Chandrababu visits Pawan Kalyans residence In Hyderabad |హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. ఆదివారం (సెప్టెంబర్ 28) మధ్యాహ్నం 2.40 గంటలకు హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి డిప్యూటీ సీఎంను చంద్రబాబు పరామర్శించారు. గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్‌తో ఇబ్బంది పడుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ మంగళగిరి నుంచి ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ వచ్చారు. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం నివాసానికి వెళ్లగా పవన్ కళ్యాణ్ స్వయంగా బయటకు వచ్చి పుష్పగుచ్ఛం ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు.

Continues below advertisement

పవన్, చంద్రబాబు భేటీపై ఉత్కంఠ

Continues below advertisement

ఇటీవల ఏపీ అసెంబ్లీలో కామెంట్లు, దానికి చిరంజీవి కౌంటర్ ఇచ్చిన తాజా పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల ఏపీ అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. వాస్తవానికి అది సందర్భం కాకపోయినా కామినేని శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలపై బాలయ్య ఘాటుగా స్పందించారు. వాడెవడూ గట్టిగా అడగలేదని, అడగడంతో ఎవరూ దిగిరాలేదని బాలకృష్ణ అన్నారు. తనకు ఆహ్వానం అందినా లిస్టులో 9వ పేరు తనదని, ఇంతకంటే దారుణం ఏమంటుందనే తీరుగా బాలయ్య అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. తాను ముఖ్యమంత్రినైనా, సాధారణ వ్యక్తికైనా గౌరవం ఇచ్చి మాట్లాడతానని చిరంజీవి పేరిట లేఖ విడుదల కావడంతో వివాదం మరింత ముదిరిందని తెలిసిందే. ఈ వివాదంపై పవన్ కళ్యాణ్ ఇప్పటివరకూ స్పందించలేదు.

పవన్ కళ్యాణ్‌కు వైరల్ ఫీవర్రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైరల్ జ్వరంతో బాధపడుతున్నారు. గత నాలుగు రోజులుగా వైద్యం చేయించుకుంటున్నారు. జ్వరం తీవ్రత తగ్గలేదు అని, దగ్గు ఎక్కువగా ఉండటంతో ఇబ్బంది పడుతున్నారని జనసేన రెండు రోజుల కిందట ఓ ప్రకటనలో తెలిపింది. డాక్టర్ల సూచనల మేరకు హైదరాబాద్ లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. రెండు రోజుల కిందట పవన్ కల్యాణ్ మంగళగిరి నుంచి హైదరాబాద్ వచ్చారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు హైదరాబాద్ లోని పవన్ నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

ప్రధాని పర్యటన, ఆటో డ్రైవర్ల సేవలో, జీఎస్టీ ఉత్సవ్‌పై చర్చ

*హైదరాబాద్,  అక్టోబర్ 4వ తేదీన ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభించనున్న నేపథ్యంలో ఆ  అంశంపై డిప్యూటీ సీఎం తో చర్చించారు. ఆటో డ్రైవర్ల కోసం చేపట్టే ఈ పథకం కూడా మన్ననలు పొందుతుందనే విశ్వాసం ఉన్నట్లు పవన్ తెలిపారు.  జీఎస్టీ 2.0 సంస్కరణలలో భాగంగా రాష్ట్రంలో చేపట్టనున్న జీఎస్టీ ఉత్సవ్‌ కార్యక్రమం నిర్వహణపైనా చర్చించారు. వచ్చే నెల 16వ తేదీన ప్రధాని మోదీ శ్రీశైలం రానున్న సందర్భంగా రోడ్ షో నిర్వహణ విజయంతం చేసే అంశంపై ఇరువురు నేతలు మాట్లాడుకున్నారు. వీటితో పాటు డీఎస్సీ అంశం కూడా ఇద్దరు నేతల మధ్య చర్చకు వచ్చింది. మెగా డీఎస్సీని విజయవంతంగా నిర్వహించి ఒకేసారి 15,941 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వడాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నియామక పత్రాలు అందించే కార్యక్రమాన్ని నిర్వహించి యువతలో మనోధైర్యాన్ని, స్ఫూర్తిని నింపారని ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. *******

కామినేని, బాలయ్య వ్యాఖ్యలు తొలగింపు

ఈ నెల 25న ఏపీ అసెంబ్లీలో శాంతిభద్రతల అంశంపై చర్చ సందర్భంగా కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌ మాటలు, దానికి ప్రతిస్పందనగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు నిర్ణయించారు. గురువారం సభలో తాను చేసిన కొన్ని వ్యాఖ్యలు అపార్థం చేసుకున్నారని, తన వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగించాలని కామినేని శనివారం నాడు స్పీకర్‌ స్థానంలో కూర్చున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కోరారు. కామినేని అభ్యర్థనను గౌరవించి ఆయన వ్యాఖ్యలను, అందుకు అనుబంధంగా ఉన్న ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. కామినేని వ్యాఖ్యలు మాత్రమే తొలగించడం కాదు, అందుకు రియాక్షన్ గా బాలయ్య చేసిన వ్యాఖ్యలను సైతం తొలగించనున్నారు.