Telangana Flood Effect: తెలంగాణ వ్యాప్తంగా వరదలు అనేక జిల్లాలను కోలుకోలేని దెబ్బకొట్టాయి. గ్రామాలకు గ్రామాలే ముంపు బారినపడ్డాయి. పెద్ద పెద్ద బిల్డింగ్‌లు సైతం నీట మునగక తప్పలేదు. అంతలా వరద బీభత్సం సృష్టించింది. ఈ ప్రభావం విద్యుత్ శాఖపై గట్టిగానే కనిపించింది. మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో పలు ప్రాంతాల్లో చెరువులు, కుంటలు, నదులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. వరద కారణంగా పలు సబ్ స్టేషన్లలో నీరు చేరడం, విద్యుత్ స్తంభాలు దెబ్బతినడం వలన పలు గ్రామాల్లో విద్యుత్ పంపిణి వ్యవస్థ స్తంభించింది. తమ సిబ్బంది జోరు వాన, భారీ వరదను సైతం లెక్కజేయకుండా, నదులు ఈదుకుంటూ విద్యుత్ స్తంభాలు ఎక్కి మరీ యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేస్తున్నారని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ, ఐఏఎస్ తెలిపారు.
⚡ #TGNPDCL # Kamareddy # Power Supply Update ⚡ 🔧 On 11KV SS Nagar – MHQR feeder, a failed insulator was replaced by our staff working in waterlogged conditions. 🌊✅ Supply restored successfully. pic.twitter.com/cXsebdRqN8
— TGNPDCL (@TG_NPDCL) August 27, 2025 images/2025/08/28/27f77fa33663f46843c294946b547ec11756389640677479_original.jpeg" width="423" height="565" />
సంస్థ చీఫ్ ఇంజినీర్ల, సూపరింటెండింగ్ ఇంజినీర్లతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో వరద ప్రభావిత గ్రామాల్లో, పట్టణాల్లో విద్యుత్ సరఫరా పరిస్థితిని సమీక్షించారు. వర్షం ప్రభావంతో మెదక్ జిల్లాలో విద్యుత్ శాఖకు భారీ స్థాయిలో నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. మెదక్ జిల్లాలో వరద ప్రభావానికి కొన్ని చోట్ల సబ్ స్టేషన్లలో నీళ్లు చేరడంతో గత రెండు రోజులుగా విద్యత్ సరఫరా నిలిచిపోయింది. 33 కేవి ఫీడెర్స్ - 11, 11 కేవీ ఫీడర్స్ - 175 , డిస్ట్రిబ్యూషన్ ట్రాన్సఫార్మర్లు 262, విద్యుత్ స్తంభాలు 971 దెబ్బతిన్నడంతోపాటు కొన్నివందల కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్ చెడిపోయిందని విద్యుత్ శాఖ ప్రకటించింది.
మెదక్ జిల్లాతో పాటు, నల్గొండ, గద్వాల్, యాదాద్రి, సంగా రెడ్డి, నారాయణపేట జిల్లాల పరిధిలో కూడా నష్టం తప్పలేదు. మొత్తం మీద సంస్థ పరిధిలో వరద ప్రభావానికి 33 కేవి ఫీడెర్స్ - 39, 11 కేవీ ఫీడర్స్ - 296 , డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు - 280, విద్యుత్ స్తంభాలు 1357 దెబ్బతిన్నాయని, వరద ఇంకా కొనసాగుతుండటం వలన నష్టాలు మరింతగా పెరిగే అవకాశం వున్నదని చీఫ్ ఇంజినీర్ ప్రకటించారు.
భారీ వర్షాల వల్ల వినాయక చవిత పండుగ రోజు కూడా మొత్తం విద్యుత్ అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఎక్కడ విద్యుత్ ప్రమాదాలు జరగకుండాతగిన చర్యలు తీసుకున్నారు. భారీ వరద ప్రభావంతో మెదక్ జిల్లాల్లో 15 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోగా, విద్యుత్ సిబ్బంది అహర్నిశలు శ్రమించి 10 గ్రామాల్లో సరఫరా రాత్రికి రాత్రే పునరుద్ధరించారు. భారీ వర్షానికి తోడు, రహదారులు కూడా పూర్తిగా దెబ్బతినడంతో మిగిలిన గ్రామాల్లో మొదటి రోజు సరఫరా పునరుద్దరించలేక పోయామని, గురువారం సాహసోపేత చర్యలతో విద్యుత్ సరఫరా పునరుద్దరించారు. రాజీపేట్ గ్రామంలో ఉన్న నదిలోకి దిగి ఫీడెర్ మరమత్తులు చేసి మరీ అనేక వరద ప్రభావిత గ్రాామాల్లో విద్యుత్ అందించారు. వరద తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాల్లో విద్యుత్ సిబ్బంది అధికారులు అప్రమత్తంగా ఉండి, యుద్ధప్రాతిపదికన పునరుద్దరణ పనులు చేయడం వల్ల అతి తక్కువ సమయంలోనే విద్యుత్ సరఫరా అందుబాటులోకి వచ్చింది.