శతాధిక సంవత్సరాలుగా మీడియా రంగంలో తమదైన ముద్రవేసి ముందుకు సాగుతోంది ఏబీపీ నెట్‌వర్క్. తెలుగు రాష్ట్రాల సంస్కృతి, స్ఫూర్తిని ప్రతిబింబిస్తోన్న ఏబీపీ నెట్‌వర్క్‌కు చెందిన డిజిటల్ ఛానల్ ABP Desam ఇదివరకే హెల్త్ కాంక్లేవ్, ఏపీబీ సదరన్ రైజింగ్ సమ్మిట్ లాంటి ఈవెంట్స్ నిర్వహించండలో గ్రాండ్ సక్సెస్ అయింది. నేడు ఏబీపీ దేశం స్మార్ట్‌ఎడ్ కాంక్లేవ్‌కు శ్రీకారం చుట్టింది. ఏబీపీ నిర్వహిస్తున్న స్మార్ట్‌ఎడ్ కాంక్లేవ్ (SmartED Conclave 2025) మే 16న బంజారా హిల్స్‌లోని రాడిసన్ బ్లూలో ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. 

ఈ స్మార్ట్‌ఎడ్ కాంక్లేవ్‌కు  నేతలు, టెక్ నిపుణులు, యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్, పలువురు ఆవిష్కర్తలు, నిపుణులు ఒకే వేదిక మీదకు రానున్నారు. సాంకేతికత, ఆవిష్కరణల ద్వారా విద్యా రంగం భవిష్యత్తు ఎలా ఉండనుందనే అంశంపై వీరు తమ విలువైన అభిప్రాయాలు షేర్ చేసుకుంటారు. విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ కార్యక్రమం విద్య, ఉద్యోగ మార్కెట్, బెస్ట్ ఎడ్యుకేషన్ వాతావరం కల్పించడం, చదువులో టెక్నాలజీ వినియోగంపై స్మార్ట్‌ఎడ్ కాంక్లేవ్ ఓ చర్చా వేదికగా మారింది. 

స్మార్ట్‌ఎడ్ కాన్‌క్లేవ్ 2025 సెషన్‌లు

ట్రైబల్ టు లీడర్‌షిప్, స్కిల్ నెక్ట్స్, స్మార్ట్ హయ్యర్ ఎడ్యుకేషన్, ఇంజినీరింగ్ 2.0, ఎడ్యుకేషన్‌లో బ్యాంకుల పాత్ర, నెక్ట్స్ జనరేషన్ ఆఫ్ సైబర్ డిఫెండర్స్, ఏఐ టైంలో ఎథికల్ లెర్నింగ్, త్రీడీలో ఎడ్యుకేషన్, క్యాంపస్ నుంచి స్టార్టప్‌ల ఏర్పాటు, పాలసీ విత్ పర్పస్ లాంటి అంశాలపై వక్తలు తమ విలువైన అభిప్రాయాలు షేర్ చేసుకోవడంతో పాటు విద్యార్థులకు కెరీర్‌కు సంబంధించి కీలక సూచనలు చేయనున్నారు. ఈ ఎడ్యుకేషన్ కాన్​ క్లేవ్​కి ఎవరైనా హాజరుకావొచ్చు. 

తెలుగు రాష్ట్రాల్లో విద్యా రంగంలో పురోగతిని, ఫ్యూచర్ ఎడ్యుకేషన్ మార్పులపై అథిథులు తమ విలువైన అభిప్రాయాలను షేర్ చేసుకునేందుకు ఇది ఓ ప్రత్యేక కార్యక్రమం. దీని ద్వారా నేతలు, విద్యావేత్తలు, నిపుణులను ఒకచోట చేర్చి రాష్ట్రంలో విద్య రంగం భవిష్యత్తును రూపొందించే  ఆవిష్కరణలపై చర్చించడానికి, విద్యా రంగంలో ప్రభావవంతమైన మార్పులపై చర్చిస్తారు. 

ఈ కార్యక్రమానికి భారత ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అయిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ వీసీ  వి.ఎల్.వి.ఎస్.ఎస్. సుబ్బారావు, తెలంగాణ సాంకేతిక విద్య కమిషనర్ శ్రీదేవసేన, BC రాయ్ ఇంజినీరింగ్ కాలేజీ జనరల్ సెక్రటరీ తరుణ్ భట్టాచార్య, జోనల్ హెడ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ ధారాసింగ్ నాయక్, రీసెర్చ్ అండ్ ఆపరేషన్స్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ సైబర్ ఇంటెలిజెన్స్ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్స్ (CRCIDF) డైరెక్టర్ డాక్టర్ ప్రసాద్ పాటిబండ్ల, రూట్స్ కొలీజియం చైర్మన్ బిపి పడాల, Ekalasala మేనేజింగ్ డైరెక్టర్ నరేష్ వట్టికుట్టి, బ్రాండింగ్ ICFAI గ్రూప్ డైరెక్టర్ సుధాకర్ రావు, ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ కుమార్, నటి రూప పాల్గొని తమ విలువైన అభిప్రాయాలను ఈ వేదికగా అందరితో షేర్ చేసుకుంటారు.

ఏబీపీ నెట్‌వర్క్ రీజనల్ మీడియా అయిన ABP దేశం తెలుగు రాష్ట్రాల్లోని లక్షలాది మంది వ్యూయర్స్, రీడర్స్‌తో కనెక్ట్ అవుతోంది. తమ ప్రభావవంతమైన కథనాలు, విశ్లేషణలతో ముందుకు సాగుతోంది. విభిన్నమైన, అర్థవంతమైన వార్తా కథనాలతో ప్రేక్షకులను ప్రేరేపిస్తోంది.