హైదరాబాద్ నగర అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. నగరం చుట్టూ ప్రతిపాదించిన రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్ట్‌ కు కేంద్ర ప్రభుత్వం సర్వేకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం వల్ల నగర పరిసర ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ మరింత మెరుగవుతుంది. 

Continues below advertisement

మొదటి అడుగు – సర్వేకు అనుమతి

ఈ రైల్వే ప్రాజెక్టు పట్టాలెక్కాలంటే ముందుగా సర్వే జరగాలి. దాని తర్వాత DPR రూపొందించి... ప్రాజెక్టును కేటాయించి పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనికి ఆరంభ సూచికంగా సర్వేకు చేపడతారు. రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్టుకు సంబంధించి సర్వే నిర్వహించేందుకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సర్వే ఆధారంగా  డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) సిద్ధం చేసి నీతి ఆయోగ్ పరిశీలన కోసం పంపిస్తామని.. అక్కడ అనుమతి లభిస్తే.. తర్వాత ఆర్థిక శాఖ అనుమతితో రైల్వే శాఖ ఈ ప్రాజెక్టు చేపడుతుందని కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి వ్‌నీత్ సింగ్ తెలిపారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి రవ్‌నీత్ సింగ్ రాతపూర్వకంగా ఈ విషయాన్ని తెలియజేశారు. 

Continues below advertisement

RRR వెంట రైలు మార్గం

తెలంగాణ ఇప్పటికే ఉన్న అవుటర్‌ రింగ్ రోడ్ ఆవల రీజనల్ రింగ్ రోడ్డు నిర్మిస్తోంది. దాదాపు ౩50 కిలోమీటర్ల చుట్టుకొలతతో హైదరాబాద్ అవతల ఉన్న పట్టణాలను కలిపేలా దానిని నిర్మిస్తుున్నారు.  ఇది సంగారెడ్డి, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, నల్గొండ వంటి జిల్లాలను కలుపుతుంది.ఇప్పటికే చాలా వరకూ భూసేకరణ కూడా జరిగింది. ఈ రోడ్డు వెంబడే రీజనల్ రైల్వే ప్రాజెక్టును కూడా చేపట్టాలని ప్రతిపాదించారు 

రీజనల్ రైల్ ప్రాజెక్టుకు అనుగునంగా స్టేషన్ల అభివృద్ధి

రీజనల్ రైల్ ప్రాజెక్టును దృష్టిలో పెట్టుకునే శాటిలైట్ స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు. "హైదరాబాద్ నగరానికి ఆరు మార్గాల నుంచి రైల్వే లైన్‌లు కనెక్ట్ అవుతాయి. సౌత్ - నార్త్ నుంచి వచ్చే సరుకు రవాణా రైళ్లు కూడా ఈ మార్గాల ద్వారా నగరంలోకి వస్తున్నాయి. దీనివల్ల సిటీపై తీవ్రంగా ఒత్తిడి పెరుగుతోంది. వీటిని దూరంగానే డైవర్ట్ చేయగలిగితే.. నగరంలో ఉన్న స్టేషన్లలో ప్రయాణికుల రైళ్లను మంచిగా ఆర్గనైజ్‌ చేయగలుగుతాం. ఇప్పటికే రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తరం వైపు అలైన్‌మెంట్ సిద్ధమైంది. దానికి అనుగునంగానే రైల్వే లైన్ తెచ్చేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. దక్షిణం వైపు అలైన్‌మెంట్ కూడా పూర్తైతే.. దాని ప్రకారం రైల్వే ప్రాజెక్టు ఉంటుంది" అని చెప్పారు. చిట్యాల, మేడ్చల్, వికారాబాద్,షాద్ నగర్  స్టేషన్లు కీలకంగా మారతాయి. 

ఈ రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ అమలులోకి వస్తే:

* హైదరాబాద్ పరిసర జిల్లాలకు వేగవంతమైన రైలు కనెక్టివిటీ* నగర ట్రాఫిక్ ఒత్తిడి తగ్గే అవకాశం* పరిశ్రమలు, శాటిలైట్‌ టౌన్‌ల అభివృద్ధికి మార్గం..* సరుకు రవాణాకు ప్రత్యామ్నాయ మార్గం

వంటి ప్రయోజనాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

19 స్టేషన్లతో భారీ రైలు కారిడార్

ప్రాథమిక ప్రతిపాదనల ప్రకారం రీజనల్ రింగ్ రైలు సుమారు 360 కిలోమీటర్ల పరిధిలో నిర్మించి దాదాపు 19 స్టేషన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ మార్గం హైదరాబాద్ పరిసర ప్రాంతాలను నేరుగా రైల్వే నెట్‌వర్క్‌కు కలుపుతుంది.  రీజనల్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ అమలు అయితే నగర అభివృద్ధి పరిధి మరింత విస్తరించి, చిన్న పట్టణాల అభివృద్ధికి కొత్త దారులు తెరుస్తుందని రవాణా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.