అమూల్య శ్రీ ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు మేఘావత్ మహేష్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన కొన్నిరోజులకే తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Hyderabad Crime News: నటి అమూల్య శ్రీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం.. ఉరేసుకున్న ప్రధాన నిందితుడు
Hyderabad Crime News | షార్ట్ ఫిల్మ్స్ నటి అమూల్య శ్రీ ఆత్మహత్య కేసులో జైలు నుంచి బెయిల్‌పై వచ్చిన ప్రధాన నిందితుడు మహేష్ సింగరేణి కాలనీలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

- అమూల్యశ్రీ కేసు నిందితుడు మహేష్ బెయిల్‌పై వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు.
- ఇంట్లో ఉరివేసుకున్న మహేష్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
- బాత్రూమ్ వీడియోలతో వేధించబడటంతో అమూల్యశ్రీ గతంలో ఆత్మహత్య చేసుకుంది.
- బెదిరింపులు, చట్టపరమైన భయం కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Short Film Actress Suicide Case | హైదరాబాద్: సైదాబాద్ సింగరేణి కాలనీలో సంచలనం సృష్టించిన షార్ట్‌ఫిల్మ్ నటి అమూల్య శ్రీ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మేఘావత్ మహేష్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన కొన్నిరోజులకే ఆత్మహత్య చేసుకున్నాడు. సింగరేణి కాలనీలోని తన నివాసంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
అమూల్య శ్రీ ఆత్మహత్య కేసులో మహేష్‌పై సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం చంచల్‌గూడ జైలుకు రిమాండ్ ఖైదీగా తరలించారు. జైలులో ఉన్న అతడు ఇటీవల కోర్టు బెయిల్ ఇవ్వడంతో విడుదలయ్యాడు. అయితే, విడుదలైన కొద్ది వ్యవధిలోనే మహేష్ ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమూల్య తల్లి, కుటుంబ సభ్యులు ప్రస్తుతం ప్రాణ భయంతో అజ్ఞాతంలోకి వెళ్లారు. వారిని చంపేస్తామని కుటుంబసభ్యుల బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది.
పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ ద్వారా కీలక ఆధారాలను సేకరించిన అధికారులు, మహేష్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని కాల్ లాగ్స్, డేటాను విశ్లేషిస్తున్నారు. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత అతడిని ఎవరైనా బెదిరించారా? లేదా కేసు విచారణ, చట్టపరమైన చర్యల భయంతోనే సూసైడ్ చేసుకున్నాడా, లేక ఎవరైనా హత్య చేశారా అనే పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
సినిమాల్లో హీరోయిన్‌గా రాణించాలనే ఆశయంతో హైదరాబాద్ వచ్చిన షార్ట్ ఫిల్మ్ నటి అమూల్య శ్రీ జీవితం తీవ్ర విషాదాంతమైంది. తన నటన, ప్రతిభతో గుర్తింపు తెచ్చుకుని వెండితెరపై మెరవాలని కష్టపడుతున్న సమయంలోనే ఆమె పాలిట కొందరు కామాంధులు తోడేళ్లుగా మారారు. ఆమెకు సంబంధించిన బాత్రూం వీడియోలను రహస్యంగా రికార్డు చేసిన నిందితులు, 6 నెలలుగా వాటిని అడ్డుపెట్టుకుని తమ కోరికలు తీర్చాలంటూ తీవ్రంగా బెదిరింపులకు పాల్పడ్డారు. వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామంటూ మానసికంగా వేధించడంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది.
ఈ వేధింపులపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, వారి నుంచి తగిన రీతిలో స్పందన లేకపోవడంతో కుటుంబం ఆవేదన చెందినట్లు తెలిపారు. సమస్య తీరుతుందేమోనని కొంతకాలం ఎదురుచూసిన నటి అమూల్య శ్రీ, చివరికి నిందితుల భరించలేక, తీవ్ర మనస్తాపంతో జూన్ నెలలో ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. చేతికి అందివచ్చిన కూతురు జీవితంలో ఎదుగుతుందని ఆశించిన తల్లిదండ్రులకు నిరాశే మిగిలింది.
Frequently Asked Questions
షార్ట్‌ఫిల్మ్ నటి అమూల్య శ్రీ ఆత్మహత్య కేసులో ఎవరు మరణించారు?
మహేష్ మరణంపై పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేస్తున్నారు?
మహేష్‌ను ఎవరైనా బెదిరించారా, చట్టపరమైన చర్యల భయంతో ఆత్మహత్య చేసుకున్నాడా, లేదా ఎవరైనా హత్య చేశారా అనే పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతని మొబైల్ ఫోన్‌ను విశ్లేషిస్తున్నారు.
అమూల్య శ్రీ ఆత్మహత్యకు గల కారణం ఏమిటి?
నిందితులు ఆమె బాత్రూమ్ వీడియోలను రహస్యంగా రికార్డు చేసి, వాటిని అడ్డుపెట్టుకుని 6 నెలలుగా బెదిరించి, వేధించడంతో ఆమె తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది.
అమూల్య శ్రీ వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసిందా?
అవును, వేధింపులపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, వారి నుంచి తగిన రీతిలో స్పందన లేకపోవడంతో కుటుంబం ఆవేదన చెందినట్లు తెలిపారు.
ట్రెండింగ్ వార్తలు






















