Traffic Challans Extended : తెలంగాణలో ట్రాఫిక్‌ చలాన్ల రాయితీ గడువును ప్రభుత్వం మరో 15 రోజులు పొడిగించింది. ఏప్రిల్ 15 వరకు చలాన్లపై రాయితీని పొడిగిస్తున్నట్లు హోంమంత్రి మహమూద్ అలీ ప్రకటించారు. పెండింగ్‌ చలాన్ల ద్వారా ఇప్పటివరకు రూ.250 కోట్లు వసూలు అయినట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రెండు కోట్ల 40 లక్షల చలాన్లు కట్టారని మహమూద్ అలీ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో మార్చి 1 నుంచి 31వ తేదీ వరకు పెండింగ్ లో ఉన్న  చలాన్లపై రాయితీ గడువు మరో 15 రోజుల పాటు పొడిగిస్తున్నామని మహమూద్ అలీ తెలిపారు. ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల 40 లక్షల చలాన్లు చెల్లించారని, వీటి అసలు విలువ రూ.840 కోట్ల తెలియజేశారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఇప్పటివరకు రూ.250 కోట్ల రూపాయలు చెల్లించి పెండింగ్ చలానాలు క్లియర్ చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 52% మోటారు వాహన యజమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారన్నారు.


ఏప్రిల్ 15 వరకు రాయితీ 


సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి విశేష స్పందన రావడంతో పాటు ఈ అవకాశాన్ని పొడిగించాలని అనేక విజ్ఞప్తులు వచ్చాయని హోంమంత్రి అన్నారు. దీంతో మరో పదిహేను రోజుల పాటు ఏప్రిల్ 15 వ తేదీ వరకు పెండింగ్ చలానాలపై రాయితీ అవకాశాన్ని పొడిగించామన్నారు. కరోనా వల్ల పేదలు, మధ్య తరగతి ప్రజలు గత రెండేళ్లుగా ఆర్థిక ఇబ్బందులను పడుతున్నారని, వాటిని పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇంతవరకూ చలాన్లు చెల్లించలేక పోయినవారు ఈ రాయితీ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ-చలాన్ వెబ్ సైట్ లో ఆన్లైన్ పేమెంట్ ద్వారా చలాన్లు క్లియర్ చేసుకోవాల్సిందిగా రాష్ట్ర హోంమంత్రి తెలిపారు.


చలాన్ల రాయితీలు 



  • 2W/3W- చలాన్ నగదులో 25% చెల్లిస్తే సరిపోతుంది. మిగతా బ్యాలన్స్ 75% మాఫీ. 

  • RTC డ్రైవర్స్ 30% చెల్లిస్తే చాలు, మిగతా బ్యాలన్స్ 70% మాఫీ.

  • LMV/ HMV - 50% కట్టాల్సి ఉంటుంది. మిగతా బ్యాలవ్స్ 50% మాఫీ

  • తోపుడు బండ్ల వ్యాపారులు 20% కట్టాల్సి ఉంటుంది. మిగతా బ్యాలన్స్ 80% మాఫీ 

  • నో మాస్క్ కేసులు- రూ.100 కట్టాల్సి ఉంటుంది, మిగతా బ్యాలెన్స్ రూ. 900 మాఫీ

  • ఈ చలాన్లను వాహన యజమనులు ఆన్లైన్ సేవా  చెల్లింపుల ద్వారా గానీ, ఈ-సేవ, మీసేవ ద్వారా చెల్లింవవచ్చు.