో వెళ్లి బాత్ రూమ్ లో సీసీ కెమెరా పెట్టాలని ఫిక్స్ అయ్యాడు. భార్య భర్తలిద్దరూ ఉదయం ఉద్యోగాలకు వెళ్లి, సాయంత్రం ఇంటికి రావడం గమనించాడు. ఈనెల 4వ తేదీన బాత్ రూమ్ లో హోల్డర్స్ మార్చాలి కొత్త హోల్డర్స్ వేయాలంటూ చెప్పి , ఇంటి తాళం తీసుకున్నాడు అశోక్. బాత్ రూమ్ లో లైట్ లోపల సీసీ కెమెరా అమర్చేందుకు ఎలక్ట్రీషియన్ చింటూ సహాయం తీసుకున్నాడు. హోల్డర్ మార్చి, బోల్డర్ లోపల సీసీ కెెమెరా అమర్చారు. సీసీ కెమెరా అమర్చడంతో స్క్రూలు పట్టకపోవడంతో , చుట్టూ టేప్ వేశారు. ఒక్క స్క్రూ మాత్రం బిగించి వదిలేశారు. అలా బాత్ రూమ్ లో ఉన్న బల్బుకు అమర్చిన సీసీ కెెమెరాను ఫోన్ కు అనుసంధానం చేసి, బాత్ రూమ్ లో మహిళ స్నానం చేసే సమయంలో వీడియోలు ఫోన్ లో చూసేవాడు. అలా ఫోన్ లో చూసిన వీడియోలను రికార్డ్ చేసేవాడు. ఇలా బాత్ రూమ్ లో సీసీ కెమెరా ద్వారా అద్దెకు ఉంటున్న వివాహిత వీడియోలను గుట్టుచప్పుడు కాకుండా రికార్ట్ చేసేవాడు ఇంటి యజమాని అశోక్ యాదవ్.
బాత్ రూమ్ లో సీసీ కెమెరా ఎలా చిక్కింది..?
ఈనెల 4వ తేదీ నుంచి బాత్ రూమ్ బల్బులో సీక్రెట్ గా అమర్చిన సీసీ కెమెరా ద్వారా వీడియోలను ఎలక్ట్రీషియన్ చింటూకు సైతం షేర్ చేసేవాడని సమాచారం. ఇలా గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లో అద్దెకు ఉంటున్న వివాహిత వీడియోలను ఫోన్ చూస్తూ శునకానందం పొందేవాడు ఇంటి ఓనర్ అశోక్ యాదవ్. ఈనెల 13వ తేదీన బాత్ రూమ్ లో స్నానం చేస్తున్న సమయంలో సీసీ కెమెరా అమర్చిన బల్బు హోల్డర్ నుంచి లైట్ బ్లింక్ అవ్వడం గమనించిన టెనెంట్ ఫ్యామిలీ వెంటనే ఈ విషయాన్ని ఓనర్ కు చెప్పారు. ఇందులో సీసీ కెమెరా పెట్టినట్లు నాకు తెలియదు, ఎలక్ట్రీషియన్ చింటూను అడుగుతానిని చెప్పడంతో, అనుమానం వచ్చిన టెనెంట్ ఫ్యామిలీ షీటీమ్ ను ఆశ్రయించారు. షీటీమ్ రంగంలోకి దిగడంతో బాత్ రూమ్ కెమెరా బాగోతం వెలుగు చూసింది. ఇంటి ఓనర్ అశోక్ ను అదుపులోకి తీసుకున్న షీటీమ్ తమదైన స్టైల్ లో విచారిస్తున్నారు.
కేసును మధురానగర్ పిఎస్ కు బదిలీ చేయడంతో ,కేసులో మరో నిందితుడు ఎలక్ట్రీషియన్ చింటూ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగి, మొత్తానికి పాత్రదారి చింటూని సైతం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బాత్ రూమ్ లో సీసీ కెమెరా ద్వారా రికార్డ్ చేసిన వీడియోలను ఏదైనా వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తున్నారా, వివాహిత ప్రైవేటు వీడియోలను ఏం చేేసేవారు అనే విషయాలనను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు మధురానగరక్ పోలీసులు. ఇలా ఇంటి ఓనర్ కదా అని నమ్మి ఇంటి తాళాలు ఇస్తే ,ఏకంగా బాత్ రూమ్ బల్బులో సీసీ కెమెరాలు పెట్టిన తీరు అద్దెకు ఉండే కుటుంబాల్లో ఆందోళన కలిగిస్తోంది.





















