News
News
వీడియోలు ఆటలు
X

టేస్ట్ అదిరింది- నీరాపై ఏపీ మంత్రి జోగి రమేష్ కామెంట్‌

హైదరాబాద్లోని నీరా కేఫ్ సందర్శించిన ఏపీ మంత్రి జోగి రమేష్. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి టేస్ట్ చూసి ఫిదా అయ్యారు. ప్రకృతి సిద్ధంగా తయారు చేసిన నీరా రుచి అదిరిపోయిందన్నారు.

FOLLOW US: 
Share:

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైద‌రాబాద్ నగరం నెక్లెస్ రోడ్డులో ప్ర‌తిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన నీరా కేఫ్‌ను మంగళవారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ‌ మంత్రి జోగి రమేష్, తనయుడు జోగి రాజీవ్‌తో కలిసి సందర్శించారు. ప్ర‌కృతి సిద్ధ‌మైన, స్వ‌చ్ఛ‌మైన నీరాను తెలంగాణ సర్కార్ అందిస్తోందని ప్రశంసించారు.

నీరా టేస్ట్ చేసిన ఏపీ మంత్రి జోగి రమేష్

ఈ నీరా కేఫ్ ను సందర్శించడానికి వచ్చిన మంత్రి  జోగి రమేష్ కి తెలంగాణ రాష్ట్ర మంత్రి  శ్రీనివాస్ గౌడ్  పుష్ప గుచ్చాలతో స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. మంత్రి జోగి రమేష్ కి ఈ నీరా కేఫ్ లో లభ్యమవుతున్న ఉత్పత్తుల గురించి వివరించారు. అందరూ కలిసి నీరా టేస్ట్ చేశారు. ఏపీ, తెలంగాణ మంత్రులతోపాటు సినీ నటుడు తల్వార్ సుమన్, తెలంగాణ రాష్ట్ర ముఖ్య ప్రజాప్రతినిధులు నాయకులు, గౌడ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.

మే 3న హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో తెలంగాణ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్.. నీరా కేఫ్ ప్రారంభించారు. అనంతరం స్వామీజీలతో కలసి వేదికపై నీరా పానియాన్ని సేవించారు. నీరాలో సున్నా శాతం ఆల్కహాల్ ఉంటుందని.. ఇది హానికరమైన పానియం కాదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. నీరా పానియంపై ఎవరూ తప్పుడు ప్రచారం చేయొద్దని.. వీలైనంత వరకు దీన్ని ప్రతిరోజూ తాగాలని సూచించారు. ముఖ్యంగా వేసవి కాలంలో ఇతర డ్రింక్స్ కంటే దీన్ని తాగడం మేలని చెప్పారు.

రాష్ట్రంలో రైతు బీమా అమలు చేస్తున్నట్లుగానే కల్లుగీత కార్మికుల కోసం ‘గీత కార్మికుల బీమా’ ను అమలు చేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ట్విట్టర్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే కల్లుగీస్తూ ప్రమాదవశాత్తూ ప్రాణాలను కోల్పోయిన గీత కార్మికుని కుటుంబానికి రూ. 5 లక్షల బీమా సాయాన్ని నేరుగా వారి ఖాతాలో జమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుందని వివరించారు. 

Published at : 17 May 2023 07:20 AM (IST) Tags: ANDHRA PRADESH YSRCP BRS Telangana News Neera Cafe Jogi Ramesh Visits Neera Cafe

సంబంధిత కథనాలు

మార్గదర్శి కేసులో ప్రభుత్వం దూకుడు- ఆస్తులు అటాచ్‌ చేసేందుకు సీఐడీకీ అనుమతి

మార్గదర్శి కేసులో ప్రభుత్వం దూకుడు- ఆస్తులు అటాచ్‌ చేసేందుకు సీఐడీకీ అనుమతి

Raghunandan Rao: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు లీగల్ నోటీసులు, రూ.1000 కోట్ల పరువునష్టం దావా

Raghunandan Rao: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు లీగల్ నోటీసులు, రూ.1000 కోట్ల పరువునష్టం దావా

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

TSPSC Paper Leak: పేపర్ లీక్ కేసులో సంచలనం, ఎగ్జామ్ లో బ్లూటూత్ వాడిన ముగ్గురు అభ్యర్థుల అరెస్ట్

TSPSC Paper Leak: పేపర్ లీక్ కేసులో సంచలనం, ఎగ్జామ్ లో బ్లూటూత్ వాడిన ముగ్గురు అభ్యర్థుల అరెస్ట్

టాప్ స్టోరీస్

Andhra Politics : వైఎస్ఆర్‌సీపీని విమర్శించి అంతకు మించి ఉచిత హామీలు - చంద్రబాబు నిధులెక్కడి నుంచి తెస్తారు ?

Andhra Politics :  వైఎస్ఆర్‌సీపీని విమర్శించి అంతకు మించి ఉచిత హామీలు - చంద్రబాబు నిధులెక్కడి నుంచి తెస్తారు ?

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!

MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?

MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం